సూక్ష్మజీవుల జాతి భేదములు


సూక్ష్మ జీవులు అనేక రోగ కారకాలు.

సూక్ష్మజీవుల జాతి భేదాలుసవరించు

  1. కొన్ని జాతుల సూక్ష్మజీవులు మనష్యుల ప్రాణ వాయువుండు చోట్లగానీ జీవింపనేరవు. ఇందు కొన్ని పులులు, సింహములవలె ప్రాణముండు భాగములను మాత్రము తిని బ్రతుకును. మఱి కొన్ని కాకులు కోళ్ళవలే ప్రాణము లేక క్రుళ్లిపోవు భాగములను కూడా తినును. తమ నడవడికలలో సామాన్యంగా పై రెండు జాతులును జంతువులను పోలి యుండుట చేత వీనికి సూక్ష్మ జంతువులు/జీవులని (ప్రొటోజావ్) అని పేరు. వీని యాహారము కేవల జంత్వాహారము (హోలోజొనిక్ నూట్రిషన్)
  2. మఱికొన్ని జాతుల సూక్ష్మ జీవులు కుక్క గొడుగుల వంటివి. ఇవి క్రుళ్లుచుండు పదార్థములలో మాత్రంమే పెరుగును. సజీవములగు జంతువులను గాని వృక్షములను గాని యివి తిన జాలవు. వీని యాహారము పూతికాహారము (Sapro Phytic Nutrition) అనగా మురికి వీని తిండి. వీనికి శిలీంద్రములు (పంగి ) అని పేరు. శిలీంద్రమనగా కుక్కగొడుగు.
  3. మఱికొన్ని జాతుల సూక్ష్మ జీవులు వృక్షముల వంటివి. ఇవి మాములు కంటికి కన్పించకున్నను, ఆకు పచ్చ నుండక పోయినను, చెట్లవలె బొగ్గు పుసుసు వాయువును కర్బనము క్రిందను, ప్రాణ వాయువు క్రిందను విడదీసి, కర్బనమును తమ శరీర పుష్టి కొరకు పయోగించు కొని ప్రాణ వాయువును విడచి వేయును. వీని యాహారము కేవలం వృక్షాహారము.

కాని కొన్ని సూక్ష్మ జీవులు కొంత ఆహారమును జంతువుల వలెను, కొంత ఆహారమును వృక్షముల వలెను, మరి కొంత ఆహారమును కుక్క గొడుగుల వలెను కూడి తినును. ఇట్టి వాని ఆహారము మిశ్రమాహారమని చెప్ప వచ్చును. ఇట్టి వానికి బాక్టీరియములు అని పేరు.

సూక్ష్మ జీవులలో 1. సూక్ష్మజంతువులు (Protozoa) 2.శిలీంద్రములు (Fungi) 3. బాక్టీరయములు (Bacteria) అను నీ మూడు ముఖ్య విభాగాల గూర్చి కొంత వరకు తెలిసి కొనవలెను.

సూక్ష్మ జంతువులుసవరించు

సూక్ష్మ జంతువులగా మిక్కిలి క్రింది తరగతి జీవులు. సాధారణముగ ఇవి ఏకకణ ప్రాణులు. అనగా వీని శరీరమంతయు ఒక్కటె కణముగా నుండును. కణం చుట్టు నుండు భాగము స్వచ్ఛముగను నిర్మలముగ నుండి మిలమిల లాడుచుండును. దీనికి మూల పదార్థము (Protoplasm) అని పేరు. మధ్య నుండు భాగము కొంచెము దళముగ నుండి కొంచె మన్యచ్ఛముగ నుండును. దీనికి జీవ సూక్ష్మ జంతువులు (Protozoa) స్థానము (Nacleus) అని పేరు. ఒకానికప్పుడు ఏక కణ ప్రాణులు సూక్ష్మ జంతువులలో కొన్ని తమ మూల పదార్థములో ఒక భాగమును పాదము (Psudopodium) గా సాచి దాని సహాయముతో ఆహారము నిమిడ్చు కొనును. ఇట్టి జంతువునకు (అమిబా... Amoeba) వికారిణి అనగా ఆకారము నిరంతరము మార్చు కొనునది అని పేరు. చలిజ్వరము (Malaria) అను జ్వరమును (Ameoebic Dysentery) అను నొక తరహా జిగట విరేచనములను గలిగించు సూక్ష్మ జంతువులను ఈ జాతి లోనివియే. మరికొన్ని సూక్ష్మ జంతువులు తోకలు కలిగి వాని సహాయముచే ఈదుచు ఆహారమును తిని చలించు చుండును.

అమీబాసవరించు

 
అమీబా పటము

సూక్ష్మ జంతువులలో ననేకములు ఒక్కొక్కటి రెండేసిగా చీలి, రెండు నాలుగు, నాలుగు ఎనిమిది, ఎనిమిది పదహారు, ఇట్లు ముక్కలు ముక్కలయి ఒక్కొక్క ముక్క ఒక్కొక్క జంతువుగా పరిణమించును. ఒక అమీబాను అనేక ఖండములుగా చేసి నప్పుడు ఏఖండము లందు జీవ స్థానపు ముక్కలుండునో అవి విడివిడిగా బ్రతికి పెద్ద అమీబాలగును. జీవ స్థానపు ముక్క ఏమాత్రమును లేని ఖండములు చచ్చును. మరికొన్ని సూక్ష్మ జంతువులలో ఆడది, మొగది అను వివక్షత గలిగి ఒక దానితో నొకటి సంయోగము నొందుటచే సంతాన వృద్ధియగును. చలి జ్వరపు పురుగులలో నిట్లే మగవి యను ఆడవియును కూడి సంధానమును పొందును.

శిలీద్రములు (fungi)సవరించు

శిలీంద్రమనగా కుక్కగొడుగు. ఈ జాతిలోని సూక్ష్మ జీవులు వర్ణ రహితమయిన కణములచే నేర్పడునవి. ఇవి చెట్ల జాతిలో గాని, జంతువుల జాతిలో గాని చేరక మధ్యమ స్థితిలో నుండునవి. ఒక కణము యొక్క కొస పొడుగుగా దారపు పోగుల వలె పెరుగుచు అనేక పోగులు వలవలె గాని త్రాడువలె గాని అల్లు కొనుటచే ఈ ప్రాణుల ఆకారము వృద్ధి యగుచుండు. వీని పోగులు జీవము లేనట్టి గానీ జీవించి యున్నట్టి గాని జంతువుల యొక్కయు వృక్షముల యొక్కయు పై పొరల గుండ దొలుచుకొని పోగలవు. ఇవి సాధారణముగ కుళ్లుచుండు పదార్థముల నుండి తమ ఆహారమును తీసి కొనును. నిలవ యుంచిన కొబ్బరి పెచ్చుల మీదను, తడిసిన చెప్పుల జోళ్ళమీదను, ఊరగాయ కుండల లోను, పట్టు చుండు బూజు ఈ జాతి లోనిదే. మన చెవులలో గూడ నిట్టి బూజు పెరుగుట గలదు. ఆడువి మగవి అను విచక్షణ లేకుండ ఈ పోగుల కొన యందు ఒక భాగం తెగి పోయి అట్లు తెగిపోయిన ముక్కలు గ్రుడ్లుగా నేర్పడుటచే నివి సంతాన వృద్ధి చెందును. మఱి కొన్నిటియందేదో యొక భాగమున ఒక మొటిమ పుట్టి ఆ మొటిమ తెగిపోయి వేరొక జంతువగును. కొన్ని జాతుల యందు ఆడు పోగులు మగ పోగులు వివక్షముగా నేర్పడి వాని రెంటి యొక్క సంయోగముచే సంతాన వృద్ధి యాగును. సాధారణముగ తామర శోభియను చెప్పబడు చిడుములు ఈ జాతి సూక్ష్మ జీవుల వల కలిగినవి.

బాక్టీరియాములు (Bacteria)సవరించు

మనషికి తెలిసిన సూక్ష్మ జీవులలో బాక్టీరియములు మిక్కిలి అధిక సంఖ్య గలవి. ఇందు అనేక జాతులును ఉప జాతులును ఉన్నాయి. ఇవి సాధారణముగ వృక్ష జాతి లోనివి. ఇవియే మిక్కిలి సూక్ష్మమయినట్టి వృక్షములని చెప్పవచ్చును. వీనిని అక అంగుళము పొడుగునకు 8 వేలు మొదలు 75 వేల వరకు ఇమడ్చవచ్చును. ఇవి చుక్కల వలెను కణికల వలెను గుండ్రముగా గాని, మర మేకుల వలే మెలిదిరిగి గాని యుండవచ్చును. ఇవి యొకటొకటి కొంత వరకు పెరిగిన వెంటనే రెండు ముక్కలుగా విరిగి ప్రతి ముక్కయు తిరిగి తల్లి సూక్ష్మ జీవి యగుటచే సంతానవృద్ధి యగును. చీమును పుట్టించు సూక్ష్మ జీవులు చుక్క వలె నుండును. పచ్చ శగను పుట్టించు సూక్ష్మ జీవులు జీడి గింజలవలె నుండి జంటలు జంటలుగా నుండును. క్షయను బుట్టించు సూక్ష్మ జీవులు కొంచెము వంగిన కణికలవలె నుండును. దొమ్మను పుట్టించు సూక్ష్మజీవులు రూళ్ళ కర్ర ముక్కల వలె నుండును. కలరాను, కొఱుకు వ్వాధిని పుట్టించు సూక్ష్మ జీవులు మరమేకుల వలె మెలి దిరిగి యుండును. ఈ బాక్టీరియములలో అనేక జాతులను గూర్చియు ఇతర విషయములను గూర్చియు ఇచ్చట వివరింప నెడము చాలదు. బాక్టీరియము లనేకములు తోకలు కలిగి చురుకుగ చలించుచుండును. మరి కొన్ని తోకలు లేక యంతగా కదల లేక యుండును. ఈ కవచము యొక్క సహాయము చే నెంత యండకును వేడికిని లెక్క చేయక చిరకాలము నిద్రావస్థలో నున్నట్టులుండి తరుణము వచ్చి నపుడు తమ కవచమును విడిచి చురుకుగల బాక్టీరియములగును. ధాన్యపు గింజలు అయిదారు నెలల వరకు కళ్ళములందలి నెర సందులలో పడి యుండి వర్ష కాలము రాగానే మొలచుటకు సిద్ధముగ నున్నట్లే ఇవియును వానికి తగిన స్థలమును కొంత కాలము నిద్రావస్థలో యుండి ఆహారాదులను దొరకినప్పుడు చేతనమయి వృద్ధి నొందును.

ఇవి కూడా చూడండిసవరించు

మూలాలుసవరించు

అంటువ్యాధులు రచయిత ఆచంట లక్ష్మీపతి అను గ్రంథమునుండి గ్రహింప బడింది.

ఇతర లింకులుసవరించు