సూర్య సావర్ణిక మనవు

సూర్య సావర్ణిక మనవునే సావర్ణి మనువు అని కూడా అంటారు.హిందూ పురాణాలు ప్రకారం 14 మంది మనవులు ఉన్నారు. మనవు పరిపాలన కాలాన్ని మన్వంతరం అంటారు. అందులో 8 వ మనవే సూర్య సావర్ణిక మనవు.పురాణ లెఖ్కల ప్రాకారం ఇప్పట్టి వరకు 7 మన్వంతరాలు గడచినాయి. రాబోయేది 8 వదిఅయిన సూర్య సావర్ణిక మన్వంతరం.పురాణ గ్రంథాల సారాంశానుసారం, ప్రతి మనవు ఒక్క జన్మ విశేషాలు ముందుగానే తెలుపబడ్డాయి. ఉదాహరణకు ప్రస్తుత 7 వ మనవైన వైవస్వత మనవు యొక్క తల్లి తండ్రులు పేర్లు విషశ్వంతుడు, శ్రద్ధాదేవి.అలాగే ప్రతి మన్వంతరంలో పరమాత్మ కూడా మానవ రూపంలో జన్మిస్తాడని చెప్పబడింది. 7 వ మన్వంతర కాలంలో అలా జన్మించిన పరమాత్మ స్వరూపమే వామనావతారం. కొంతమంది పండితుల ప్రకారం మనవు సాక్షాతు పరమాత్మ స్వరూపం.రాబోయే 8 వ మనువైన సూర్య సావర్ణిక మనవు తల్లితండ్రులు దేవగుహ్యుడు, సరస్వతి. అలాగే అతని పరమాత్మ స్వరూపం నామం సార్వబౌముడు. మనవు యొక్క నిర్దేశిత కార్యములు ఏమనగ, ప్రజలకు ధర్మ మార్గంలో చరించే విదంగా "మనుస్మ్రితి"ని రచించి వారికి అందించడం. ప్రజలందరు అట్టి మనుస్మృతినే ప్రామాణికంగా బావించి ఆ మన్వంతర పర్యంతం దాని ప్రాకారం జీవనం కొనసాగించవలేను. అలా చెయ్యనివారిని పాలకులు మనుస్మ్రితిలో చెప్పిన విదంగా శిక్షలు విదించేదరు. అంతే కాక మనవు తన జీవన కాలములో తానే అటు రాజుగ రాజ్య భారం వహిస్తు, ఇటు మనవుగా ధర్మనిర్దేశకుడిగ ఉంటాడు. కావుననే ఆయనే పరమాత్మ ప్రతినిది అయిన రాజు, ధర్మ శాస్త్రకారుడైన మనువు.

సూర్య సావర్ణిక మనవు ఆశ్రమము.

  • భారతదేశంలో ఈ మనవు పేరుతో ఏకైక ఆశ్రమం ఉంది. అది ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం జిల్లాలో ఏనుకూరు మండలంలోనిగార్ల ఒడ్డు గ్రామంలో ఉంది. దీని వ్యవస్థాపకులు శ్రీ మద్దిగుంట నరసింహా రావు.దర్మ శాస్త్రకారుడైన మనవు పెరుతో స్థాపించబడిన ఈ ఆశ్రమం ఉద్దేశాలు ఏమనగ హిందువులలో సంస్కర్నాత్మకమైన భావాలను వ్యాప్తి చెయ్యడం.ఇది ఖమ్మం నుండి కొత్తగూడెం పోవు మార్గంలో 45 కిలోమీటర్ల దూరములో ఉంది.