సోమ్‌ ప్రకాష్‌ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు పంజాబ్ శాసనసభకు ఎమ్మెల్యేగా ఎన్నికై, 2019లో తొలిసారి హోషియార్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 30 మే 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1][2]

సోమ్ ప్రకాశ్
సోమ్ ప్రకాశ్


వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
30 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
23 మే 2019
ముందు విజయ్ సంప్లా
నియోజకవర్గం హోషియార్‌పూర్ నియోజకవర్గం

శాసనసభ్యుడు
పదవీ కాలం
2012-2019
ముందు స్వర్ణ రామ్
నియోజకవర్గం ఫగ్వారా

వ్యక్తిగత వివరాలు

జననం (1949-04-03) 1949 ఏప్రిల్ 3 (వయసు 75)
దౌలత్ పూర్, పంజాబ్, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి అనిత సోమ్ ప్రకాశ్
సంతానం 2
నివాసం ఫగ్వారా, కపుర్తలా జిల్లా

రాజకీయ జీవితం మార్చు

సోమ్‌ ప్రకాష్‌ రాజకీయాల్లోకి రాక ముందు ఐఏఎస్ గా పని చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన అనంతరం భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి 2012లో తొలిసారి పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. సోమ్‌ ప్రకాష్‌ 2017లో రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో హోషియార్‌పూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎంపీగా ఎన్నికై 30 మే 2019 నుండి నరేంద్ర మోదీ మంత్రివర్గంలో వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[3]

మూలాలు మార్చు

  1. BBC News తెలుగు. "మోదీ మంత్రి మండలిలో ఎవరెవరికి ఏ శాఖ". Archived from the original on 1 February 2022. Retrieved 1 February 2022.
  2. Sakshi (8 July 2021). "మోదీ పునర్‌ వ్యవస్థీకరణ రూపం ఇలా." Archived from the original on 8 April 2022. Retrieved 8 April 2022.
  3. Lok Sabha (2019). "Som Parkash". Archived from the original on 4 May 2022. Retrieved 4 May 2022.