ప్రధాన మెనూను తెరువు

మెదక్ జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్ లో 02-10-1961లో జన్మించాడు. 1969 తరువాత నక్సల్ ఉద్యమం వేగవంతమైంది. స్కూల్ లెవల్ నుంచె ఉద్యమాలపై ప్రేమ పెంచుకున్నాడు, ఇంటర్ తరువాత అర్ ఎస్ యు (రాడికల్ స్టూడెంట్స్ యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 1983 తరువాత ఉదయం దినపత్రికలో రిపోర్టర్ గా చేరారు. ఇలా పత్రికల్లో పనిచేస్తూ ప్రజా సమస్యల్లో పాలుపంచుకుంటూ వస్తున్న క్రమంలో పోలీసుల నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాఇ. 1991 లో టాడా కేసు పెట్టారు. విప్లవ సాహిత్యంతో పాటు బాంబులు దొరికాయని, నక్సలైట్ గా పనిచేస్తున్నాడని కేసు పెట్టి నిర్బందంలో ఉంచి చిత్రహింసలకు గురిచేశారు. నాలుగు రోజులకు సెంట్రల్ జైల్ కు తరలించారు, ఈ క్రమంలోనే దేశ, రాష్ట్రంలో జర్నలిస్టులు, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేపట్టాయి. లండన్ లో కూడా ఊద్యమాలు జరిగాఇ. కేంద్ర మానవ హక్కుల కమిషన్నర్ రంగరాజన్ కూడా ఈ సంఘటనపై సిగ్గు పడుతున్నాన్నారు. ఈక్రమంలో కోర్టు విచారణలోపోలీసులు తప్పుడు కేసు పెట్టారని తేలడంతో నిర్దోషిగా బయటకు వచ్చాడు. వార్త రిపోర్టర్ గా కొనసాగుతూ ఎపియుడబ్ల్యుజె (జర్నలిస్టు యూనియన్) జిల్లా అధ్యక్షుడిగా రెండు సార్లు కొనసాగారు. జహిరాబాద్ లో, సిద్దిపెటలో వార్త రిపోర్టర్ గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో ఎమ్ ఎల్ ఎగా ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో కూడా ఎన్నికయ్యాడు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో పుట్టి నక్సలిజం నుంచి గ్రామీణ విలేఖరిగా ఎదిగి ఎమ్మెల్యెగా రెండు సార్లు ఎన్నికై ఉద్యమంలో ఛురుగ్గా పాల్గొంటున్న రామలింగారెడ్డి జీవన నేపథ్యం రాష్ట్ర చరిత్రలోనే వైవిధ్య భరితం.