సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం

సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ భారత తీరంలో అండమాన్ నికోబార్ దీవులలో ఉన్న ఒక జాతీయ ఉద్యానవనం. ఈ రక్షిత ద్వీపం మొత్తం వైశాల్యం 5 కిమీ 2 (2 చదరపు మైళ్ళు). దీనికి ప్రక్కన ఉన్న నార్త్ బటన్, మిడిల్ బటన్ ద్వీపాలు కూడా జాతీయ ఉద్యానవనాలే. దక్షిణ అండమాన్ ద్వీపం తీర ప్రాంతంలో రాణి ఝాన్సీ మెరైన్ జాతీయ పార్కు లో భాగంగా ఇవి ఉన్నాయి. [1]. అండమాన్ నికోబార్ దీవులలోని సౌత్ బటన్ నేషనల్ పార్క్ భారతదేశంలో అతిచిన్న జాతీయ ఉద్యానవనం.

సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Map showing the location of సౌత్ బట్టన్ జాతీయ ఉద్యానవనం
Location within India
ప్రదేశంఅండమాన్ నికోబార్, భారతదేశం
భౌగోళికాంశాలు12°16′32″N 93°01′34″E / 12.27556°N 93.02611°E / 12.27556; 93.02611
విస్తీర్ణం64 km2 (25 sq mi)
స్థాపితం1979

సౌత్ బటన్ ఐలాండ్ నేషనల్ పార్క్ రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్‌లో భాగం. ఇది హావ్‌లాక్ ద్వీపానికి నైరుతి దిశలో 24 కి.మీ (15 మైళ్ళు) దూరంలో ఉంది, మోటారు పడవలో సుమారు రెండు గంటల ప్రయాణం చేసి అక్కడికి చేరుకోవచ్చు.[2]

చరిత్ర మార్చు

ఈ ఉద్యానవనాన్ని 1979 లో స్థాపించారు. ఇది 64 చ. కి. మీ. వైశాల్యం లో విస్తరించి ఉంది. ఇందులో ఉత్తర, దక్షిణ ఉద్యానవనాలు కూడా ఉన్నాయి.

మరిన్ని విశేషాలు మార్చు

ఇక్కడ సముద్ర ప్రాంతంలో ఉండే జంతువులకు, పక్షులకు ఆశ్రయం కల్పిస్తారు.

మూలాలు మార్చు

  1. Hoyt, Erich (2012). Marine Protected Areas for Whales, Dolphins and Porpoises: A World Handbook for Cetacean Habitat Conservation and Planning. Routledge. p. 282. ISBN 978-1-136-53830-8.
  2. "South Button Island National Park, Andaman and Nicobar Islands". Trans India Travels. Retrieved 9 November 2015.