ఒక ఋషి. మాంధాత యల్లుఁడు. ఇతఁడు యమునానదీ జలమునందు ద్వాదశ వర్షములు తపము సలిపి పిదప సంసారకాంక్ష కలిగి మాంధాతను ఒక కన్యక కావలయును అని వేడఁగా అతఁడు తన కొమార్తలలో ఎవతె అతనిని వరించునో దానిని కైకొనుము అని చెప్పి తన యేఁబండ్రు కూఁతులను చూపెను. అప్పుడు తపఃప్రభావముచే రూపయౌవనసంపన్నుఁడు అయి అతఁడు వారికి కనఁబడఁగా వారు అందఱును అతనిని మోహించి వరించిరి. అంత అతఁడు ఆకన్యకలను వివాహము అయి అనేక సంవత్సరములు విషయసుఖములను అనుభవించుచు ఉండెను. అనంతరము అతఁడు మృతిని ఒందఁగా ఆయేఁబండ్రు కన్యకలును అతనితోకూడ సహగమనముచేసి దివ్యలోకమును పొందిరి.

(పురాణనామచంద్రిక (యెనమండ్రం వెంకటరామయ్య) 1879)

"https://te.wikipedia.org/w/index.php?title=సౌభరి&oldid=2949134" నుండి వెలికితీశారు