స్పార్టకస్ (Greek: [Σπάρτακος, Spártakos] error: {{lang}}: text has italic markup (help); Latin: Spartacus[1]) (c. 109 BC – 71 BC) మూడవ బానిస యుద్ధంలో బానిసల అత్యంత సుప్రసిద్ధ నాయకుడు, ఇది రోమన్ రిపబ్లిక్‌పై ప్రముఖ బానిసల తిరుగుబాటు యుద్ధ ఘటనలకు ఆవల స్పార్టకస్ గురించి పెద్దగా వివరాలు తెలియడం లేదు, ఉనికిలో ఉన్న చారిత్రక ఆధారాలు కొన్ని సార్లు వైరుధ్యంతో కూడి ఉంటున్నాయి, ఇవి ఎల్లప్పుడూ విశ్వసనీయం కాకపోవచ్చు. అతడు విజయవంతమైన సేనానాయకుడు.

Spartacus
Spartacus statue by Denis Foyatier.jpg
Spartacus by Denis Foyatier, 1830
పోరాటాలు / యుద్ధాలుThird Servile War

స్పార్టకస్ పోరాటం తరచుగా బానిస యాజమాన్యంపై తమ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న పీడిత ప్రజల పోరాటంగా కనిపిస్తుంటుంది, ఇది 19వ శతాబ్ది నుంచి ఆధునిక రచయితలకు కొత్త అర్థాలనిచ్చింది. స్పార్టకస్ తిరుగుబాటు అనేక మంది ఆధునిక సాహిత్య, రాజకీయ రచనాకారులకు ప్రేరణ నిచ్చింది, ఇది ప్రాచీన మరియు ఆధునిక సంస్కృతులు రెండింటిలోనూ స్పార్టకన్‌ని జానపద కథానాయకుడుగా మార్చింది.

మూలాలుసవరించు

థ్రేసియన్ తెగలు, మేడితో పాటు

స్పార్టకస్ థ్రేసియన్ జాతికి చెందినవాడని ప్రాచీన ఆధారాలు అంగీకరిస్తున్నాయి. ప్లూటార్క్ ఇతడిని "సంచారజాతులకు చెందిన థ్రేసియన్"గా వర్ణించాడు.[2] అప్పియన్ ఇతడిని "పుట్టుక రీత్యా థ్రేసియన్ అని, ఇతడు రోమన్‌ల కింద సైనికుడిగా పనిచేశాడని, తర్వాత ఖైదీగా ఉండి మల్లయోధుడు"గా అమ్మివేయబడ్డాడని చెప్పాడు.[3] ఫ్లోరస్ (2.8.8) ఇతడిని, "థ్రేసియన్ పోరాటకారుడని, రోమన్ సైనికుడిగా మారాడని, సైన్యంనుంచి పారిపోయి, దొంగగా మారాడని, తర్వాత తన శక్తికి గుర్తింపుగా మల్లయోధుడిగా మారాడని వర్ణించాడు".[4] కొంతమంది రచయితలు మైడీకి చెందిన, థ్రేషియన్ తెగకు చెందిన వాడిగా పేర్కొంటున్నారు, [5], వీరు చరిత్రలో థ్రేస్ వాయవ్య పార్స్వాలలోని ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు (ఇది ప్రస్తుతకాలపు వాయవ్య బల్గేరియా) లో ఉంది.[6][7][8] స్పార్టకస్ భార్య మేడీ తెగకు చెందిన పూజారిణిగా ఉండేదని తనతో పాటు బానిసగా అయిందని ప్లూటార్క్ కూడా రాశాడు.

స్పార్టకస్ పేరు నల్ల సముద్రంలో మరో విధంగా అనుసంధించబడింది: సిమ్మెరియన్ బోస్పోరస్[9] మరియు పోంటస్[10]కి చెందిన థ్రేసియన్ రాజవంశానికి చెందిన రాజులు ఈ పేరును కలిగి ఉండేవారు, మరియు థ్రేసియన్ "స్పార్టా" "స్పార్డకస్"[11] లేదా "స్పార్డకోస్", [12] ఒడ్రాసెకి చెందిన, స్యూథెస్ I తండ్రిగా కూడా తెలుసు.

బానిసత్వం మరియు బయటపడటంసవరించు

100 BCలో రోమన్ రిపబ్లిక్

వివిధ ఆధారాలు మరియు వారి వ్యాఖ్యానాల ప్రకారం, స్పార్టకస్ రోమన్ మాజీ సైనికులలో సహాయకుడుగా ఉండేవాడని, తర్వాత బానిసత్వం బారినపడి బందీగా మారాడని తెలుస్తోంది.[13] స్పార్టకస్ లెంటులస్ బాటిస్టాకి చెందిన కపూవా సమీపంలోని (లుడస్ ) వద్ద శిక్షణ పొందాడు క్రీ.పూ. 73లో స్పార్టకస్ తప్పించుకోవడానికి ప్రయత్నించిన కొద్దిమంది బృందంలో ఉండేవాడు. ఈ పథకం విద్రోహానికి గురైంది కాని 70[14] మంది పురుషులు వంట కత్తులను స్వాధీనం చేసుకుని, మల్లయుద్ధ కళాశాలనుంచి బయటపడి, పలు మల్లయోధుల ఆయుధాలను, మందుగుండును స్వాధీనపర్చుకున్నారు.[15] తప్పించుకున్న బానిసలు తమమీదికి దాడికి వచ్చిన చిన్న బలగాన్ని ఓడించారు, కపూవా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని దోచుకున్నారు, తమలోకి అనేకమంది బానిసలను చేర్చుకున్నారు, మరియు మౌంట్ విసూవియస్మీది మరింత రక్షణాత్మక ప్రాంతానికి చేరుకున్నారు.[16][17]

విముక్తి చెందగానే, తప్పించుకున్న మల్లయోధులు స్పార్టకస్‌ని మరో ఇద్దరు గాల్ బానిసలు — క్రిక్సస్ మరియు ఓనోమాస్ — లను తమ నాయకులుగా ఎంచుకున్నారు. బానిసలందరూ స్పార్టకస్‌ని తమ నేతగా భావించిన ఒకేరకమైన బృందంగా రోమన్ రచయితలు భావించినప్పటికీ, వీరు బానిసల సహజసిద్ధ సంస్థను తమ స్వంత సైనిక నాయకత్వపు అంతస్తుల దొంతరతో ముడిపెట్టి ఉండవచ్చు, ఇతర బానిస నేతలను తమ రచనలలో కింది స్థానాల్లోకి కుదించి ఉండవచ్చు. క్రిక్సస్ మరియు ఓనోమస్ స్థానాలు — తర్వాత కాస్టస్ స్థానాన్ని మూల రచయితలు స్పష్టంగా వివరించి ఉండలేదు.[ఉల్లేఖన అవసరం]

మూడవ బానిస యుద్ధంసవరించు

రోమన్ సేనలు అప్పటికే స్పెయిన్‌లో తిరుగుబాటుపై మరియు మూడవ మిథిర్డేటిక్ యుద్ధంలో పూర్తిగా నిమగ్నమై ఉండటంతో, రోమన్ల స్పందన నీరుగారిపోయింది. పైగా, రోమన్లు ఈ తిరుగుబాటును యుద్ధంగా కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయంగా పరిగణించారు. రోమ్ తన మిలీషియాని న్యాయమూర్తి గేయస్ క్లాడియస్ గ్లాబెరస్ నేతృత్వంలో పంపింది, ఈ మిలీషియా బానిసలు దాగి ఉన్న కొండను చుట్టుముట్టి, వారు ఆకలిదప్పుల పాలై లొంగిపోతారని ఆశించింది. కానీ స్పార్టకస్ వీనెస్ తీగలతో అల్లిన తాళ్ల సహాయంతో అగ్నిపర్వతం ఉన్న వైపుగా దిగి కొండ వెనుక భాగంలో రక్షణ లేకుండా ఉన్న రోమన్ శిబిరంపై తన వారితో దాడిసల్పాడు. రోమన్ మిలీషియా దాదాపుగా హతమైపోయింది.[18] రెండో సైనిక దాడిని కూడా బానిసలు ఓడించారు, న్యాయమూర్తి కమాండర్‌ని దాదాపుగా పట్టుకున్నంత పనిచేశారు, అతడి లెఫ్టినెంట్లను వధించి సైనిక సామగ్రిని వశం చేసుకున్నారు.[19] ఈ విజయాలతో మరింతగా బానిసలు స్పార్టకన్ బలగాల్లో చేరిపోయారు, “ఆ ప్రాంతంలోని మందలను నిర్వహించేవాళ్లు మరియు గొర్రెల కాపర్లు దాదాపుగా 70,000 మంది బానిసల్లో చేరిపోయారు.[20]

ఈ భీకర యుద్ధాలతో స్పార్టకస్ ఒక అద్భుతమైన వ్యూహకర్తగా నిరూపించుకున్నాడు, ఇతడికి గతంలో సైనిక అనుభవం కూడా ఉండవచ్చని అందరూ భావించారు కూడా. బానిసలకు సైనిక శిక్షణ లేకపోయినప్పటికీ, వాళ్లు స్థానికంగా దొరికే సామగ్రిని నేర్పుగా ఉపయోగించుకుని, సుశిక్షుతులై రోమన్ సైన్యాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అసాధారణ వ్యూహాలు ప్రదర్శించారు.[21] వీరు క్రీ.పూ. 73–72 శీతాకాలంలో తమలో కొత్తగా చేరినవారికి శిక్షణ ఇవ్వడం, సాయుధులను చేయడంతో గడిపారు. నోలా, న్యుసెరియా, తురిల్ మరియు మెటపోంటమ్ వంటి పట్టణాల వరకూ తమ దాడిని విస్తరించారు.[22] ఈ ప్రాంతాల మధ్య దూరం, తదనుగుణమైన ఘటనలు, బానిసలు స్పార్టకస్, క్రిక్సస్‌ల నేతృత్వంలో రెండు బృందాలుగా పనిచేశారని సూచిస్తున్నాయి.

క్రీ.పూ. 72 వసంత కాలంలో, బానిసలు తమ శీతాకాల శిబిరాలను వదిలి ఉత్తరాభిముఖంగా వెళ్లసాగారు. అదే సమయంలో, న్యాయమూర్తి సేనల ఓటమితో అప్రమత్తమైన రోమన్ సెనేట్, లుసియస్ గెల్లియస్ పబ్లికోలా మరియు గ్నేయస్ కొర్నెలియస్ లెంటులస్ క్లోడియనస్ నాయకత్వంలో వాణిజ్యపరమైన సైనికుల ద్వయాన్ని పంపించారు.[23] ఈ రెండు సైన్యాలు ప్రారంభంలో విజయం సాధించాయి—మౌంట్ గార్గనుస్[24] సమీపంలో క్రిక్సస్ నాయకత్వంలోని 30,000 మంది బానిసల బృందాన్ని ఓడించాయి—కాని తర్వాత స్పార్టకస్ చేతిలో ఓడిపోయాయి.{5/} ఈ పరాజయాలను ఇద్దరు అత్యంత సమగ్ర (సజీవ) యుద్ధ చరిత్రకారులు అప్పియన్ మరియు ప్లూటార్క్లు ప్రామాణిక రీతుల్లో అభివర్ణించారు.[25][26][27][28]

ఎదురులేనట్లుగా కనిపిస్తున్న తిరుగుబాటును చూసి అప్రమత్తమైన సెనేట్, రోమ్‌లోనే అత్యంత సంపన్నుడు, సైనిక నాయకత్వాన్ని స్వీకరించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన మార్కస్ లిసినియస్ క్రాసస్‌కి, తిరుగుబాటును అణిచివేయడానికి అధికారం దఖలు పర్చింది. క్రాసస్ ఎనిమిది సైన్యాలకు అంటే దాదాపు 40,000–50,000 మంది సుశిక్షితులై రోమన్ సైనికులకు నాయకత్వం వహించాడు, [29][30] సైన్యంతో క్రాసస్ కఠినంగా, క్రూరమైన క్రమశిక్షణతో వ్యవహరించాడు, మొత్తం యూనిట్‌ని హతమార్చే శిక్షా పద్ధతులను అమలుపర్చాడు.[31] తెలియని కారణాలతో దక్షిణాన ఇటలీ వైపుకు తిరోగమించిన స్పార్టకస్, అతడి అనుచరులు క్రీ.పూ 71 ప్రారంభంలో తిరిగి ఉత్తరం వైపుగా కదలసాగారు.క్రాసస్ తన సైన్యాలలో ఆరింటిని ఆ ప్రాంత సరిహద్దులకు తరలించి తన దూత మమ్మియస్‌ని రెండు సైన్యాలతో స్పార్టకస్ వెనుక పంపించాడు. బానిసలతో తలపడవద్దని ఆదేశాలున్నప్పటికీ, చేతికి అవకాశం దక్కిందని భావించిన తరుణంలో మమ్మియస్ దాడిచేసాడు కాని అతడితో సహా సైన్యం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.[32] దీని తర్వాత, క్రాసస్ సైన్యాలు పలు యుద్ధాలలో విజయాలు సాధించాయి, క్రాసస్ పైచేయి సాధించడంతో స్పార్టకస్ లూకానియా గుండా మరింత దక్షిణం వైపుకు తరలిపోయాడు. క్రీ.పూ. 71 నాటికి, మెస్సినా జలసంధి సమీపంలో రెగియమ్ (రెగ్గియో కాలాబ్రియా) లో విడిది చేశాడు.

ప్లూటార్క్ అభిప్రాయం ప్రకారం, స్పార్టకస్ తనను తనకు చెందిన 2,000 మంది అనుచరులను సిసిలీకి తరలించడానికి సిలికియన్ దారిదోపిడి దొంగలతో బేరమాడాడు, అక్కడ బానిస తిరుగుబాటును ప్రేరేపించి మరిన్ని బలగాలను కూడగట్టుకోవాలని స్పార్టకస్ ఉద్దేశించాడు. అయితే, సముద్ర దొంగలు అతడికి ద్రోహం చేశారు, వాళ్లు డబ్బు తీసుకుని బానిస తిరుగుబాటుదార్లను వాళ్ల మానాన వాళ్లను వదిలేసారు.[32] మరికొన్ని ఆధారాల ప్రకారం, తప్పించుకోవడానికి తిరుగుబాటుదారులు ఓడ నిర్మాణానికి కూడా ప్రయత్నాలు చేపట్టారని తెలుస్తోంది, కాని తిరుగుబాటుదారులు సిసిలీని దాటి పోకుండా చూడడానికి క్రాసస్ అసాధారణ చర్యలు చేపట్టాడు. దీంతో తిరుగుబాటుదారుల ప్రయత్నాలు వమ్మయ్యాయి.[33] స్పార్టకస్ బలగాలు తర్వాత రెగియమ్ వైపుగా తిరోగమించారు. క్రాసస్ సైన్యాలు వారిని అనుసరిస్తూ, తిరుగుబాటుదారులు చీకాకు దాడులకు దిగినప్పటికీ, రెగియమ్ ప్రాంతం పొడవునా రక్షణ గోడలు నిర్మించారు. తిరుగుబాటుదారులు ముట్టడిలో చిక్కుకున్నారు వారికి సరఫరాలు నిలిచిపోయాయి.[34]

స్పార్టకస్ పతనం

ఆ సమయానికి, పాంపీలో ఉన్న రోమ్ సైన్యాలు స్పెయిన్ నుంచి తిరిగొచ్చాయి, క్రాసస్‌కి సహాయ అందించేందుకోసం వీటిని దక్షిణానికి వెళ్లవలసిందిగా సెనేట్ ఆజ్ఞాపించింది.[35] పాంపీ నుంచి వచ్చిన సైన్యాల రాకవల్ల తన ప్రతిష్ఠ కనుమరుగవుతుందని క్రాసస్ భయపడగా, క్రాసస్‌తో ఒప్పందానికి రావాలని స్పార్టకస్ చేసిన ప్రయత్నం విఫలమైంది.[36] క్రాసస్ ఇందుకు తిరస్కరించినప్పుడు, స్పార్టకస్ సైన్యంలో ఒక భాగం పెటెలియా బ్రుట్టియంలోని (ఆధునిక స్ట్రోంగోలి) పశ్చిమభాగంలోని పర్వతాలవైపుకు మరలాయి.[37] ప్రధాన సైన్యం[38] నుంచి విడిపోయిన తిరుగుబాటుదారులలోని ఒక భాగాన్ని పట్టుకోవడానికి రోమ్ సైన్యాలు ప్రయత్నించగా, [38] స్పార్టకస్ సైన్యాలలో క్రమశిక్షణ విచ్ఛిన్నమయింది, తిరుగుబాటుదారులు చిన్న బృందాలుగా విడిపోయి, తమను వెన్నంటి వస్తున్న రోమ్ సైన్యాలపై స్వతంత్ర దాడులకు దిగాయి.[39] స్పార్టకస్ ఇప్పుడు తన చుట్టూ ఉన్న బలగాలను కేంద్రీకరించి చివరి ప్రయత్నంగా తన మొత్తం బలగాన్ని రోమ్ సైన్యంపైకి దాడికి దింపాడు, దీంట్లో బానిసలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు, వీరిలో చాలామంది యుద్ధరంగంలోనే చంపబడ్డారు.[40] స్పార్టకస్ విధి ఏమయింది అనే విషయం ఎవరికీ తెలియకుండా పోయింది, ఎందుకంటే అతడి శరీరం ఎన్నడూ దొరకలేదు, కాని తోటి సహచరులతో కలిసి అతడు యుద్ధరంగంలోనే చనిపోయాడని చరిత్రకారులు అభిప్రాయపడ్డారు.[41] తిరుగుబాటుచేసిన వారిలో ఆరువేలమంది క్రాసస్ సైన్యం చేత చిక్కగా క్రాసస్ వీరిని రోమ్ నుంచి కవువాకు వెళ్లే అప్పియన్ మార్గం పొడవునా వారిని శిలువ వేయించాడు.[42]

ఉద్దేశాలుసవరించు

స్పార్టకస్ ఉద్దేశాలు ఏవి అనే అంశంపై ప్రాచీన చరిత్రకారులు వేరైపోయారు. స్పార్టకస్ ఉత్తరాభిముఖంగా సిసాప్లిన్ గాల్‌కి పారిపోయి తన మనుషులను వారి వారి ఇళ్లకు పంపించివేయాలని మాత్రమే కోరుకున్నాడని ప్లూటార్క్ రాసాడు.[43] ఆప్పియన్ మరియు ఫ్లోరస్‌ల అభిప్రాయం ప్రకారం స్పార్టకస్ రోమ్ మీదే దాడి చేయాలనుకున్నాడు.[44] స్పార్టకస్ తర్వాత ఈ లక్ష్యాన్ని వదులుకున్నాడని, రోమన్లంటే భయానికి ఇది ప్రతిఫలనమే తప్ప మరొకటి కాదని ఆప్పియన్ రాశాడు. స్పార్టకస్ చర్యలలో ఏవీ కూడా అతడు రోమన్ సమాజాన్ని సంస్కరించదలిచాడని గాని, లేదా బానిసత్వాన్ని రద్దు చేయడానికి నడుం కట్టాడని చెప్పడంలేదు. ఇలాంటివి 1960 సినిమా స్పార్టకస్ వంటి కాల్పనిక వివరణలలో మాత్రమే ఉన్నాయి.

క్రీస్తు పూర్వం 73 నుంచి 72 సంవత్సరాలలో జరిగిన ఘటనల ఆధారంగా స్వతంత్రంగా కార్యకలాపాలు సాగించిన బానిసల[45] బృందాలు మరియు ప్లూటార్క్ ప్రకటన ప్రకారం తప్పించుకున్న కొద్ది మంది బానిసలు ఆల్ప్స్‌కి పారిపోవడం కంటే ఇటలీని దోచుకోవడానికే ప్రాధాన్యమిచ్చారు.[43] ఆధునిక రచయితలు, స్వాతంత్ర్యం కోసం ఆల్ప్స్‌కు పారిపోవాలని కోరుకున్న స్పార్టకస్ నేతృత్వంలోని బానిసలు, దాడులు చేయడానికి, దోచుకోవడానికి దక్షిణ ఇటలీలోనే ఉండాలని కోరుకున్న క్రిక్సస్ నేతృత్వంలోని బానిసలకు మధ్య ముఠాపరమైన విభజనం ఉండేదనే అంశాన్ని వెలికి తెచ్చారు.

వారసత్వంసవరించు

రాజకీయాలుసవరించు

 • హైతీలో బానిసల తిరుగుబాటుకు హెన్రీ క్రిస్టోఫర్ నేతృత్వం వహించాడు తర్వాత టోస్సెయింట్ లోవెర్ట్యూర్ అతడి స్థానంలో వచ్చాడు. టోస్సెయింట్ లోవెర్ట్యూర్ స్థానాన్ని తరువాత జీన్ జాక్వెస్ డెసాలైన్స్ (1791—1804), కైవశం చేసుకున్నాడు, ఇతడి చేత ఓడిపోయిన ప్రత్యర్థులలో ఒకరైన కామెట్ డె లావక్స్ ఇతడిని "నల్ల స్పార్టకస్" అని పిలిచాడు.
 • బవేరియన్ ఇల్యూమినాటి సంస్థాపకుడు, ఆడమ్ వైషాప్ట్, తరచుగా రాత పూర్వక సమాచారంలో తనను తాను స్పార్టకస్‌గా పిలుచుకున్నాడు.[46]
 • కారల్ మార్క్స్ స్పార్టకస్‌ని తన హీరోలలో ఒకరిగా పేర్కొన్నాడు, [47] మరియు అతడిని ప్రాచీన ప్రపంచ చరిత్రలోకెల్లా అత్యద్భుతమైన వ్యక్తిగా, "[ఒక] గొప్ప జనరల్ ([గుండా] గారిబాల్డి కాదు) పాత్రగా మరియు ప్రాచీన శ్రామికవర్గపు నిజమైన ప్రతినిధిగా వర్ణించాడు. "[48]
 • స్పార్టకస్ ఆధునిక కాలాల్లోని విప్లవకారులకు గొప్ప ప్రేరణగా నిలిచాడు, అందరికంచే ఎక్కువగా జర్మన్ స్పార్టాసిస్ట్ లీగ్, జర్మనీ కమ్యూనిస్ట్ పార్టీకి ముందు ఉన్న పార్టీ, అలాగే 1970లలోని ఆస్ట్రియన్ యాంటీ ఫాసిస్ట్ పార్టీలను ఈ సందర్భంగా చెప్పుకోవాలి.
 • ఇరవయ్యో శతాబ్దిలోని యూరోపియన్ కమ్యూనిస్ట్ వ్యవస్థలు పీడనకు వ్యతిరేకంగా పోరాడిన వాడిగా స్పార్టకస్ కున్న ముద్రను బాగా ప్రోత్సహించాయి. (చూడండి "స్పోర్ట్స్", స్పార్టకస్#స్పోర్ట్స్ దిగువ).
 • ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ మార్క్సిస్ట్ విప్లవకారుడు చేగువేరా కూడా స్పార్టకస్ అంటే వీరారాధన కలిగి ఉండేవాడు.

కళాత్మకంసవరించు

చలనచిత్రం మరియు టెలివిజన్సవరించు

 • ఆంథోనీ మాన్ ప్రారంభంలో స్పార్టకస్ సినిమా (1960) కి దర్శకత్వం వహించడానికి సంతకం పెట్టాడు, దీన్ని కిర్క్ డగ్లస్ నటించడమే కాకుండా కార్యనిర్వాహక నిర్మాతగా కూడా పనిచేశాడు ఈ సినిమా హోవార్డ్ ఫాస్ట్ నవల స్పార్టకస్ ఆధారంగా తీయబడింది. మాన్ మరియు డగ్లస్ సినిమా శైలి, విషయంపై ఘర్షణ పడ్డారు, మరియు మాన్ నిర్మాణబాధ్యతలనుంచి తప్పుకుని తర్వాత దాన్నుంచి బయటపడ్డాడు. పదబంధం "నేనే స్పార్టకస్‌ని!" ఈ సినిమా లోని ఈ పదబంధం తర్వాత అనేకసార్లు ఇతర సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాలు, వ్యాపార కార్యక్రమాలలో ప్రస్తావించబడింది.
 • కుబ్రిక్ సినిమాకు అనధికారిక సీక్వెల్ ఇటలీలో Il ఫిగ్లియో డి స్పార్టకస్ (ది సన్ ఆఫ్ స్పార్టకస్ ; తీయబడింది. ఇంగ్లీష్ సినిమా టైటిల్: ది స్లేవ్ [49]) 1963లో. స్టీవ్స్ రీవ్స్ పోషించిన టైటిల్ పాత్ర మొట్టమొదట రోమన్ సెంచూరియన్‌గా కనిపించింది, కాని తర్వాత అతడు తన నిజమైన వారసత్వాన్ని నేర్చుకుని తన తండ్రి హంతకుడైన క్రాసస్‌పై ప్రతీకారం తీర్చుకుంటాడు.
 • 1985–1987 కార్టూన్ సీరీస్ టైటిల్ పాత్ర స్పార్టకస్ అండ్ ది సన్ బినీత్ ది సీ స్పార్టకస్‌పైనే ఆధారపడింది.
 • 1995 సినిమా క్లూలెస్‌ లో, క్రిస్టెయిన్, స్టాన్లీ కుబ్రిక్స్ తన హోమో సెక్సువాలిటీని తెలుపుకోవడం కోసం ఉప ప్రచారంలో భాగంగా ఈ సినిమా విషయాన్ని ఉపయోగించుకున్నాడు.
 • 1996 సినిమా దట్ థింగ్ యు డూ లో, టామ్ ఎవెరెట్ స్కాట్ పాత్ర గై 'షేడ్స్' పాటర్సన్ తనను తాను స్పార్టకస్‌గా పిలుచుకున్నాడు.
 • 2003 చిత్రం ది రిక్రూట్‌ లో, కోలిన్ ఫార్రెల్ పాత్ర స్పార్టకస్ పేరున్న ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్‌ను రాస్తుంది, దీనిపై CIA చూపు సారిస్తుంది.
 • 2004లో, ఫాస్ట్ నవల స్పార్టకస్‌గా స్వీకరించబడింది, గొరాన్ విస్నిజిక్ ప్రధాన పాత్రలో USA నెట్‌వర్క్ ద్వారా దీన్ని మేడ్ ఫర్ టీవీ సినిమాగా తయారు చేయబడింది.
 • 2007-2008 BBC డాక్యుడ్రామా హీరోస్ అండ్ విలన్స్ లోని ఒక ఎపిసోడ్ స్పార్టకస్‌ని చిత్రించింది.
 • షో "Xena: Warrior Princess" తన తొలి సెషన్‌లో ఒక ఎపిసోడ్‌ని కలిగి ఉంది, దీంట్లో స్టాన్లీ కుబ్రిక్ సినిమాలోని పలు క్లిప్‌లతోపాటు కథను క్లుప్తంగా వివరించారు.
 • శ్యామ్ రైమి నిర్మించగా ఆండ్రీ వైట్‌ఫీల్డ్, తరువాత లియామ్ మెకెంటైర్, టైటిల్ పాత్రను పోషించిన టెలివిజన్ సీరీస్ Spartacus: Blood and Sand 2010 జనవరిలో స్టార్జ్ ప్రీమియమ్ కేబుల్ నెట్‌వర్క్‌లో ప్రసారం చేయబడింది[50][51]

సాహిత్యంసవరించు

 • హోవర్డ్ ఫాస్ట్ చారిత్రాత్మక నవల స్పార్టకస్‌ని రాశాడు, ఇది స్టాన్లీ కుర్బ్రిక్'స్1960 సినిమాకు ప్రాతిపదిక కిర్క్ డగ్లస్ దీంట్లో నటించాడు.
 • ఆర్థస్ కోయెస్ట్రలర్ స్పార్టకస్ గురించిన నవల ది గ్లాడియేటర్స్‌ని రాశాడు.
 • స్కాటిష్ రచయిత లెవిస్ క్రాసిక్ గిబ్బన్ స్పార్టకస్ నవలను రాశాడు.
 • స్పార్టకస్ కొల్లీన్ మెక్‌కుల్లోప్ రాసిన ఫార్చ్యూన్స్ ఫేవరైట్స్ నవలలో ప్రధాన పాత్ర.
 • ఇటాలియన్ రచయిత రఫెల్లో జియోవగ్నోలి తన చారిత్రాత్మక నవల స్పార్టకస్‌ను 1874లో రాశాడు. ఇతడి నవల వెనువెంటనే అనేక యూరోపియన్ భాషల్లోకి అనువదించబడింది మరియు ప్రచురించబడింది.
 • ఇంకా పోలిస్ రచయిత హలీనా రుడ్నిక్కా రాసిన ఉక్జోనివే స్పార్టకస (ది స్టూడెంట్స్ ఆఫ్ స్పార్టకస్) నవల కూడా ఉంది.
 • రెవరెండ్ ఎలిజా కెల్లోగ్' రాసిన స్పార్టకస్ టు ది గ్లాడియేటర్స్ అట్ కపువా రచన బడి పిల్లలు తరాలుగా తమ వక్తృత్వ నైపణ్యాలను అభ్యసనం చేయడానికి ఉపయోగిస్తూ వచ్చారు.
 • స్పార్టకస్ ది డెత్ ఆఫ్ కింగ్స్ పుస్తకంలోని కోన్ ఇగ్గుల్టెన్' యొక్క 'ఎంపరర్' సీరీస్‌లో కూడా కనిపిస్తాడు.
 • టోబీ బ్రౌన్ రాసిన స్పార్టకస్ అండ్ హిస్ గ్లోరియస్ గ్లాడియేటర్స్, పిల్లల చరిత్ర పుస్తకాలు డెడ్ ఫేమస్ సీరీస్‌లో భాగంగా ఉంటోంది
 • విలియం H. కీత్ రాసిన బోలో నవల బోలో రైసింగ్‌లో HCT "హెక్టర్" పాత్ర స్పార్టకస్ ఆధారంగా తయారైంది.
 • డేవిడ్ లుబర్ రాసిన ఫ్లిప్ నవలలోని చారిత్రక పురుషులలో ఒకరైన రియాన్ స్పార్టకస్‌గా మారాడు, ప్రత్యేకించి అతడు ఒక స్కూల్ బుల్లీతో పోరుకు దిగవలసి వచ్చిన

సందర్భంగా ఇలా జరిగింది.

 • అమల్ డోంకోల్, ఈజిప్ట్ ఆధునిక కవి "స్పార్టకస్ చివరి పలుకులు" అనే కళాఖండాన్ని రాశారు.
 • స్టీవెన్ సేలర్' నవల ఆర్మ్స్ ఆఫ్ నెమిసెస్, రోమా సబ్ రోసా సీరీస్‌లో భాగం, మూడవ లొంగుబాటు యుద్ధ కాలంలో రూపొందించబడింది.
 • మాక్స్ గాల్లో తన నవల "లెస్ రోమైన్స్‌ని రాశాడు.స్పార్టకస్లా రివోల్టె డెస్ ఎస్‌క్లేవెస్", లైబ్రైరీ ఆర్తీమ్ ఫాయార్డ్, 2006.
 • 2010లో పీటర్ స్టోతార్డ్ జీవిత చరిత్ర అంశాలతో స్పార్టకస్ తిరుగుబాటును కలిపి ఆన్ ది స్పార్టకస్ రోడ్. అనే మెమొయిర్ రాశాడు.

సంగీతంసవరించు

 • స్పార్టకస్ ఒక బ్యాలెట్, కంపోజర్ అరామ్ ఖాఛటురియన్ దీన్ని రూపొందించాడు
 • ఆస్ట్రేలియన్ సంగీత కర్త కార్ల్ వైన్ "స్పార్టకస్" పేరుతో ఒక లఘు పియానో రూపకాన్ని రెడ్ బ్లూస్ నుంచి రాశాడు .
 • జర్మన్ గ్రూప్ ట్రియంవిరాట్ ఆల్బమ్ స్పార్టకస్‌ని 1975లో రాశాడు.
 • UK బాండ్ది ఫార్మ్ (బాండ్) ఆల్బమ్ స్పార్టకస్ (ది ఫార్మ్ ఆల్బమ్‌)ని 1991లో విడుదల చేశాడు..
 • జెఫ్ వయాన్నె తన మ్యూజికల్ రీటెల్లింగ్, జెఫ్ వయాన్నే'స్ మ్యూజికల్ వెర్షన్ స్పార్టకస్ 1992లో విడుదల చేశాడు..
 • ఫాంటమ్ రెజిమెంట్, ఒక ప్రపంచ స్థాయి (గతంలో డివిజన్ 1) డ్రమ్ కార్ప్స్ డ్రమ్ కార్ప్స్ ఇంటర్నేషనల్, స్పార్టకస్ అనే పేరు గల ప్రదర్శనను నిర్వహించింది ఈ ప్రదర్శనను సంగీతం మరియు దృశ్య కదలికతో తమ స్పర్ధాత్మక రంగ ప్రదర్శనలో 1981, 1982, మరియు 2008లలో నిర్వహించారు. వీరి 2008 కార్యక్రమం ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌‌ని గెలుచుకుంది.
 • " స్పార్టకస్ " స్వింగ్ ఆఫ్ డిలైట్ కార్లోస్ శాంటానా, వాయ్నె షార్టర్, 1980 నుంచి లవ్ థీమ్
 • అమెరికన్ హార్డ్‌కోర్ బాండ్, ది ఫాల్ ఆఫ్ ట్రాయ్, "స్పార్టకస్".. పేరిట పాట రాశారు.
 • స్పార్టకస్ సినిమా నుంచి సూక్తులను రోజర్ వాటర్స్' 2010 ది వాల్ టూర్‌లలో ప్రదర్శనల ప్రారంభంలో ఉపయోగించేవారు.

ఆటలుసవరించు

 • బోర్డ్ గేమ్ అయిన "అయామ్ స్పార్టకస్" 3వ లొంగుబాటు యుద్ధంని కవర్ చేస్తుంది మరియు స్పార్టకస్‌ని గేమ్‌లో ఒక ముక్కగా పొందుపరుస్తుంది.
 • బోర్డ్ గేమ్ హెరోస్కోప్ స్పార్టకస్‌ని గేమ్‌లో ఒక ముక్కగా ప్రదర్సిస్తోంది.
 • RTS గేమ్ Age of Empires: The Rise of Rome బానిస తిరుగుబాటును రోమన్ల దృక్పథం నుంచి ప్రదర్శించింది.

రేడియోసవరించు

 • "ది హిస్టరీ ఆఫ్ప్లినీ ది ఎల్డర్" – మేటి చిత్రాలను పేరడీ చేసే బ్రిటిష్ రేడియో కామెడీ ది గూన్ షో 1957 ఎపిసోడ్ ‌లో – సీజర్ భార్యతో సంబంధం పెట్టుకున్న తర్వాత సీజర్ నుండి తప్పించుకున్న బ్లడ్‌నాక్ తన నకిలీపేరుగా స్పార్టకస్‌ని ఉపయోగించాడు; "సీజర్ భార్యపై అనుమానం లేదనే సామెత మీకు తెలుసా'? అవును నేను ఆ చెత్త అంతటికీ ముగింపు పలుకుతాను

!".

క్రీడలుసవరించు

 • అనేక బల్గేరియన్ ఫుట్‌బాల్ క్లబ్‌లు స్పార్టకస్ పేరు పెట్టుకున్నాయి: వీటిలో చాలా ప్రముఖమైనవి PFC స్పార్టాక్ వర్నా, FC స్పార్టాక్ ప్లోవ్‌డివ్ మరియు PFC స్పార్టాక్ ప్లెవెన్.
 • స్లొవేకియాలో అతి పురాతనమైన, అత్యంత ప్రసిద్ధమైన ఫుట్‌బాల్ జట్లలో స్పార్టాక్ ట్రన్వా.
 • రష్యన్ స్పోర్ట్స్ క్లబ్బులు FC స్పార్టక్ పేరు పెట్టుకున్నాయి, వీటిలో FC స్పార్టక్ మాస్కో సుప్రసిద్ధమైనది, మరియు స్పార్టక్ స్పోర్ట్ సొసైటీలను స్పార్టకస్ గౌరవార్థం పెట్టుకున్నారు.[52]
 • స్టార్టాకియాడ్ అనేది ఒక సోవియట్ బ్లాక్ యొక్క ఒలెంపిక్ గేమ్స్ .[53] వెర్షన్ చెకొస్లోవెకియాలో ప్రతి అయిదేళ్లకోసారి నిర్వహించే మాస్ జిమ్నాస్టిక్స్ ఎగ్జిబిషన్ కోసం ఈ పేరును ఉపయోగించారు
 • స్విస్ ప్రొఫెషనలి సైకిలిస్టు ఫేబియన్ కాన్సెల్లారా స్పార్టకస్ పేరుతో పిలువబడ్డాడు.
 • స్పార్టకస్ 7s 2006లో రూపొందించబడిన ఒక అంతర్జాతీయ రగ్బీ సెవన్స్ టీమ్ పేరు.
 • ఒట్టావా సెనెటర్స్ మస్కట్, స్పార్టకస్ పేరు గల సింహం పేరు, టీమ్ లోగో రోమన్ సెంచూరియన్ అయినప్పటి నుంచి స్పార్టకస్‌పై ఆట ఆడేవారు.
 • యూనివర్శిటీ ఆఫ్ టంపా స్పార్టన్స్ మస్కట్‌కి స్పార్టకస్ పేరు పెట్టబడింది.
 • స్పానిష్ బాస్కెట్ బాల్ ఆటగాడు ఫెలిపె రేయెస్ కి ఎస్పరాక్టో అనే మారు పేరు పెట్టారు, స్పానిష్‌లో దీనికి స్పార్టకస్ అని అర్థం.

ప్రదేశాలుసవరించు

 • సౌత్ షెట్లాండ్ దీవులులోని లివింగ్‌స్టన్ దీవిలో స్పార్టకస్ శిఖరం ఉంది.

సూచనలుసవరించు

 1. M. Tullius Cicero,
 2. ప్లూటార్చ్, క్రాసస్ 8
 3. Appian, Civil Wars 1.116
 4. ప్లోరస్, రోమన్ చరిత్ర ప్రమాణం 2.8
 5. ది హిస్టరీస్, సల్లస్ట్, పాట్రిక్ మెక్‌గుషిన్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్, 1992, ISBN 0-19-872143-9, p. 112.
 6. ది కేంబ్రిడ్జ్ ఏన్షియంట్ హిస్టరీ: pt. 1. బాల్కన్ల పూర్వ చరిత్ర; మరియు మధ్యప్రాచ్యం మరియు ఏజియన్ ప్రపంచం, B.C పది నుంచి ఎనిమిది సంవత్సరాలు, కేంబ్రిడ్జి యూనివర్శిటీ ప్రెస్, 1982, p. 601.
 7. ది స్పార్టకస్ వార్, బార్రీ ఎస్. స్ట్రాస్, సిమన్ మరియు షూష్టర్ 2009, ISBN 1416532056, p.31.
 8. అస్సీరియన్ మరియు బాబిలోనియన్ సామ్రాజ్యాలు మరియు సమీప ప్రాచ్యపు ఇతర రాష్ట్రాలు, B.C ఎనిమిది నుంచి ఆరు శతాబ్దాలు., సంపుటి 3, జాన్ బోర్డ్‌మన్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్, 1991, ISBN 0521227178, p. 601.
 9. డయోడరస్ సికులస్, హిస్టారికల్ లైబ్రరీ బుక్ 12
 10. డయోడరస్ సికులస్, హిస్టారికల్ లైబ్రరీ బుక్ 16
 11. థియుసిడైడిస్, పెలోపొన్నీసియన్ యుద్ధ చరిత్ర 2.101
 12. "ట్రైబ్స్, ఉత్తర గ్రీసు యొక్క రాజవంశాలు మరియు రాజరికాలు: చరిత్ర మరియు నాణేల సేకరణ శాస్త్రం". మూలం నుండి 2007-08-27 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-23. Cite web requires |website= (help)
 13. అప్పియన్ , సివిల్ వార్స్ , 1:116; ప్లూటార్చ్ , క్రాసస్ , 8:2. నోట్: సహాయకుడుగా స్పార్టకస్ స్థాయి అప్పియన్ లియోబ్ ఎడిషన్ నుంచి తీసుకోబడింది, దీన్ని హోరాస్ వైట్ అనువదించారు, ఇది “…రోమన్లకు సైనికుడిగా సేవ చేశాడు…” అని ప్రకటించింది. అయితే, పెంగ్విన్ క్లాసిక్స్ వెర్షన్ జాన్ కార్టర్ అనువాదం ఇలా సాగుతుంది: “…ఒకప్పుడు రోమన్లపై పోరాడి బందీగా దొరికి అమ్మబడ్డాడు…”.
 14. అయితే, సిసెరో ప్రకారం (Ad అట్టికమ్ VI, ii, 8) మొదట్లో అతడి అనుచరులు 50 మంది కంటే తక్కువగానే ఉండేవారు.
 15. ప్లూటార్క్ , క్రాసస్ , 8:1–2; అప్పియన్ , సివిల్ వార్స్ , 1:116; లివీ , పెరియోచవె , 95:2; ఫ్లోరస్ , ఎపిటోమ్ , 2.8. 78 మంది తప్పించుకున్నారని ప్లూటార్క్ ప్రకటింటాడు, లివీ 74 మంది అని చెప్పగా, అప్పియన్ “డెబ్బై మంది”అని చెప్పాడు, మరియు ఫ్లోరస్ “ముప్పై లేదా అంతకు ఎక్కువమంది”అని చెప్పాడు. “చోపర్స్ అండ్ స్పిట్స్” క్రాసస్ జీవితం నుండి
 16. ప్లూటార్క్ , క్రాసస్ , 9:1.
 17. అప్పియన్ , సివిల్ వార్స్ , 1:116; ఫ్లోరస్ , ఎపిటోమ్ , 2.8.
 18. ఫ్లూటార్క్వియ్46', క్రాసస్, 9:1–3; ఫ్రంటినస్, స్ట్రాటజెమ్స,, బుక్ I, 5:20–22; అప్పియన్, అంతర్యుద్ధాలు, 1:116; బ్రౌటాన్, రోమన్ రిపబ్లిక్ న్యాయమూర్తులు, p. 109.
 19. ప్లూటార్క్, క్రాసస్, 9:4–5; లివీ, పెరియొచాయ్ , 95; అప్పియని, అంతర్యుద్ధాలు, 1:116; సల్లుస్ట్, హిస్టరీస్, 3:64–67.
 20. ప్లూటార్క్, క్రాసస్, 9:3; అప్పియన్, అంతర్యుద్ధం, 1:116.
 21. ఫ్రంటినస్ , స్ట్రాటజెమ్స్ , బుక్ I, 5:20–22 మరియు బుక్ VII:6.
 22. ఫ్లోరస్ , ప్రమాణం , 2.8.
 23. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:116–117; ప్లూటార్క్, క్రాసస్ 9:6; సల్లస్ట్, హిస్టరీస్ , 3:64–67.
 24. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:117; ప్లూటార్క్ , క్రాసస్ 9:7; లివీ , పెరియచావె 96.
 25. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:117.
 26. ప్లూటార్క్ , క్రాసస్ , 9:7.
 27. స్పార్టకస్ మరియు బానిస తిరుగుబాటు
 28. Shaw, Brent D. (2001). Spartacus and the slave wars: a brief history with documents. Palgrave Macmillan. ISBN 0312237030.
 29. ప్లూటార్క్ , క్రాసస్ 10:1.
 30. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:118; స్మిత్ , గ్రీక్ మరియు రోమన్ పురాతన చరిత్రలపై నిఘంటువు , "ఎక్సెర్‌సైటస్", p.494.
 31. అప్పియన్ , అంతర్యుద్దాలు , 1:118.
 32. 32.0 32.1 ప్లూటార్క్ , క్రాసస్ , 10:1–3.
 33. ఫ్లోరస్ , ఎపిటోమ్ , 2.8; సిసిరో , అరేషన్స్ , "ఫర్ క్వింటియస్, సెక్సుటస్ రోస్కియుస్...", 5.2
 34. ప్లూటార్క్ , క్రాసస్ , 10:4–5.
 35. కాంట్రాస్ట్ ప్లూటార్క్ , క్రాసస్ , 11:2 అప్పియన్‌ తో, అంతర్యుద్ధాలు , 1:119.
 36. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:120.
 37. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:120; ప్లూటార్క్ , క్రాసస్ , 10:6.
 38. 38.0 38.1 ప్లూటార్క్ , క్రాసస్ , 11:3; లివీ , పెరియచావె , 97:1. బ్రాడ్లీ , బానిసత్వం మరియు తిరుగుబాటు . p. 97; ప్లూటార్క్ , క్రాసస్ , 11:4.
 39. ప్లూటార్క్ , క్రాసస్ , 11:5;.
 40. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:120; ప్లూటార్క్ , క్రాసస్ , 11:6–7; లివీ , పెరియచొవె , 97.1.
 41. అప్పియన్, అంతర్యుద్ధాలు , 1:120; ఫ్లోరస్ , ఎపిటోమ్ , 2.8.
 42. అప్పియన్ , సివిల్ వార్స్ , 1.120.
 43. 43.0 43.1 ప్లూటార్క్ క్రాసస్ , 9:5–6.
 44. అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:117; ఫ్లోరస్ , ఎపిటోమ్ , 2.8.
 45. ప్లూటార్క్ , క్రాసస్ , 9:7; అప్పియన్ , అంతర్యుద్ధాలు , 1:117.
 46. Douglas Reed (1 January 1978). The controversy of Zion. Dolphin Press. p. 139. Retrieved 21 July 2010.
 47. కారల్ మార్క్స్ "ఒప్పుకోలు"
 48. లెటర్ ఫ్రమ్ మార్క్స్ టు ఎంగెల్స్ ఇన్ మాంచెస్టర్
 49. http://www.imdb.com/title/tt0057060/
 50. "ఆర్కైవ్ నకలు". మూలం నుండి 2012-07-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2011-05-23. Cite web requires |website= (help)
 51. http://spartacus.ausxip.com/2009/06/
 52. హిస్టరీ ఆఫ్ స్పార్టక్ Archived 2016-09-22 at the Wayback Machine., fcspartak.ru (Russian లో)
 53. గ్రేట్ సోవియట్ ఎన్‌సైక్లోపీడియా, 3వ పబ్లిషర్, 1976

గ్రంథ సూచికసవరించు

సాంప్రదాయ రచయితలుసవరించు

 • అప్పియన్. అంతర్యుద్ధాలు J. కార్టర్‌చే అనువాదం (హర్మోండ్స్‌వర్త్: పెంగ్విన్ బుక్స్, 1996)
 • ఫ్లోరస్. ఎపిటోమ్ ఆఫ్ రోమన్ హిస్టరీ . (లండన్: W. హైనెమన్, 1947)
 • ఒరోసియస్. పగాన్స్‌పై ఏడు పుస్తకాల చరిత్ర . రాయ్ J. డెఫెర్రాయ్. (వాషింగ్టన్, DC: కేథలిక్ యూనివర్శిటీ ఆఫ్ అమెరికా ప్రెస్, 1964).
 • ప్లూటార్క్. ఫాల్ ఆఫ్ రోమన్ రిపబ్లిక్ . R. వెర్నర్‌చే అనువాదం (లండన్: పెంగ్విన్ బుక్స్, 1972), ప్రత్యేకంగా "క్రాసస్ జీవితం" మరియు "పాంపీ జీవితం"పై కేంద్రీకరించింది
 • సల్లుస్ట్. కాన్స్పిరసీ ఆఫ్ కేటలైన్ అండ్ ది వార్ ఆఫ్ జగుర్థా . లండన్, కాన్‌‌స్టేబుల్: 1924

ఆధునిక చరిత్ర రచనసవరించు

 • బ్రాడ్లీ, కెయిత్ R. స్లేవరీ అండ్ రెబిల్లియన్ ఇన్ ది రోమన్ వరల్డ్ 140 B.C.–70 B.C. బ్లూమింగ్టన్; ఇండియానాపోలిస్: ఇండియనా యూనివర్శిటీ ప్రెస్, 1989 (హార్డ్ కవర్, ISBN 0-253-31259-0); 1998 (పేపర్ బ్యాక్, ISBN 0-253-21169-7). [అధ్యాయం V] స్పార్టకస్ బానిసయుద్ధం, pp. 83–101.
 • రుబిన్సోన్, వోల్ఫ్‌జోంగ్ జీవ్. స్పార్టకస్ తిరుగుబాటు మరియు సోవియట్ చరిత్ర రచన . ఆక్స్‌ఫర్డ్: ఆక్స్‌బౌ బుక్స్, 1987 (పేపర్‌బ్యాక్, ISBN 0-9511243-1-5).
 • స్పార్టకస్: సినిమా మరియు చరిత్ర , మార్టిన్ M. వింక్లర్‌చే సంకలనం. ఆక్స్‌ఫర్డ్: బ్లాక్‌వెల్ పబ్లిషర్స్, 2007 (హార్డ్ కవర్, ISBN 1-4051-3180-2; పేపర్ బ్యాక్, ISBN 1-4051-3181-0).
 • ట్రోవ్, M.J. స్పార్టకస్: కల్పన మరియు మానవుడు . స్ట్రౌడ్, యునైటెడ్ కింగ్‌డమ్: సట్టోన్ పబ్లిషింగ్, 2006 (హార్డ్ కవర్, ISBN 0-7509-3907-9).
 • గెన్నెర్, మైఖేల్. "స్పార్టకుస్. Eine Gegengeschichte des Altertums nach den Legenden der Zigeuner". రెండు సంపుటాలు. పేపర్ బ్యాక్. ట్రికోంట్ వెర్లాగ్, München 1979/1980. Vol 1 ISBN 3-88167-053-X Vol 2 ISBN 3-88167-0
 • ప్లామెన్ పావ్లోవ్, స్టాన్మిర్ డిమిట్రోవ్, స్పార్టక్ - sinyt na drenva Trakija /స్పార్టకస్ - ది సన్ ఆఫ్ ఏన్షియంట్ థ్రేసియస్ . సోఫియా, 2009, ISBN 978-954-378-024-2

బాహ్య లింకులుసవరించు