స్మితా సబర్వాల్

మెదక్ జిల్లా కలెక్టర్‌గా ఉంటూ ప్రజలకు ఎన్నో మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకున్న కలెక్టర్ స్మితా సబర్వాల్. 2001లో ట్రైనీ కలెక్టర్‌గా ఐఏఎస్ విధుల్లో చేరిన ఈమె తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపును పొందారు. ఫలితంగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా నియమితులయ్యారు.[1]

1977 సంవత్సరం జూన్ 19వ తేదీన జన్మించిన స్మితా సబర్వాల్.. తన గ్రాడ్యుయేషన్‌ విద్యను హైదరాబాద్ లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో పూర్తి చేశారు. ఈమె ఎన్ఎస్ఎస్ వాలంటీర్. బిజినెస్ లా అకౌంటెన్సీ మార్కెటింగ్‌లో డిగ్రీని పొందారు. 2001 ఐఏఎస్, ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన స్మితా... 2001లో అదిలాబాద్‌లో ట్రైనీ కలెక్టర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత 2003 జూలై 14 నుంచి 2004 నవంబరు 27వ తేదీ వరకు చిత్తూరు అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేశారు. 2004 నవంబరు 28 తేదీ నుంచి 2004 డిసెంబరు 31వ తేదీ వరకు గ్రామీణాభివృద్ధి శాఖలో ప్రాజెక్టు డైరక్టర్‌గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత 2005 జనవరి ఒకటో తేదీ నుంచి 2006 మే 15వ తేదీ వరకు కడపలో ప్రాజెక్టు డైరక్టర్‌గానూ, 2006 మే 16వ తేదీ నుంచి 2007 మే 29వ తేదీ వరకు వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గానూ, 2007 మే 29వ తేదీ నుంచి 2009 అక్టోబరు 22వ తేదీ వరకు విశాఖపట్నంలో వాణిజ్యపన్నుల శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా విధులు నిర్వహించారు. 2009 అక్టోబరు 22వ తేదీ నంచి 2010 ఏప్రిల్ 9వ తేద వరకు కర్నూలు జాయింట్ కలెక్టర్‌గా పనిచేశారు.

ఆ తర్వాత హైదరాబాద్‌లో జాయింట్ కలెక్టర్‌గా, 2010లో కరీంనగర్ కలెక్టర్‌గా, ప్రస్తుతం మెదక్ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా అనేక మంచి పనులు చేసి జిల్లా వాసుల నుంచి మంచి పేరు ప్రతిష్ఠలు తెచ్చుకున్నారు. స్మితా సభర్వాల్ తెలుగు, బెంగాల్, ఇంగ్లీషుల్లో అనర్గళంగా మాట్లాడ గలరు. స్మితా సబర్వాల్ భర్త పేరు అకున్ సబర్వాల్. ఆయన ఐపీఎస్ అధికారి. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒక పాప, ఒక బాబు ఉన్నారు.

మూలాలుసవరించు

  1. Sakshi (28 May 2021). "ఐఏఎస్ ఆఫీస‌ర్‌ స్మితా స‌బ‌ర్వాల్ స‌క్సెస్ జ‌ర్నీ...తొలి ప్రయత్నంలోనే." www.sakshieducation.com. Archived from the original on 29 మే 2021. Retrieved 29 May 2021.