స్వప్న
స్వప్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా. ఈ చిత్రం ద్వారా సినీనటి స్వప్న పరిచయం చేయబడింది.
స్వప్న (1980 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దాసరి నారాయణరావు |
తారాగణం | రాజా , స్వప్న, రాంజీ, చాట్ల శ్రీరాములు |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ లలిత ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
సంక్షిప్త చిత్రకథ మార్చు
స్వప్నని రాజా ప్రేమిస్తాడు. అది చెప్పే లోపలే ఆమె తండ్రి స్వప్నకి రాంజీతో పెళ్ళి నిశ్చయం చేస్తారు. రాంజీ అన్ని విధాల తగిన వాడు అని స్వప్న కూడా ప్రేమలో పడుతుంది. ఈ లోపల స్వప్న తండ్రి మరణిస్తారు. స్వప్న ఆస్తి మొత్తం కోర్టు గొడవల్లో ఉండటంతో రాంజీ ఇంకో డబ్బున్న అమ్మాయి వెనకాల పడతాడు. ఆ అమ్మాయి రాంజీ స్వభావం తెలిసి వదిలేస్తుంది. రాంజీ తిరిగి స్వప్న దగ్గరకి వస్తాడు. స్వప్న ఛీకొట్టి రాజాతో వెళ్ళిపోతుంది.
పాటలు మార్చు
- అంకితం, నీకే అంకితం, నూరేళ్ళ ఈ జీవితం ! ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ., రచన: దాసరి నారాయణరావు.
- అందాలు రాశిగా పోసి ఆ రాశికి ప్రాణం పోసి
ఆ బ్రహ్మ చేసిన బొమ్మ నీవు, నీకు జోహారు, స్వప్నా, స్వప్న! - ఇదే నా మొదటి ప్రేమలేఖ, రాసాను నీకు చెప్పలేక
ఎదుట పడి మనసు తెలుపలేక, తెలుపుటకు భాష చేతకాక - ముద్ద ముద్ద మందారాలు, లేత బుగ్గ సింగారాలు
- శ్రీరస్తు అబ్బాయి, శుభమస్తు అమ్మాయి...