స్వానుభవ చరిత్ర
స్వానుభవ చరిత్ర లేదా స్వానుభవ వృత్తాంతం లేదా సంస్మరణ చరిత్ర లేదా సంస్మరణ వృత్తాంతం లేదా స్మృతి చరిత్ర అనగా రచయిత తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాలను అక్షరబద్ధం చేయగా తయారైన రచన. ఈ రచనలకు సంక్షిప్త ఆత్మకథలు అనే పేరు కూడా ఉంది. ఇవి రచయితల అనుభవాలు కనుక, ఇందులో చెప్పినవన్నీ నిజంగా జరిగిన సంఘటనలుగా అర్థం చేసుకోబడతాయి. మొదటినుండీ స్వానుభవ చరిత్రలనేవి ఆత్మకథల్లోనే ఒక రకంగా పరిగణింపబడ్డాయి. కానీ 20వ శతాబ్దపు చివరి నుండి వీటికి ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా గుర్తింపు దొరికింది. ఆత్మకథ రచయిత గడిచిన జీవితం మొత్తాన్నీ వల్లెవేయగా, స్వానుభవ చరిత్రలో, రచయిత తన జీవితంలో పాఠకులకు తెలియపరచాలనుకునే కోణానికి మాత్రమే సంబంధించిన అనుభవాలు కనిపిస్తాయి. అంటే రచయిత జీవితంలో ఏదైనా ఒకానొక దశకు చెందినవో, ఒకానొక అనూహ్యమైన సంఘటనకు చెందినవో, జీవితాన్ని మలుపు తిప్పిన అనుభవాలో అయ్యి ఉంటాయి.
తొలి రచనలు
మార్చుక్రీస్తు పూర్వం
మార్చుస్వానుభవ చరిత్రలు ప్రాచీన కాలంలో కూడా వ్రాయబడ్డాయి. క్రీస్తు పూర్వం రచయితల్లో ముఖ్యుడు జూల్యస్ సీజర్. ఇతను లాటిను భాషలో రెండు స్వానుభవ చరిత్రలు వ్రాసాడు. ఒకటి "కొమ్మెన్టారియీ డె బెల్లో గల్లికో" (Commentarii de Bello Gallico, అర్థం: గోలు యుద్ధాలపై వ్యాఖ్యానాలు). క్రీ.పూ 58–50 మధ్యలో అతను జరిపిన గోలు యుద్ధాల అనుభవాలను ఈ రచనలో వ్రాశాడు. తరువాత, నేడు సీజరు అంతర్యుద్ధాలుగా పిలవబడుతున్న, క్రీ.శ 49–48 మధ్యలో జరిగిన అంతర్యుద్ధపు అనుభవాలతో, "కొమ్మెన్టారియీ డె బెల్లో కివిలి" (Commentarii de Bello Civili, అర్థం: అంతర్యుద్ధాలపై వ్యాఖ్యానం) వ్రాసాడు.
మొదటి సహస్రాబ్ది
మార్చుక్రీ.శ 314–398 నాటి రోమను తర్కశాస్త్ర గురువు లివన్యొస్/లెయ్‌బన్యొస్ తన స్వానుభవ చరిత్రలను శిష్యుల చేత గట్టిగా చదివించి, వారికి ప్రసంగాలు ఇవ్వడంలో శిక్షణనిచ్చే వాడు. నాటి గ్రీకు, రోమను సంస్కృతులలో స్వానుభవ చరిత్రలనేవి, తరువాతి కాలంలో ఆత్మకథ వంటి పూర్తిస్థాయి రచనలు చేయవలసినప్పుడు గుర్తుచేసుకోవడానికి పనికివచ్చే జ్ఞాపనపత్రాలుగా వాడేవారు.
జపానులో హెయ్యను కాలంలో (క్రీ.శ 794–1192) స్వానుభవ చరిత్రల రచన ప్రాధాన్యతను పొందింది. ఈ రచనా ప్రక్రియను వీరు నిక్కీ బుంగకు (日記文学) అని పిలుస్తారు. వీటికి ఒక ఉదాహరణ "సరషిన నిక్కి" (更級日記).
రెండవ సహస్రాబ్ది (పద్దెనిమిదవ శతాబ్దికి ముందు)
మార్చుభారతదేశం
మార్చుభారతదేశంలో మొట్టమొదటి స్వానుభవ చరిత్ర వ్రాసింది మొఘలు చక్రవర్తి బాబరు.[1] పదహారవ శతాబ్ది నాటి ఈ రచనకు "బాబరునామా" అని పేరు. పదిహేడవ శతాబ్దంలో బాబరు మునిమనుమడు జహాంగీరు వ్రాసిన రచన "జహాంగీరు నామా". దీనిని కొన్నిచోట్ల ఆత్మకథగా పేర్కొనగా, కొన్నిచోట్ల స్వానుభవ చరిత్రగా పేర్కొన్నారు.
పాశ్చాత్యం
మార్చుమధ్యయుగంలో స్వానుభవ చరిత్రలు వ్రాసినవారు ఫ్రెన్చ్ నైట్ విలర్ద్వఁ ఝొఫ్ర్వ(Geoffroi de Villehardouin), ఫ్రెన్చ్ చరిత్రాకారుడు ఝ్వొఁవి ఝఁ(Jean de Joinville), ఫ్రెన్చ్ దౌత్యవేత్త కొమిన్ ఫిలిప్ (Philippe de Commines).
సాంస్కృతిక పునరుజ్జీవనం ముగిసేనాటికి ఫ్రెన్చ్ సైనికుడు మొఁలిక్ బ్లెజ్ (Blaise de Monluc), ఫ్రెన్చ్ రాకుమారి వల్వ వంశపు మర్గరిట్‌లు (Marguerite) తమ స్వానుభవ చరిత్రలు వ్రాసారు. వీరిలో మర్గరెట్, ఆధునిక శైలిలో స్వానుభవ చరిత్రను వ్రాసిన మొదటి మహిళ.[2]
ఆ తరువాత పద్దెనిమిదవ శతాబ్దికి ముందు స్వానుభవ చరిత్రలు వ్రాసిన ముఖ్య రచయితలు ఆంగ్లేయ రాజకీయ నాయకుడు ఎంథొని ఎష్లె కూపర్ (Anthony Ashley Cooper), ఫ్రెన్చ్ రచయిత ఫ్రఁస్వ డ ల రొష్ఫుకొ (François de La Rochefoucauld), ఫ్రెన్చ్ పెద్దమనిషి ల్వి డ రువ్ర్వలు (Louis de Rouvroy). రువ్ర్వ రచయితగా సుప్రసిద్ధులైననూ, స్వానుభవ చరిత్రలకు మాత్రం ఆయన మరణానంతరమే పేరు వచ్చింది.[3]
18–20 శతాబ్దాల్లో
మార్చుపాశ్చాత్యం
మార్చుఈ శతాబ్దాల్లో ఏదైనా వృత్తిలో బాగా పేరు సంపాదించిన వారు, వారి స్వానుభవాలను వ్రాసేవారు. వీటిని ప్రచురించడం ద్వారా వారి విజయాలు చరిత్రకెక్కేవి. మొదట రాజకీయనాయకులూ, రాజకొలువులో ఉన్నవారూ ఎక్కువగా ఈ రచనలు చేయగా, తరువాత్తరువాత సైనికులూ, వ్యాపారవేత్తలూ కూడా వీరికి తోడయ్యారు. ఈ పోకడకు ఒక మినహాయింపు అమెరికా తత్వవేత్త "హెన్రి డెయ్విడ్ థోరొ" (Henry David Thoreau) 1854లో వ్రాసిన "వోల్డన్" (Walden). ఇందులో సమాజానికి దూరంగా, వోల్డన్ కొలను దగ్గర చిన్న కుటీరంలో రెండేళ్ళు గడిపిన అతని అనుభవాలను గురించి వ్రాసాడు.
20వ శతాబ్దిలో యుద్ధ స్వానుభవ చరిత్రలు ఒక ప్రత్యేక రచనారీతిగా వేరుపడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం ఆధారంగా వ్రాయబడ్డ వాటికి ఉదాహరణలు జర్మన్ సైనికుడు ఎర్న్స్ట్ యుఙ (Ernst Jünger) వ్రాసిన "స్టోర్మ్ ఒఫ్ స్టీల్" (Storm of Steel), ఒస్ట్రెయ్ల్యన్ రచయిత ఫ్రెడ్రిక్ మెనింగ్ (Frederic Manning) వ్రాసిన "హర్ ప్రైవట్స్ వి" (Her Privates We). నాజీ ఆకృత్యాలకు గురైన వారు వ్రాసిన వాటికి ఉదాహరణలు: ఇటలీ నాజీ వ్యతిరేక ఉద్యమకారుడైన యూదు ప్రిమొ లెవి (Primo Levi) వ్రాసిన "ఇఫ్ దిస్ ఈజ్ అ మ్యాన్" (If this is a man) ఔష్విట్స్‌లో ఖైదిగా అతని అనుభవాలను చెబుతుంది. రొమేనియ యూదు ఎలి వీజెల్ (Elie Wiesel) వ్రాసిన "నైట్" కూడా నాజీల చెరలో అతను ఉన్న రోజులను వివరిస్తుంది.
మహమూదీల స్వానుభవ చరిత్రలు
మార్చుమహమూదీ దంపతులు అమెరికాలోని ఒక జంట. భర్త సయ్యద్ మహమూది అమెరికాకు వలస వచ్చిన ఇరానీ వాసి కాగా, భార్య బెటి అమెరికా ఆవిడ. వీరి కూతురి పేరు మెహతోబ్ మహమూది. వీరు సెలవు మీద ఇరాన్‌లో సయ్యద్ ఇంటికి వెళ్ళినప్పుడు, వారు ఇంక అమెరికాకు తిరిగి వెళ్ళేదిలేదనీ, ఇరాన్‌లోనే ఉండిపోవాలని సయ్యద్ ఒత్తిడి చేసాడనీ, దీనికి ఒప్పుకోని తనని బందీగా ఉంచాడనీ, బెటి ఆరోపణ. తాను ఆపైన అప్పటికి చిన్నపిల్ల ఐన కూతురు మెహతోబ్‌ను తీసుకుని ఇరాన్ నుండి తప్పించుకుని అమెరికా చేరుకున్నట్లు బెటి చెప్పింది.
ఈ విషయాలను ఏకరవు పెడుతూ "నొట్ విథౌట్ మై డోటర్" (Not without my daughter, అర్థం: నా కూతురు లేకుండా కాదు (కాదు అంటే వెళ్ళడం కుదరదు అని ఇక్కడ ఉద్దేశం)) అనే స్వానుభవ చరిత్ర వ్రాసింది. 1987లో వచ్చిన ఈ పుస్తకం ఆధారంగా, 1990లో అదే పేరుతో ఆంగ్ల చిత్రం వచ్చింది. ఈ చిత్రం నుండి ప్రేరణ పొంది తీసిన తెలుగు చిత్రం అంతఃపురం.[4][5]
ఈ ఆరోపణలను ఖండిస్తూ సయ్యద్ కూడా "లొస్ట్ విథౌట్ మై డోటర్" (Lost without my daughter, అర్థం: నా కూతురు లేక దిక్కుతోచక) అనే స్వానుభవ చరిత్రను వ్రాసాడు. మెహతోబ్ పెద్దయ్యాక, తన కోణాన్ని చెబుతూ "మై నెయ్మ్ ఈస్ మెహతోబ్" (My Name is Mahtob, అర్థం: నా పేరు మెహతోబ్) అనే స్వానుభవ చరిత్రను వ్రాసింది. దీనిలో ఆమె తన తల్లి పక్షానే న్యాయం ఉన్నట్లు వ్రాసింది.
భారతదేశం
మార్చుభారతీయులు కూడా చాలా మంది స్వానుభవ చరిత్రలు వ్రాసారు. వీరిలో ఎక్కువ మంది రచయితలూ, పాత్రికేయులు లేదా కళాకారులు. దీనికి మినహాయింపులు మహాత్మా గాంధీ వ్రాసిన "సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రిక" (Satyagraha in South Africa), శాసనసభ్యురాలు ముత్తులక్ష్మి రెడ్డి వ్రాసిన "మై ఎక్‌స్ప్యర్యన్స్ ఎస్ అ లెజిస్లెయ్టర్" (My experience as a legislator), వృత్తిరీత్యా సైనికుడు ఐన జాన్ దాళ్వి వ్రాసిన హిమాలయన్ బ్లన్డర్ పుస్తకాలు.
స్వాతంత్ర్యపూర్వ భారతదేశంలో వృత్తిరీత్యా సైనికుడు ఐన సీతారాం పాండేయ్ అనే వ్యక్తి వ్రాసిన స్వానుభవ చరిత్రగా ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్ చెప్పబడుతోంది. ఐతే ఇది నకిలీ స్వానుభవ చరిత్ర అనే ఆరోపణ ఉంది.
జాబితా
మార్చుఇది ఒక పాక్షిక జాబిత. వివాదాస్పద రచన ఐనందున ఫ్రొమ్ సిపొయ్ టు సుబేదార్‌ను చేర్చలేదు.
- సరలాబాలా సరకార్- హారానో అతీత- బంగల
- తారాశంకర్ బంద్యోపాధ్యాయ- బంగలలో చాలా పుస్తకాలు.
- ముండూరు కృష్ణంకుట్టి- ఒరు అధ్యాపకంటే ఆత్మకతంగల్ (ഒരു അധ്യാപകന്റെ ആത്മഗതങ്ങൾ, అర్థం: ఒక అధ్యాపకుని ఆత్మకథలు)- మలయాళం
- జాన్ దాళ్వి- ద హిమాలయన్ బ్లన్డర్- ఆంగ్లం
- పి.జె అంటొని- ఎంటె నాటక స్మరంగలు (എന്റെ നാടക സ്മരണകൾ, అర్థం: నా నాటక స్మరణలు)- మలయాళం
- ఏకరామ ఆలి- బంగలలో రెండు స్వానుభవ చరిత్రలు.
- మహాత్మా గాంధీ- సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రిక (Satyagraha in South Africa)- ఆంగ్లం
- సునంద సికదార- దయామయీర కథా (দয়াময়ীর কথা, అర్థం: దయామయుల కథ)- బంగల
- హకు షా- మానుష్ (मानुष)- హింది
- ఎస్.కె.పొట్టెక్కాట్- ఎంటె వళి(ఴి)యంబలంగల్ (എന്റെ വഴിയമ്പലങ്ങൾ, అర్థం: నా దారి)- మలయాళం
- ఫణీశ్వర్ నాథ్ రేణు- హిందీలో చాలా స్వానుభవ చరిత్రలు వ్రాసారు.
- వైశాఖన్- మలయాళంలో చాలా స్వానుభవ చరిత్రలు వ్రాసారు.
- రోజీ థోమస్- ఉరంగున్న సింహం (ഉറങ്ങുന്ന സിംഹം, అర్థం: నిద్రపోతున్న సింహం)- మలయాళం
- నయనతారా సహగల్- ఆంగ్లంలో రెండు రచనలు చేసారు.
- వైక్కం ముహమ్మద్ బషీర్- ఒర్‌మ్మయుడె అరకల్ (ഓർമ്മയുടെ അറകൾ, అర్థం: జ్ఞాపకాల అరలు)- మలయాళం.
- జెయ్మ్స్ స్కినర్- తజకిరత్ అల్-ఉమారా (అర్థం: ఉన్నత వ్యక్తుల చరిత్రలు)- ఫార్సీ
- ముత్తులక్ష్మి రెడ్డి- మై ఎక్‌స్ప్యర్యన్స్ ఎస్ అ లెజిస్లెయ్టర్" (My experience as a legislator, అర్థం- శాసనసభ్యురాలిగా నా అనుభవాలు)- ఆంగ్లం
- గుణాబాయి గాడేకర్- స్మృతిగంధ
21వ శతాబ్దం
మార్చు1990 నాటి నుండి సామాన్యులు వ్రాసే స్వానుభవ చరిత్రల సంఖ్య బాగా పెరిగింది. స్వియముద్రణా, సాంఖ్యిక ముద్రణలు అందుబాటులోకి వచ్చాక ముద్రణా ఖర్చులు తగ్గాయి.[6] దీనితో ఇంతకు ముందులా ఒక రచనగానో, కళలాగానో, లేక చరిత్రను గ్రంథస్తం చేసేందుకో మాత్రమే వ్రాయడానికి పరిమితం అవ్వకుండా, జనాలు తమ కుటుంబ చరిత్రనూ, విశేషాలనూ పొందుపరచడానికీ, భావితరాలకు అందించడానికీ వీటిని ఒక బాధ్యతలా వ్రాసే పోకడ మొదలైంది.[7] ఇలాంటి ఔత్సాహికులకు చేయూత నందించేందుకుగానూ "అసొసియెయ్షన్ ఒఫ్ పార్సనల్ హిస్టోర్యన్స్" (Association of personal historians) అనే సంస్థ ఉండేది కానీ,[8] కొన్ని కారణాల వల్ల 2017లో అది మూతబడింది.
భారతదేశంలో ఇప్పటికీ స్వానుభవ చరిత్రనీ, ఆత్మకథలనీ పూర్తిగా వేరు చేసి చూడట్లేదు. ఎన్నో స్వానుభవ చరిత్రలు వస్తున్నప్పటికీ దీనికి ఒక ప్రత్యేక రచనా ప్రక్రియగా గుర్తింపు తక్కువే. తన నాన్నగారి మరణానంతరం, 2017లో, "ఇఫ్ ఐ హెడ్ టు టెల్ ఇట్ అగెయ్న్" (If I Had to Tell It Again) అనే, విమర్శకుల మన్ననలు అందుకున్న స్వానుభవ చరిత్ర వ్రాసిన కన్నడ రచయిత గాయత్రీ ప్రభూ ఈ విషయాన్ని చర్చిస్తూ, "భారతదేశపు పుస్తకాల అరల్లో స్వానుభవ చరిత్రా సాహిత్యం అనే వర్గం లేద"ని అభిప్రాయపడ్డారు. భారతదేశంలోని స్వానుభవ చరిత్రలపై పాండిత్య విశ్లేషణ కూడా పెద్దగా జరగలేదు. విమర్శకులు కూడా స్వానుభవ రచనలను ఎవరైనా వ్రాసిపడేసే రచనలన్న చులకనభావంతో చూస్తారు. ఎన్నో స్వానుభవ చరిత్రలు వస్తున్నప్పటికీ, భారతదేశంలోనూ, ఇతర దేశాలలోనూ, పాఠకులు ఎక్కువగా ఆదరించేది సెలబ్రిటీలు వ్రాసినవాటినే.
21వ శతాబ్దిలో వచ్చిన కొందరి ప్రముఖుల రచనలు
మార్చు1990ల్లో వచ్చిన ప్రముఖ స్వానుభవ చరిత్ర మరాఠీ రచయిత సునీత దేశ్‌పాండే వ్రాసిన "ఆహే మనోహర్ తరీ" (आहे मनोहर तरी). ఇది మరికొన్ని భాషల్లోకి అనువాదమయ్యింది. హిందీ రచయిత స్వదేశ్ దీపక్ 2003లో "మైఁనే మాండూ నహీఁ దేఖా" (मैंने मांडू नहीं देखा) అనే పేరుతో ఒక స్వానుభవ చరిత్రను వ్రాసారు. గత రెండు దశాబ్దాల్లో ప్రముఖ మలయాళీ రచయిత ఎం.ఆర్.చంద్రశేఖరన్ ఐదు స్వానుభవ చరిత్రలు వ్రాయగా, తమిళనాడుకు చెందిన ఆంగ్ల రచయిత్రి శోభా నారాయణన్ రెండు పుస్తకాలు వ్రాసారు. వైక్కం ముహమ్మద్ బషీర్ భార్య ఫాబి బషీర్, ఆయన మరణానంతరం, తనకి భర్తతో ఉన్న జ్ఞాపకాలతో, బషీరింటె ఎడియె (ബഷീറിന്റെ എടിയേ) అనే ఒక స్వానుభవ చరిత్రను వ్రాసారు. మరొక మలయాళీ రచయిత్రి ఇందూ మీనన్ 2014లో రెండు పుస్తకాలు విడుదల చేసారు. గత ఐదు ఏళ్ళలో బంగల రచయిత కృష్ణధర్ రెండు స్వానుభవ చరిత్రలు వ్రాసారు.
వృత్తిరీత్యా కళాకారులు కాని వారు కూడా కొన్ని రచనలు చేసారు. శాస్త్రవేత్త సుబ్రత దాసుగుప్త తన చిన్ననాటి జ్ఞాపకలు చెబుతూ వ్రాసిన స్వానుభవ చరిత్ర పేరు "సలాం స్టెన్లి మెథివ్స్". అలాగే భారతీయ రాజకీయ నాయకుడైన వసంత్ సాఠే వ్రాసిన స్వానుభవ చరిత్ర పేరు "మెమ్వార్స్ ఒఫ్ అ రెయ్ష్నలిస్ట్" (Memoirs of a rationalist).
మరికొన్ని ముఖ్య స్వానుభవ చరిత్రలు
మార్చుతెలుగులో చలనచిత్రాలుగా వచ్చిన స్వానుభవ చరిత్రలు
మార్చుపుస్తకం పేరు | రచయిత | తెలుగులో చలనచిత్రం పేరు | వ్యాఖ్య |
---|---|---|---|
నొట్ విథౌట్ మై డోటర్ (Not without my daughter, అర్థం: నా కూతురు లేకుండా కాదు (కాదు అంటే వెళ్ళడం కుదరదు అని ఇక్కడ ఉద్దేశం)) | బెటి మహమూది | అంతఃపురం | స్వానుభవ చరిత్ర ఆధారంగా అదే పేరుతో ఒక ఆంగ్ల చలనచిత్రం వచ్చింది. ఆ చిత్రం ఆధారంగా తీసిన తెలుగు చిత్రం అంతఃపురం |
సింప్లి ఫ్లై: అ దక్కన్ ఒడిసి (Simply Fly: A Deccan Odyssey, అర్థం: ఊరికే ఎగురట: దక్కను ప్రయాణం (దగ్గరి అర్థం)) | జి.ఆర్. గోపినాథ్ | ఆకాశం నీ హద్దురా | తమిళ చిత్రం సూరరై పోట్రుకు అనువాదం |
ముఖ్యమైన చారిత్రాక సంఘటనలపై వచ్చిన స్వానుభవ చరిత్రలు
మార్చుపుస్తకం పేరు | రచయిత | ఘటన | వ్యాఖ్య |
---|---|---|---|
సత్యాగ్రహ ఇన్ సౌత్ ఆఫ్రిక (Satyagraha in South Africa, అర్థం: దక్షిణ ఆఫ్రికాలో సత్యాగ్రహం) | మహాత్మా గాంధీ | సౌత్ ఆఫ్రికా సత్యాగ్రహం | |
ద హిమాలయన్ బ్లన్డర్ | జాన్ దాళ్వి | భారత చైనా యుద్ధం 1962 | |
వీరప్పన్: చెయ్సింగ్ ద బ్రిగన్డ్ (Veerappan: Chasing the Brigand, అర్థం: అడవిదొంగకై గాలించడం) | కె.విజయ్ కుమార్ | ఆపరేషన్ కకూన్ |
భారతరత్న పురస్కార గ్రహీతల స్వానుభవ చరిత్రలు
మార్చుపుస్తకం పేరు | రచయిత | భాష | ప్రచురణ సంవత్సరం | వ్యాఖ్య |
---|---|---|---|---|
మెమ్వార్స్ ఒఫ్ మై వర్కింగ్ లైఫ్ (Memoirs of my working life, అర్థం: నా వృత్తి జీవితంలో స్వానుభవాలు) | మోక్షగుండం విశ్వేశ్వరయ్య | ఆంగ్లం | 1951 | |
చైల్డ్‌హుడ్ డెయ్స్: అ మెమ్వార్ (Childhood days: a memoir, అర్థం: చిన్ననాటి రోజులు: ఒక స్వానుభవ చరిత్ర) | సత్యజిత్ రాయ్ | ఆంగ్లం | 1998 |
పద్మవిభూషణ్ పురస్కార గ్రహీతల స్వానుభవ చరిత్రలు
మార్చుపుస్తకం పేరు | రచయిత | భాష | ప్రచురణ సంవత్సరం | వ్యాఖ్య |
---|---|---|---|---|
ఇన్ ద షాడో ఒఫ్ మహాత్మ: అ పార్సనల్ మెమ్వార్ (In the Shadow of the Mahatma: a personal memoir, అర్థం: మహాత్ముని నీడలో: ఒక వ్యక్తిగత స్వానుభవ చరిత్ర) | ఘనశ్యాం దాస్ బిడ్లా | ఆంగ్లం | 1953 | |
ఇనర్ రిసెసెస్, ఔటర్ స్పెయ్సెస్: మెమ్వార్స్ (Inner Recesses, Outer Spaces: Memoirs, అర్థం: లోపలి మూలలూ, బయటి ఖాళీలు: స్వానుభవాలు) | కమలాదేవి చట్టోపాధ్యాయ | ఆంగ్లం | 1986 | |
మై సౌత్ బ్లొక్ ఇయర్స్ (My South Block Years) | జ్యోతింద్ర నాథ్ దీక్షిత్ | ఆంగ్లం | 1997 | |
మైన్డ్ మాస్టర్: వినింగ్ లెసన్స్ ఫ్రమ్ అ చంపియన్స్ లైఫ్(Mind Master:Winning Lessons from a Champion's Life, అర్థం: మెదడుపై పట్టు: ఒక విజేత జీవితం నుండి విజయ పాఠాలు) | విశ్వనాథన్ ఆనంద్ | ఆంగ్లం | 2019 | |
ఇందిర గాంధి, ఎమర్జన్సి, అన్డ్ ద ఇన్డ్యన్ డెమొక్రసి (Indira Gandhi, the Emergency, and Indian Democracy, అర్థం: ఇందిరా గాంధీ, అత్యయిక స్థితీ, భారత ప్రజాస్వామ్యం) | పి.ఎన్ ధర్ | ఆంగ్లం | 2000 | |
వ్యూ ఫ్రం ద సమిట్: ద రిమార్కబౢ మెమ్వార్ బై ద ఫస్ట్ పర్సన్ టు కొంకర్ ఎవరెస్ట్ (View from the Summit: The Remarkable Memoir by the First Person to Conquer Everest, అర్థం: శిఖరం మీద నుండి దృశ్యం: ఎవరెస్ట్‌ను అధిగమించిన మొదటి వ్యక్తిచే ఒక అద్భుతమైన స్వానుభవ చరిత్ర) | ఎడ్మన్డ్ హిలరి | ఆంగ్లం | 2000 | |
అడ్వైస్ అన్డ్ డిసెన్ట్ (Advice & Dissent, అర్థం: సలహాలూ, విముఖతా) | యాగా వేణుగోపాలరెడ్డి | ఆంగ్లం | 2017 | |
పొక్కువెయిల్ మన్నిల్‌ఎళు(ఴు)తియతు (പോക്കുവെയിൽ മണ്ണിലെഴുതിയത്, అర్థం: పోతున్న దారిలోని మన్నులో వ్రాసినవి) | ఒ.ఎన్.వి.కురుప్ | మలయాళం | ||
పీసింగ్ టగెథర్: మెమ్వార్స్ ఒఫ్ అన్ ఆర్కియోలజిస్ట్ (Piecing Together: Memoirs of an Archaeologist, అర్థం: ఒకటిగా చేర్చడం: ఒక పురాతత్వ నిపుణుడి స్వానుభవాలు) | బి.బి.లాల్ | ఆంగ్లం | 2011 |
పద్మభూషణ్ పురస్కార గ్రహీతల స్వానుభవ చరిత్రలు
మార్చుపుస్తకం పేరు | రచయిత | భాష | ప్రచురణ సంవత్సరం | వ్యాఖ్య |
---|---|---|---|---|
మై ఎక్‌స్ప్యర్యన్స్ ఎస్ అ లెజిస్లెయ్టర్ (My experience as a legislator, అర్థం- శాసనసభ్యురాలిగా నా అనుభవాలు) | ముత్తులక్ష్మి రెడ్డి | ఆంగ్లం | 1930 | |
ఎన్ ఇన్‌హెరిటన్స్ (An inheritance, అర్థం: ఒక వారసత్వం) | ధనవంతి రామారావు | ఆంగ్లం | 1977 | |
రెమినిసన్సెస్ అన్డ్ రిఫ్లెక్షన్స్: మెమ్వార్స్ (Reminiscences and reflections: Memoirs, అర్థం: తలపులూ, ఆలోచనలూ:స్వానుభవాలు) | జాకబ్ చాందీ | ఆంగ్లం | 1988 | |
మై ఇయర్స్ విథ్ నెహ్రు (My years with Nehru, అర్థం: నెహ్రుతో నేను గడిపిన ఏళ్ళు) | బి.ఎన్.మల్లిక్ | ఆంగ్లం | 1971లో మొదటి సంపుటం | మూడు సంపుటాలుగా వచ్చింది. |
ఐ టూ హెడ్ అ డ్రీమ్ (I Too Had a Dream, అర్థం: నాకూ ఒక కల ఉండేది) | వర్ఘీస్ కురియన్ | ఆంగ్లం | 2005 | |
ఒపనింగ్ సీన్: ఆర్లి మెమ్వార్స్ ఒఫ్ అ డ్రెమటిస్ట్ అన్డ్ అ ప్లెయ్ (Opening Scene: Early Memoirs of a Dramatist and a Play, అర్థం: మొదటి సన్నివేశం: ఒక నాటకకర్తవీ, ఒక నాటకానివీ తొలి స్వానుభవాలు) | ఆద్య రంగాచార్య | ఆంగ్లం | 2006 (అనువాదపు ముద్రణ) | రంగాచార్య కన్నడలో వ్రాసిన పుస్తకాన్ని అతని కూతురు శశి దేశపాండే ఆంగ్లంలోకి అనువదించారు. |
బియొన్డ్ బౌన్డరిస్: అ మెమ్వార్ (Beyond Boundaries: A Memoir, అర్థం: సరిహద్దులకు ఆవల: ఒక స్వానుభవ చరిత్ర) | స్వరాజ్ పౌల్ | ఆంగ్లం | 1998 | |
చిదంబర | త్రిభువన దాసు లుహార్ (సుందరం) | గుజరాతీ | ||
పార్సన్స్, పెషన్స్ అన్డ్ పొలిటిక్స్ (Persons, Passions and Politics, అర్థం: మనుషులూ, ఉత్సాహాలూ, రాజకీయాలూ) | మహమ్మద్ యునుస్ | ఆంగ్లం | 1979 | |
అన్నమ్మ | కె.ఎం.మాథ్యూ | మలయాళం | 2004 | 2005లో ఆంగ్లంలో కూడా అచ్చయ్యింది |
హైయర్ ధెన్ ఎవరెస్ట్: మెమ్వార్స్ ఒఫ్ అ మౌన్టినియర్ (Higher Than Everest: Memoirs of a Mountaineer, అర్థం: ఎవరెస్ట్ కంటే ఎత్తున: ఒక పర్వతారోహకుడి స్వానుభవాలు) | ఎచ్.పి.ఎస్ అహలూవాలియ | ఆంగ్లం | 1973 | |
అన్డ్ దెన్ వన్ డెయ్ (And Then One Day, అర్థం: ఆ తరువాత ఒకరోజు) | నసీరుద్దీన్ షా | ఆంగ్లం | 2014 | |
మూడు పుస్తకాలు | ఒ.వి విజయన్ | ఒకటి మలయాళంలో, రెండు ఆంగ్లంలో | ||
అగ్రపతికేరా (অগ্রপথিকেরা, అర్థం: మార్గదర్శకులు) | సౌమిత్ర చటర్జి | బంగ్ల | 2010 | |
నాలుగు పుస్తకాలు | ఎం.టి.వాసుదేవన్ నాయర్ | మలయాళం | ||
ద బ్రాస్ నోట్‌బుక్ (The brass notebook, అర్థం: కంచు నోట్‌బుక్) | దేవకి జైన్ | ఆంగ్లం | 2020 | |
ద వరల్డ్ ఇన్ అవర్ టైమ్: అ మెమ్వార్ (The World In Our Time: A Memoir, అర్థం: మన రోజుల్లో ప్రపంచం: ఒక స్వానుభవ చరిత్ర) | తపన్ రాయచౌదురి | ఆంగ్లం | 2011 | |
బ్రెయ్కింగ్ ఔట్: ఎన్ ఇన్డ్యన్ వుమన్స్ అమెరికన్ జర్ని (Breaking Out: An Indian Woman's American Journey, (దగ్గరి) అర్థం: బయటపడడం : అమెరికాలో ఒక భారతీయ మహిళ ప్రయాణం) | పద్మ దేసాయి | ఆంగ్లం | 2012 | |
రెండు పుస్తకాలు | డొమినిక్ లప్యెర్ | ఆంగ్లం/ఫ్రెన్చ్ | ||
రెండు పుస్తకాలు | శ్రీలాల్ శుక్లా | హింది |
సేకరణ
మార్చుచరిత్రను చూసినవారి మాటల్లో దాన్ని పొందుపరచాలనే ఆశయంతో, కొన్ని సంస్థలు చరిత్రాత్మక సంఘటనలకు సాక్ష్యులైన వ్యక్తులను స్వానుభవ చరిత్రలు వ్రాయమని ప్రోత్సహించి, రచన పూర్తి చేయడంలో చేయూతనిస్తాయి. ఇలాంటి వాటికి ఒక ఉదాహరణ యు.ఎస్‌లోని "వెటరన్స్ హిస్టరి ప్రొజెక్ట్" (Veterans History Project). ఈ పథకం యు.ఎస్‌లోని మాజీ సైనికుల అనుభవాలను వారిచేత అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేస్తుంది.[10]
భారతదేశంలో, భారత వైమానిక దళ మాజీ సైనికులను తమ అనుభవాలను పంచుకోమని ప్రోత్సహించేందుకు, సైనిక ఔత్సాహికులచే నడపబడుతున్న భారత రక్షక్ అనే జాలగూడు, ఇన్డ్యన్ ఎయ్ర్‌ఫోర్స్ వెటరన్ హిస్టరి ప్రొజెక్ట్ అనే పథకాన్ని నడుపుతోంది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Patel, Aakar (18 January 2021) [16 January 2021]. "The learned emperor: 'Baburnama'". Books. The Hindu. Books. Retrieved 12 February 2023.
- ↑ (in French) Viennot, Éliane, Marguerite de Valois et l'écriture de l'histoire, 1574-1614 Archived 2020-09-19 at the Wayback Machine, Études Épistémè, 17, spring 2010.
- ↑ Saintsbury, George (1911). . In Chisholm, Hugh (ed.). ఎన్‌సైక్లోపీడియా బ్రిటానికా (in ఇంగ్లీష్). Vol. 24 (11th ed.). Cambridge University Press. pp. 47–48.
- ↑ "కథ వాళ్లది... క్రియేటివిటీ మనది!". సాక్షి. 27 September 2015. Archived from the original on 15 March 2022. Retrieved 15 March 2022.
- ↑ "A woman scorned". Rediff.com. 18 September 2002. Archived from the original on 25 February 2022. Retrieved 21 August 2020.
- ↑ Henke, Harold (2001). Electronic Books and ePublishing: A Practical Guide for Authors. Springer Science & Business Media. ISBN 978-1852334352. Retrieved 2014-12-12.
- ↑ Balzer, Paula (2011). Writing & Selling Your Memoir: How to Craft Your Life Story So That Somebody Else Will Actually Want to Read It. Writer. ISBN 978-1599631356. Retrieved 2019-08-28.
- ↑ Wright, Chris (2002-01-17). "Ordinary people". The Phoenix. Phoenix Media/Communications Group.
- ↑ Prabhu, Gayathri (30 June 2019). "Indian literature keeps waiting for the literary memoir as a form distinct from the autobiography". scroll.in. literary genres. Retrieved 13 February 2023.
- ↑ "Veterans History Project (Library of Congress)". loc.gov.
మరింత సమాచారం కోసం
మార్చు- "What Is a Memoir?". Celadon Books. 2019-09-06. Retrieved 2022-06-30.
- "How to Start Writing a Memoir: 14 Tips for Starting Your Memoir". Writer's Hive Media. 2022-06-17. Retrieved 2022-06-30.
- "So You Think You Can Write a Memoir?". Columbia Magazine. Retrieved 2022-06-30.
- "Turning Memories Into Memoirs: A Handbook for Writing Lifestories". Google books. Retrieved 2022-02-13.