హచికో కుక్క కథ

లస్సే హళ్ ష్ట్రొం యొక్క 2009 చలన చిత్రం

' 'హచికో: ఒక కుక్క కథ 2009 లో వెలువడిన చలన చిత్రం. ఒక విశ్వాసపాత్రమైన "అకిటా ఇను", నామమాత్ర "హచికో" యొక్క వాస్తవ కథ ఆధారంగా నిర్మించబడ్డ చిత్రం. ఇది 1987 లో వెలువడిన చలనచిత్రం "నిహింగో" యొక్క పునర్నిర్మాణం ఈ చిత్రానికి "లాస్సే హాల్‌స్ట్రోమ్" దర్శకత్వం వహించారు. స్టీఫెన్ P. లిండ్సే రచించిన ఈ చిత్రానికి తారాగణం రిచర్డ్ గేర్, జాన్ అల్లెన్, సారా రోమర్.

Hachi: A Dog's Tale
దర్శకత్వంLasse Hallström
స్క్రీన్‌ప్లేStephen P. Lindsey
నిర్మాతRichard Gere
Bill Johnson
Vicki Shigekuni Wong
నటవర్గంChico
Layla
Forrest
Richard Gere
Joan Allen
Cary-Hiroyuki Tagawa
Sarah Roemer
Jason Alexander
Erick Avari
ఛాయాగ్రహణంRon Fortunato
కూర్పుKristina Boden
సంగీతంJan A. P. Kaczmarek
నిర్మాణ
సంస్థలు
Hachiko, LLC
Grand Army Entertainment,LLC
Opperman Viner Chrystyn Entertainment
Scion Films
Inferno Production
పంపిణీదారులుStage 6 Films
విడుదల తేదీలు
2009 జూన్ 13 (2009-06-13)(Seattle)
నిడివి
93 minutes
దేశాలుUnited States
United Kingdom
భాషఆంగ్ల భాష
బడ్జెట్$16 million[1]
వసూళ్ళు$46,671,235

ఉపోద్ఘాతంసవరించు

ప్రేమంటే ఒక చిన్న పదంలోనో వాక్యం లోనో చెప్పలేనిది. నిజంగా చెప్పాలంటే ఒక నిర్దిష్టమైన రూపకల్పన చేయలేని భావతరంగం. జపాన్ లోని టోక్యో నగరంలో అడుగుపెడితే శిబుయ రైల్వే స్టేషను ఎదురుగా ఒక కూర్చొని ఉన్న కుక్క కాంస్య విగ్రహం కనపడుతుంది ఆ కుక్క పేరు హచికో (hachiko). అంతటి ఉన్నతమైన పేరు రావడం వెనుక ఉన్నా కన్నీటి కథ హచికో కథ.

హచికో కుక్క [2]సవరించు

1923 నవంబరు, ఒడాట్ (odate city) లో హచికో పుట్టింది, 1924 లో దాన్నిఇసబురో ఇనో ( Eisaburo Ueno) అనే ఒక కాలేజి ప్రొఫెసర్ టోక్యో తీసుకువచ్చాడు. అతని వెంట రోజు ఆ కుక్క పిల్ల హచికో కూడా ప్రొఫెసర్ తో పాటు శిబుయ రైల్వే స్టేషను వరకు వచ్చి ఆతను రైలు ఎక్కి వెళ్ళేవరకు ఉండేది. మళ్లీ సాయంత్రం ఆతను వచ్చేవరకు అతనికోసం వేచి ఉండేది. యిలా 1925 మే వరకు జరిగింది. ఒకరోజు రోజులాగే హచికో, ప్రొఫెసర్ రైల్వే స్టేషనుకి వచ్చారు. ఆతను కోసం ఎదురుచూస్తూ ఉంది రోజులాగే హచికో. కానీ అక్కడ ప్రొఫెసర్ హఠాత్తుగా సేరెబ్రల్ హేమరేజ్ (cerebral hemorrhage ) తో చనిపోయాడు. ఈ విషయం ఏమి తెలియని హచికో మాత్రం తన యజమాని కోసం ఎదురుచూడడం మొదలెట్టింది. ప్రొఫెసర్ రాకకై వేచి ఉండి ఇంటికి పరుగులు తీసింది అక్కడ ఆతను కనిపించకపోవడంతో మళ్లీ రైలు రాక కోసం ఎదురుచూస్తూ రైల్వే స్టేషను దగ్గరే ఉండిపోయింది. ఒకరోజు రెండు రోజులు కాదు నెలలు గడుస్తున్న హచికో మాత్రం రోజు రైలు వచ్చేసరికి తన యజమాని రాక కోసం పరుగులు పెట్టేది.

అక్కడ పనిచేసే ఉద్యోగులకు హచికో, అతని యజమాని తెలుసు. ఆ కుక్క ఆరాటం చూడలేకపోయారు. ప్రతిరోజూ చూసే ప్రయాణికులు, అక్కడి సిబ్బంది కూడా హచికోకి ఆహారం అందించేవాళ్ళు. కానీ అది బ్రతకడం కోసమే తిన్నట్టుగా ఉండేది ఒకోసారి కొన్ని రోజులు ఆహారం కూడా ముట్టేది కాదు.

అదే సంవత్సరం (1925) మరణించిన హచికో యజమాని అయినా ప్రొఫెసర్ ఇసబురో ఇనో గారి స్టూడెంట్ ( one of Ueno's students ) ఒకరు, హచికోనీ రైల్వే స్టేషను నుండి అనుసరిస్తూ కొబయషి ఇల్లు (Kobayashi home ) చేరాడు, అది ఒక్కప్పుడు ప్రొఫెసర్ ఉన్న ఇల్లే... కొబయషి ద్వారా హచికో గురించి తెలుసుకొని, హచికో గురించి ఆర్టికల్ రాసాడు. యిలా ఆర్టికల్స్ రాస్తూనే ఉన్నాడు. ఆ ఆర్టికల్స్ ప్రజలందరికి చేరి అందరు హచికో కోసం ఆరాట పడ్డారు. ఒక జపాన్ శిల్పి ఒకరు హచికో కాంస్య విగ్రహానికి రూపకల్పన చేసారు. దాన్ని ఏప్రిల్,1934 లో శిబుయ రైల్వే స్టేషను ( Shibuya Station ) ఎదురుగా ప్రతిష్ఠించారు.

ముగింపుసవరించు

హచికో మాత్రం 1925 నుండి తన యజమాని కోసం ఎదురుచూస్తూనే, ఎన్నో ఆటు పోటులు తట్టుకుంటూ, విపరీతమైన వాతావరణ పరిస్థుల్లో కూడా హచికో తన ఎదురు చూపులతో అక్కడే ఉండిపోయింది. అలా ఎదురు చూసి చూసి 1935 మార్చి 8 లో మరణించింది. ఆ వార్త విని టోక్యో నగరమే తల్లడిల్లింది. ఇప్పటికి ప్రతీ సంవత్సరం ఏప్రిల్ లో హచికో సంస్మరణ రోజు జపాన్ వాసులంతా జరుపుకుంటారు. హచికో స్టఫ్ చేయబడిన శరీరం నేషనల్ సైన్సు మ్యుజియంలో భద్రపరిచారు.

జపాన్ నివాళిసవరించు

1938 లో ప్రతిష్ఠించిన విగ్రహం (hachiko dog statue) రెండవ ప్రపంచ యుద్ధంలో ధ్వంసం అయితే మళ్లీ ఆండో తకేషి (Ando Takeshi ) అనే శిల్పి సృష్టించిన కచికో కాంస్య విగ్రహం 1948 లో తిరిగి ప్రతిష్ఠించారు. అలాంటిదే మరొకటి హచికో జన్మస్థలం అయినా ఒడాట్ (odate) లో ప్రతిష్ఠించారు. మరొక రాతివిగ్రహాన్ని 2004 లో ఒడాట్ (odate) ఆకిడు మ్యూజియం ఎదురుగా ప్రతిష్ఠించారు. అంతే కాకుండా ఎక్కడ అయితే తన యజమానికోసం ఎదురుచూసేదో సరిగ్గా అక్కడే హచికో కాంస్య పాదాలు ఉంచి జపాన్ ప్రజలు హచికో పై తమ అభిమానం వెల్లడించారు.

హచికో మరణం పై వివిధ కథనాలు వినిపించడంతో మార్చి 2011 లో హచికో మరణానికి కారణం పరీక్షించి తెలుసుకున్నారు. హచికో టెర్మినల్ కాన్సెర్, ఫిలిరియా ఇన్ఫెక్షనుతో చనిపోయిందని నిర్ధారించారు.

సూచికలుసవరించు

మూలాలు, వనరులుసవరించు