హనుమంత్ సింగ్ (1939 మార్చి 29 - 2006 నవంబరు 29) భారతీయ క్రికెట్ ఆటగాడు. అతను 1964 నుండి 1969 వరకు భారత క్రికెట్ జట్టు తరపున 14 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. తర్వాత 1995 నుండి 2002 వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ లో మ్యాచ్ రిఫరీగా ఉంటూ, 9 టెస్టులు, 54 వన్డే ఇంటర్నేషనల్స్‌కు పనిచేసాడు.[1]

హనుమంత్ సింగ్
దస్త్రం:Hanumantsingh.jpg
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1939-03-29)1939 మార్చి 29
బాన్‌స్వరా, రాజపుటానా, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ2006 నవంబరు 29(2006-11-29) (వయసు 67)
ముంబై
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగులెగ్ స్పిన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 108)1964 ఫిబ్రవరి 8 - ఇంగ్లాండ్ తో
చివరి టెస్టు1969 సెప్టెంబరు 25 - న్యూజీలాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
రాజస్థాన్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు ఫ.క్లా
మ్యాచ్‌లు 14 207
చేసిన పరుగులు 686 12,338
బ్యాటింగు సగటు 31.18 43.90
100లు/50లు 1/5 29/63
అత్యధిక స్కోరు 105 213*
వేసిన బంతులు 66 3,934
వికెట్లు 0 56
బౌలింగు సగటు 40.94
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 5/48
క్యాచ్‌లు/స్టంపింగులు 11/– 110/–
మూలం: CricInfo, 2017 మార్చి 16

వ్యక్తిగత జీవితం

మార్చు

సింగ్ రాజ్‌పుతానాలోని బన్స్వారాలో రాజపుత్ర కుటుంబంలో జన్మించాడు.[2][3] అతను 1944 నుండి 1985 వరకు బన్స్వారాకు మహారావల్‌గా ఉన్న చంద్రవీర్ సింగ్‌కు హనుమంత్ సింగ్ రెండవ కుమారుడు. అతని తల్లి కుమార్ శ్రీ దులీప్‌సిన్హ్జీ కి సోదరి.[4] అతని అన్నయ్య, సూర్యవీర్ సింగ్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని కుమారుడు సంగ్రామ్ సింగ్ ముంబై U-16 జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. బంధువు, KS ఇంద్రజిత్‌సిన్హ్జీ కూడా భారతదేశం తరపున 4 టెస్టులు ఆడాడు. [5] హనుమంత్ సింగ్ మొదట డెహ్రాడూన్‌లోని వెల్హామ్ బాలుర పాఠశాలలో చదువుకున్నాడు. తర్వాత ఇండోర్‌లోని డాలీ కాలేజీలో విద్యాభ్యాసం పూర్తి చేశాడు. డాలీ కాలేజీలో అతని పేరు మీద హనుమంత్ ఓవల్‌ అనే క్రికెట్ మైదానం ఉంది. అతను మధ్యభారత క్రికెట్ జట్టులో సభ్యుడు. [6]

కెరీర్‌

మార్చు

హనుమంత్ సింగ్ దేశీయ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌ను ముందు మధ్యభారత్ జట్టుతోను,ఆ తర్వాత రాజస్థాన్, సెంట్రల్ జోన్ జట్ల తోనూ ఆడాడు. పొట్టిగా ఉండడం చేత అతన్ని "ఛోటూ" అని పిలిచేవారు. అతను బ్యాక్ ఫుట్‌పై ఉండి, లెగ్ సైడ్‌లో బాగా బ్యాటింగ్ చేస్తాడు.

అతను 1964 ఫిబ్రవరిలో ఢిల్లీలో ఇంగ్లండ్‌తో జరిగిన 4వ టెస్టులో తొలిసారి ఆడి, 105 పరుగులు చేశాడు. లాలా అమర్‌నాథ్, దీపక్ శోధన్, AG కృపాల్ సింగ్, అబ్బాస్ అలీ బేగ్‌లను బాటలో తొలి టెస్టు లోనే శతకం సాధించాడు.[7] అదే సంవత్సరం, ఆస్ట్రేలియాతో జరిగిన తన మొదటి టెస్టులో మొత్తం జట్టు 193 పరుగులు చేయగా అందులో 94 పరుగులు హనుమంత్ సాధించాడు [8]

అతను 1964-65 లో స్వదేశంలో న్యూజిలాండ్‌పై, 1966-67లో వెస్టిండీస్‌పై ఆడాడు. 1967లో ఇంగ్లాండ్‌లో పర్యటించాడు. అయితే, అనేక ఇతర ప్రముఖ భారతీయ ఆటగాళ్ళ లాగానే, అతన్ని కూడా 1967-68 ఆస్ట్రేలియా పర్యటించిన జట్టులోకి తీసుకోలేదు. [9] 1969 సెప్టెంబరులో బాంబేలో న్యూజిలాండ్‌తో ఆడిన జట్టులోకి తిరిగి తీసుకున్నారు. అందులో అతను 1, 13 పరుగులు చేశాడు. రెండు సార్లూ డేల్ హాడ్లీ ఫాస్ట్ బౌలింగ్‌లో కీపరుకు క్యాచ్ ఇచ్చాడు. ఆ తరువాత మళ్లీ టెస్ట్ క్రికెట్ ఆడలేదు, మరో టెస్టు సెంచరీ చేయలేదు.


అతను మూడు రంజీ ట్రోఫీ ఫైనల్స్‌లో రాజస్థాన్‌ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ ప్రతిసారీ ఓడిపోయాడు. [10] అతను 1971-72లో దులీప్ ట్రోఫీలో సెంట్రల్ జోన్‌కి మొదటి విజయాన్ని అందించాడు. 1966-67లో రంజీ ట్రోఫీ ఫైనల్‌లో, అతను బాంబేపై 109, 213* పరుగులు చేశాడు. అతని అన్నయ్య, సూర్యవీర్ సింగ్, అదే మ్యాచ్‌లో 79, 132 పరుగులు చేశాడు. వారిద్దరు తమ భాగస్వామ్యంలో 176, 213 పరుగులు చేసారు. హనుమంత్ సింగ్ 1979లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు [11]

కోచింగ్ కెరీర్

మార్చు

అతను 1983 లో వెస్టిండీస్‌లో పర్యటించిన భారత జట్టుకు మేనేజర్‌గా ఉన్నాడు. రాజస్థాన్ క్రికెట్ జట్టుకు, 1990 ప్రారంభంలో కెన్యా క్రికెట్ జట్టుకూ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు.[12] 1990 నెదర్లాండ్స్‌లో జరిగిన ICC ట్రోఫీలో కెన్యా జట్టు సెమీ-ఫైనల్‌కు చేరింది. ఆపై 1994 ICC ట్రోఫీ ఫైనల్‌లో UAE క్రికెట్ జట్టు చేతిలో కెన్యా ఓడిపోయింది. అతను 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఆడిన కెన్యా జట్టుకు కూడా కోచ్‌గా ఉన్నాడు. వారు వెస్టిండీస్ క్రికెట్ జట్టుపై భారీ విజయాన్ని సాధించారు, ఇది ODI లలో అతిపెద్ద అప్‌సెట్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. [13] [14]

నిర్వాహకుడు

మార్చు

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్యానల్లో భాగంగా ఉంటూ, 1995 మార్చి నుండి 2002 ఫిబ్రవరి వరకు 9 టెస్టులు, 54 వన్‌డేలలో మ్యాచ్ రిఫరీగా పనిచేశాడు. అతను బెంగుళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీకి చైర్మన్‌గా, రాజస్థాన్ కోచ్‌గా కూడా పనిచేసాడు. క్రికెట్‌కు బయట, అతను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎగ్జిక్యూటివ్‌గా ఉన్నాడు. [15]

హనుమంత్ సింగ్ 2006లో డెంగ్యూ జ్వరంతో 67 ఏళ్ల వయసులో ముంబైలో మరణించాడు.[16]

మూలాలు

మార్చు
  1. "Royalty on the cricket field". International Cricket Council. Retrieved 18 May 2018.
  2. "The Rajputs from Battle fields to Cricket fields"
  3. Srinivasan 2014, p. 71.
  4. Sen, Satadru (2012). Disciplined Natives: Race, Freedom and Confinement in Colonial India (in ఇంగ్లీష్). Primus Books. ISBN 978-93-80607-31-3.
  5. "Prince Indrajitsinhji". Cricinfo. Retrieved 2020-09-20.
  6. "Hanumant Singh Profile - Cricket Player,India|Hanumant Singh Stats, Ranking, Records inCricket -NDTV Sports". NDTVSports.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  7. "Hanumant Singh Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  8. "ShieldSquare Captcha". validate.perfdrive.com. Retrieved 2020-09-20.[permanent dead link]
  9. "Hanumant Singh: The Tragic Prince of Indian Cricket". CricketMash (in బ్రిటిష్ ఇంగ్లీష్). 30 March 2020. Retrieved 2020-09-20.
  10. Srinivasan 2014, p. 68.
  11. "Hanumant Singh Profile - ICC Ranking, Age, Career Info & Stats". Cricbuzz (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  12. Vijayakar, Pradeep; Swamy, V. Narayan (March 19, 2003). "Kenya face their godfathers in mother of unlikely battles". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  13. "From import to export, the Indian coaching story". Archived from the original on 21 June 2017. Retrieved 24 April 2016.
  14. "Kenyan coach Hanumant Singh seen with captain Maurice Odumbe at a practice session in Cuttack,... | The Hindu Images". thehinduimages.com. Retrieved 2020-09-20.
  15. "Hanumant Singh Profile and Biography". india.crictotal.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-09-20.
  16. "Hanumant Singh battles for life". www.espncricinfo.com (in ఇంగ్లీష్). Retrieved 2020-09-20.