హఫీజ్‌భాయ్ ధాతురే
హఫీజ్‌హుస్సేన్ ధాతురే మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మిరాజ్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
హఫీజ్‌భాయ్ ధాతురే | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 1999 - 2009 | |||
ముందు | శరద్ రాంగొండ పాటిల్ | ||
---|---|---|---|
తరువాత | సురేష్ ఖాడే | ||
నియోజకవర్గం | మిరాజ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | మిరాజ్, మహారాష్ట్ర | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
రాజకీయ జీవితం
మార్చుహఫీజ్భాయ్ ధాతురే భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి మున్సిపల్ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయి అనంతరం 1999 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో మిరాజ్ శాసనసభ నియోజకవర్గం నుండి ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి పాటిల్ బజరంగ్ తుకారాంపై 13637 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2004 మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో ఐఎన్‌సీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి శివసేన అభ్యర్థి పాటిల్ బజరంగ్ తుకారాంపై 11415 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.
మరణం
మార్చుహఫీజ్భాయ్ ధాతుర్ గుండెపోటు రావడంతో మిషన్ ఆసుపత్రిలో చేరగా ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ 77 ఏళ్ల వయసులో 2018 ఫిబ్రవరి 14న మరణించాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.[1][2][3][4]
మూలాలు
మార్చు- ↑ "Congress leader and former Maharashtra MLA Hafizbhai Dhature dies of heart failure" (in ఇంగ్లీష్). The New Indian Express. 14 February 2018. Retrieved 16 January 2025.
- ↑ "Former MLA Dhature dies". Business Standard. 14 February 2018. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "माजी आमदार हाफिज धत्तुरे यांचे हृदयविकाराच्या धक्क्याने निधन". Lokmat. 14 February 2018. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.
- ↑ "मिरजचे माजी आमदार हाफिज धत्तूरे यांचे निधन; जन्मदिनीच घेतला अखेरचा श्वास". Loksatta. 14 February 2018. Archived from the original on 16 January 2025. Retrieved 16 January 2025.