హర్భజన్ సింగ్ (కవి)

హర్భజన్ సింగ్ (1920 ఆగస్టు 182002 అక్టోబరు 21) పంజాబీ రచయిత, విమర్శకుడు, సాహిత్యకారుడు, అనువాదకుడు. ఆయన 17 సంపుటాల పద్యాలను, సాహిత్య చరిత్ర యొక్క 19 రచనలను, అరిస్టాటిల్, సోఫోకిల్స్, రవీంద్రనాథ్ ఠాగోర్ ల సాహిత్యాంశాల అనువాదాలను ప్రచురించారు. ఆయనకు సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు వచ్చింది.

హర్భజన్ సింగ్
2000లో హర్భజన్ సింగ్
జననం(1920-08-18)1920 ఆగస్టు 18
Lumding, Assam
మరణం2002 అక్టోబరు 21(2002-10-21) (వయసు 82)
జాతీయతభారతీయుడు
వృత్తిరచయిత, విమర్శకుడు, అనువాదకుడు

జీవిత విశేషాలు మార్చు

ఆయన ఆగస్టు 18 1920 న అస్సాం లోని లుడింగ్ లో గంగా దేయి, గండా సింగ్ దంపతులకు జన్మించారు. ఆయన తండ్రి క్షయ వ్యాధితో బాధపడేవారు. ఆయన కుటుంబం లాహోర్ కు వెళ్ళి అచ్చట గవల్‌మండి ప్రాంతంలో రెండు గృహాలను కొనుగోలు చేసింది. ఆయన తండ్రి హర్బజన్ సింగ్ కు యేడాది వయస్సు లోపలే మరణించాడు. అప్పుడు ఆయన తల్లి, ఇద్దరు సోదరీమణులు కూడా ఆయన నాలుగేళ్ళ వయసు ఉన్నప్పుడు మరణించారు. ఆయనను లాహోర్ లో ఉన్న తన పిన్ని గారు పెంచుకున్నారు. ఆయన స్థానిక డి.ఎ.వి పాఠశాలలో విద్యాభ్యాసం చేసారు. ఆ పాఠశాలలో ప్రతిభావంతునిగా ఉండేవారు. ఆయన పంజాబ్ లో మొదటి మూడు స్థానాలలో ఉన్నప్పటికీ పేదరికం వల్ల విద్యాభ్యాసం కొనసాగించలేకపోయారు. ఆయన లాహోర్ లో హోమియోథెరపిక్ కెమిస్ట్ షాపు వద్ద సేల్స్ బాయ్ గా ఉద్యోగంలో చేరారు. తరువాత న్యూఢిల్లీలో లోయర్ డివిజినల్ క్లార్క్ గా పనిచేసారు. తరువాత న్యూఢిల్లీ లోని ఖల్సా పాఠశాలలో అసిస్టెంట్ లైబ్రేరియన్ గా ఉద్యోగం చేసారు.

సింగ్ తన ఉన్నత విద్యను కళాశాలకు వెళ్ళకుండా పూర్తిచేసారు. ఆయన ఆంగ్ల, హిందీ సాహిత్యాలలో డిగ్రీలు చేసారు. వాటిని న్యూఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పూర్తి చేసారు. ఆయన హిందీ కవిత్వంలో గురుముఖి స్క్రిప్ట్ లో పి.హెచ్.డి చేశారు.

ఆయన ముగ్గురు కుమారులలో ఒకడైన మదన్ గోపాల్ సింగ్ ప్రసిద్ధ గాయకుడు, పండితుడు.

సత్కారాలు మార్చు

  • 1970: సాహిత్య అకాడమీ అవార్దు, సాహిత్య అకాడమీ, భారతదేశం ("నా దుప్పె నా చావె" పుస్తకానికి)[1]
  • 1987: "కబీర్ సమ్మా" -మధ్యప్రదేశ్ ప్రభుత్వంలో అత్యున్నతమైన పురస్కారం.
  • 1994: సరస్వతీ సమ్మాన్ - సాహిత్య పురస్కారం, భారతదేశం.
  • 1994: సాహిత్య అకాడమీ ఫెలోషిప్, న్యూఢిల్లీ - యితర పంజాబీ రచయితలలో ఈ పురస్కారం పొందిన వారు.[2]
  • సోవియత్ లాండ్ నెహ్రూ అవార్డు -
  • 2002: ధలివాలా సమ్మాన్ - లూధియానా లోని పంజాబ్ సాహిత్య అకాడమి యొక్క అత్యున్నత పురస్కారం.

మూలాలు మార్చు

  1. Punjabi Archived 2009-03-31 at the Wayback Machine Sahitya Akademi.
  2. "Biography". Archived from the original on 24 ఆగస్టు 2006. Retrieved 10 August 2006.

ఇతర పఠనాలు మార్చు

ఇతర లింకులు మార్చు

ఇతర లింకులు మార్చు