హర్‌దీప్ సింగ్ పూరీ
హర్‌దీప్ సింగ్ పూరీ (జననం 1952 ఫిబ్రవరి 15) ఒక భారతీయ రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు. ఇతను భారతీయ జనతా పార్టీకి చెందినవాడు.[1][2]
హర్‌దీప్ సింగ్ పూరీ | |||
| |||
కేంద్ర పెట్రోలియం , సహజవాయువు శాఖ మంత్రి
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
---|---|---|---|
ముందు | ధర్మేంద్ర ప్రధాన్ | ||
కేంద్ర గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2017 సెప్టెంబర్ 3 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
ముందు | నరేంద్ర సింగ్ తోమార్ | ||
పదవీ కాలం 2019 మే 30 – 2021 జులై 7 | |||
ప్రధాన మంత్రి | నరేంద్ర మోడీ | ||
తరువాత | జ్యోతిరాదిత్య సింధియా | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | ఢిల్లీ, భారతదేశం | 1952 ఫిబ్రవరి 15||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | లక్ష్మి పూరి |
తొలినాళ్ళ జీవితం
మార్చుపూరి 1952 ఫిబ్రవరి 15న భారతదేశంలోని ఢిల్లీలో జన్మించాడు. అతను హిందూ కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ హిస్టరీ, చరిత్రలో మాస్టర్స్ డిగ్రీని చదివి పట్టభద్రుడయ్యాడు. తరువాత అతను ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్ గా తన కెరీర్ని ప్రారంభించాడు. ఇతని భార్య లష్మీ సింగ్ పూరి ఒక ఐఎఫ్ఎస్ అధికారి, ప్రస్తుతం ఈమె ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.[3][4]
కెరీర్
మార్చుఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో చరిత్ర ప్రొఫెసర్ గా తన కెరీర్ని ప్రారంభించిన పూరి 1994 నుండి 1997 వరకు ఆతర్వాత 1999 నుండి 2002 వరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేశాడు. 1997 నుండి 1999 వరకు భారతదేశ రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2009 నుంచి 2013 వరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా పనిచేశాడు.[5][6]
రాజకీయ జీవితం
మార్చుపూరీ 2014 జనవరిలో బిజెపిలో చేరాడు. అతను 2019 నుండి గృహ, పట్టణాభివృద్ధి, విమానయాన, వాణిజ్య, పరిశ్రమల (అదనపు బాధ్యత) కేంద్ర మంత్రిగా ఉన్నాడు.[7] 2021 జూలై 7 నుండి పెట్రోలియం, సహజవాయువు శాఖ, గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడు.
మూలాలు
మార్చు- ↑ "Hardeep Singh Puri sworn in as Union Cabinet minister". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2021-07-07.
- ↑ "Hardeep Singh Puri given charge of Petroleum and Urban Development Ministries". Times Now (in ఇంగ్లీష్). Retrieved 2021-07-07.
- ↑ "Welcome To IANS Live - NATION". IANS Live. Archived from the original on 2021-07-30. Retrieved 2021-07-30.
- ↑ "Hardeep Puri to be next Permanent Representative of India to UN". One India News. Archived from the original on 14 సెప్టెంబరు 2011. Retrieved 21 October 2012.
- ↑ "Ex-UN envoy Hardeep Singh Puri joins BJP". @businessline (in ఇంగ్లీష్). Retrieved 2018-03-26.
- ↑ Kaushal, Akshat (2014-01-11). "I admire the BJP's approach towards national security: Hardeep Singh Puri". Business Standard India. Retrieved 2018-03-26.
- ↑ "Modi cabinet rejig: Full list of new ministers". India Today. Retrieved 2021-07-08.