హాలియా పురపాలకసంఘం

హాలియా పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ.[1] హాలియా పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం లోని నాగార్జునసాగర్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[2]

హాలియా పురపాలకసంఘం
—  పురపాలకసంఘం  —
హాలియా పురపాలకసంఘం is located in తెలంగాణ
హాలియా పురపాలకసంఘం
హాలియా పురపాలకసంఘం
అక్షాంశరేఖాంశాలు: 16°47′07″N 79°19′01″E / 16.7852844°N 79.3169802°E / 16.7852844; 79.3169802
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండలం అనుమల
ప్రభుత్వం
 - చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మ
 - వైస్ చైర్‌పర్సన్‌ సుధాకర్
వైశాల్యము
 - మొత్తం 42.84 km² (16.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 17,371
 - పురుషుల సంఖ్య 8,705
 - స్త్రీల సంఖ్య 8,666
 - గృహాల సంఖ్య 5,262
పిన్ కోడ్ - 508377
ఎస్.టి.డి కోడ్ - 08680
వెబ్‌సైటు: అధికార వెబ్ సైట్

చరిత్ర మార్చు

మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న హాలియా, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[3]

భౌగోళికం మార్చు

హాలియా 42.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 25°49′48″N 84°11′06″E / 25.830°N 84.185°E / 25.830; 84.185 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 150 కిలోమీటర్ల దూరంలో, జిల్లా కేంద్రం నల్గొండ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉంది.

జనాభా గణాంకాలు మార్చు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 17371 మంది కాగా, అందులో 8705 మంది పురుషులు, 8666 మంది మహిళలు ఉన్నారు. 5262 గృహాలు ఉన్నాయి. ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డుగా విభజించబడింది.[4]

పౌర పరిపాలన మార్చు

పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం దీనిని 12 ఎన్నికల వార్డులుగా విభజింపబడింది. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రకారం వెంపటి పార్వతమ్మ చైర్‌పర్సన్‌గా, సుధాకర్ వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[5][6] వీరు ఎన్నికైననాటినుండి నుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.[7]

వార్డు కౌన్సిలర్లు మార్చు

  1. సిహెచ్ చంద్రారెడ్డి
  2. దీప్తి
  3. యల్లమ్మ
  4. పిల్లి చంద్రకళ
  5. గౌనీ సుధాకర్ (వైస్ చైర్‌పర్సన్‌)
  6. అనుపమ
  7. వెంకటమ్మ
  8. అన్నెపాల శ్రీనివాస్
  9. వెంపటి పార్వతమ్మ (చైర్‌పర్సన్‌)
  10. ప్రసాద్ నాయక్
  11. వర్ర వెంకట్ రెడ్డి
  12. సుధాకర్

మూలాలు మార్చు

  1. "Haliya Municipality". haliyamunicipality.telangana.gov.in. Retrieved 9 April 2021.
  2. Telangana, Government. "Commissioner and Director of Municipal Administration(CDMA), Municipal Administration and Urban Development (MA&UD) Department". cdma.telangana.gov.in. Archived from the original on 4 December 2019. Retrieved 9 April 2021.
  3. నమస్తే తెలంగాణ (28 March 2018). "రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే..." Archived from the original on 13 September 2018. Retrieved 9 April 2021.
  4. "Basic Information of Municipality, Haliya Municipality". haliyamunicipality.telangana.gov.in. Retrieved 9 April 2021.
  5. సాక్షి, తెలంగాణ (27 January 2020). "తెలంగాణ: మున్సిపల్‌ చైర్మన్లు వీరే". Sakshi. Archived from the original on 27 January 2020. Retrieved 9 April 2021.
  6. నమస్తే తెలంగాణ, తెలంగాణ (27 January 2020). "ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల జాబితా." ntnews. Archived from the original on 3 March 2021. Retrieved 9 April 2021.
  7. skannegari. "Haliya Municipal Election 2020 - Telangana NavaNirmana Sena". tgnns.com. Archived from the original on 14 ఏప్రిల్ 2021. Retrieved 9 April 2021.

వెలుపలి లంకెలు మార్చు