హిజ్బుల్లాహ్ లెబనాన్ దేశానికి చెందిన షియా ఇస్లామిక్ రాజకీయ పార్టీ. హిజ్బ్ అల్లాహ్ అంటే "దేవుని పార్టీ" (Party of God) అని అర్థం. హిజ్బుల్లాహ్ ఒక వైపు అమెరికా సామ్రాజ్యవాదం, ఇస్రాయెల్ జియోనిజంలకు వ్యతిరేకంగా పోరాడుతూనే మరో వైపు లెబనాన్ పార్లమెంటు ఎన్నికలలో పోటీ చేస్తోంది. లెబనాన్ లో విద్యా సంస్థలు, ఆసుపత్రులు కూడా నడుపుతోంది.

వెబ్ సైట్లుసవరించు