హిమజ్వాల, వడ్డెర చండీదాస్ రాసిన మనో వైజ్ఞానిక నవల. 1967లో ఆంధ్రజ్యోతి పత్రికలో సీరియల్ గా ప్రచురితమైన ఈ నవల సంచలనం సృష్టించింది. అంచనాలకు మించి పాఠకులను ఆకట్టుకుంది.[1]

రచన నేపథ్యం

మార్చు

వడ్డెర చండీదాస్ అన్న కలంపేరుతో రచన చేసిన చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్త్వశాస్త్ర అధ్యాపకుడు. 1960లో అతను హిమజ్వాల నవల రాయడం ప్రారంభించాడు. 1961లో మొదటి అధ్యాయాన్ని పూర్తిచేశాడు. ఐతే, 1967 వరకూ తిరిగి దీన్ని రాయడం కొనసాగించలేదు. హఠాత్తుగా 1967లో తిరిగి ప్రారంభించి ఆరు నెలల్లో పూర్తిచేశాడు. ఆ ఏడాది ఆంధ్రజ్యోతి వారపత్రికలో సీరియల్ గా ప్రచురితమైంది. ఈ నవలను కథకుడు, నవలా రచయిత బుచ్చిబాబుకు "తెనుగుతనపు కూపంలో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్విగా" అభివర్ణిస్తూ చండీదాస్ అంకితమిచ్చాడు.[2][1]

మూలాలు

మార్చు
  1. 1.0 1.1 "ఓ వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ – ఈమాట" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-01-12.
  2. నాగులూరు, దయాకర్ (1 March 2006). "వడ్డెర చండీదాస్ 'హిమజ్వాల' ఓ తాత్విక విశ్లేషణ (మొదటి భాగం)" (PDF). మిసిమి: 137–144.
"https://te.wikipedia.org/w/index.php?title=హిమజ్వాల&oldid=3094217" నుండి వెలికితీశారు