ప్రధాన మెనూను తెరువు

హెబియస్ కార్పస్ ను తెలుగులో బంది ప్రత్యక్ష అదిలేఖ అంటారు. హెబియస్ కార్పస్ అనేది లాటిన్ పదము. హెబియస్ కార్పస్ అనేది పురాతనమైన "రిట్". హెబియస్ అనగా HAVE కార్పస్ అనగా BODY అని అర్ధం వస్తుంది. అనగా ఒక వ్యక్తిని భౌతికంగా కోర్టు ముందు హాజరు పరచడం.భారత రాజ్యాంగంలో నిభందన 19 నుండి 22 వరకు పొందుపరచిన వ్యక్తిగత స్వేచ్ఛ లకు భంగం కలిగినపుడు ఈ రిట్ ను జారీ చేస్తారు. అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 24 గంటలలోగా సమీప న్యాయస్థానంలో హాజరు పరచకపొతే, ఈ రిట్ దాఖలు చేసినచో వెంటనే ఆ వ్యక్తిని న్యాయస్థానం ముందు హాజరు పరచమని కోర్టు ఆదేశిస్తుంది.