హైద్రాబాద్ విషాదం (పుస్తకం)

డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలుగు అనువాద పుస్తకం


హైద్రాబాద్ విషాదం అనేది మీర్‌ లాయక్‌ అలీ ఇంగ్లీష్‌లో రాసిన ‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ పుస్తకానికి డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి రాసిన తెలుగు అనువాద పుస్తకం.[1] తన స్వీయ అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఆఖరు పోరాటంగా నిజాం రాజు చేసిన ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలు విఫలంకావడానికి కారణమైన పరిస్థితులు, ఆ పరిస్థితులను ప్రభావితం చేసిన అంశాలు, తెరపైన - తెరవెనక పాత్రదారులు మొదలైన అంశాలపై రాసిన పుస్తకమిది. ఈ పుస్తకం పాలపిట్ట బుక్స్ నుండి ప్రచురించబడింది.[2]

హైద్రాబాద్ విషాదం
హైద్రాబాద్ విషాదం పుస్తక ముఖచిత్రం
కృతికర్త: డాక్టర్‌ ఏనుగు నరసింహారెడ్డి (అనువాదం)
మీర్‌ లాయక్‌ అలీ (‘ట్రాజెడీ ఆఫ్‌ హైదరాబాద్‌’ - ఆంగ్లం)
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): చరిత్ర
ప్రచురణ: పాలపిట్ట బుక్స్, హైదరాబాదు
విడుదల: 2016
పేజీలు: 320

పుస్తక నేపథ్యం మార్చు

మీర్‌ లాయక్‌ అలీ 1947 డిసెంబరు నెల నుండి 1948 సెప్టెంబరులో హైదరాబాద్‌ సంస్థానం ఇండియన్‌ యూనియన్‌ వశమయ్యేవరకు తొమ్మిదిన్నర నెలలపాటు సంస్థానపు ప్రధాన మంత్రిగా, ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌కు సన్నిహితునిగా కొనసాగాడు. హైదరాబాద్‌ స్వతంత్ర సంస్థానంగా కొనసాగాలని కోరుకొని, దానికోసం తీవ్రంగా ప్రయత్నించిన వారిలో ఈ లాయక్‌ అలీ ఒకడు. లాయక్‌ అలీ సంపన్న వ్యాపారవేత్త. హైదరాబాద్‌ ప్రధాని పదవి చేపట్టక ముందు ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్‌ దేశ ప్రతినిధిగా కూడా పనిచేశాడు.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్నటినుండి పోలీస్‌ యాక్షన్‌ వరకు 13 నెలల పాటు నిజాం రాజ సంస్థానం కేంద్రంగా చోటు చేసుకున్న అనేక పరిణామాల గురించి 1962లో లాయక్ అలీ రాసిన పుస్తకమిది. బ్రిటిష్ పాలన చివరి రెండేళ్ళు, భారత విభజన, శరణార్థులు, విభజన తరువాత మహ్మదలీ జిన్నా (ఖాయిద్ ఏ ఆజమ్) వైఖరి, ఆఖరి నిజాం, రజాకార్లు, గాంధీ హత్య, నిజాం లొంగుబాటు వంటి కీలక అంశాల గురించి రాయబడింది.[3] 34 అధ్యాయాలున్న ఈ పుస్తకం ఆఖరులో లాయక్ అలీ, గృహ నిర్బంధం నుంచి తప్పించుకుని పాకిస్తాన్‌కు వెళ్ళిపోయిన వైనాన్ని కూడా అనుబంధంగా చేర్చబడింది.[4]

విషయసూచిక మార్చు

  1. దేశ విభజన తరువాత
  2. పాకిస్తాన్ జాతిపితతో నా సమావేశం
  3. హైద్రాబాద్ సంస్థానం - నిజాం నవాబులు
  4. స్టేట్ కాంగ్రెస్, హిందూ మహాసభ ఇతర సంస్థలు
  5. బహద్దూర్ యార్ జంగ్, ఇత్తెహాదుల్ ముస్లిమీన్
  6. సర్ అక్బర్ హైదరీ అలీ, నిష్క్రమణ
  7. సంక్షోభంలోకి సర్ మీర్జా ఇస్మాయిల్
  8. మీర్జా నిష్క్రమణ, ఛత్తారి పునరాగమనం
  9. రజాకార్లు
  10. ప్రధాని పదవి
  11. మధ్యంతర ప్రభుత్వ ఏర్పాటు
  12. ఏజంట్ జనరల్ ఆగమనం
  13. ఏజంట్ జనరల్ మున్షీ
  14. గాంధీజీ హత్య
  15. భారతదేశం - హైద్రాబాద్ సమస్యలు
  16. ఢిల్లీ పెద్దలు
  17. అంతర్గత పర్యవసానాలు
  18. ఢిల్లీ కరాచీల మధ్య
  19. హైద్రాబాద్ ప్రతినిధి బృందం చాతుర్యం
  20. సరిహద్దుల్లో చేజారిన పరిస్థితులు
  21. భారత్ నుండి కొత్తగా బెదిరింపులు
  22. ఢిల్లీలో కొత్త ఎత్తులు
  23. నిజాం పరీక్ష
  24. ఒత్తిడిలో ప్రజాభిప్రాయం
  25. చర్చల ముగింపు
  26. ఐకమత్యానికి ఢిల్లీ ప్రమాద ఘంటికలు
  27. ఏడుగురు నానజ్ అమరవీరులు
  28. కొన్ని అంతర్గత ఒత్తిడులు
  29. మరణశయ్య మీద జిన్నా
  30. మహానేత అస్తమయం
  31. దండయాత్ర ప్రారంభం
  32. కొనసాగిన దండయాత్ర
  33. దిగజారిన అంతర్గత పరిస్థితి
  34. క్షీణించిన సామర్థ్యం, లొంగుబాటు
  35. లాయక్ అలీ ఎలా తప్పించుకున్నాడు?
  36. హిమాయత్ సాగర్, హుస్నాబాద్

మూలాలు మార్చు

  1. ALI, MEER LAIQ; REDDY, ANUGU NARSIMHA (2020-01-01). HYDERABAD VISHAADAM (in Telugu) (1 ed.). Mohi Book Depot.{{cite book}}: CS1 maint: unrecognized language (link)
  2. "లాయక్‌ అలీ విషాదం". Sakshi. 2020-02-24. Archived from the original on 2021-11-02. Retrieved 2021-11-22.
  3. "హైద్రాబాద్ విషాదం". Sakshi. 2016-06-06. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.
  4. "హైద్రాబాద్ విషాదం". lit.andhrajyothy.com. Archived from the original on 2017-04-05. Retrieved 2021-11-22.