2009 నాటి ఉపగ్రహాల ఢీ

2009 లో ఇరిడియం 33, కోస్మోస్-2251 ఉపగ్రహాలు డీకొన్న ఘటన

2009 ఫిబ్రవరి 10 న, రెండు సమాచార ఉపగ్రహాలు సైబీరియాకు పైన భూ ఉపరితలం నుండి 789 కిలోమీటర్ల ఎత్తున, 11,7000 మీ/సె. వేగంతో ప్రమాదవశాత్తు డీకొన్నాయి. వీటిలో ఒకటి క్రియాశీలంగా ఉన్న వాణిజ్య ఉపగ్రహం ఇరిడియం 33 కాగా, జీవిత కాలం పూర్తైన రష్యా వారి సైనిక ఉపగ్రహం కొమోస్-2251 రెండవది. [1] [2] [3] [4] [5] [6] ఇలాంటి మహావేగపు తాకిడి రెండు ఉపగ్రహాల మధ్య సంభవించడం ఇదే మొదటిసారి. అప్పటి వరకు జరిగిన మహావేగపు తాకిడులన్నీ ఉపగ్రహం, అంతరిక్ష శిధిలాలు డీకొనడం వల్ల జరిగినవే. [7]

డీకొన్న రెండు ఉపగ్రహాలు - ఇరిడియం 33 (ఎడమ వైపున దాని ప్రతిరూపం ఉంది) కోస్మోస్-2251 (కుడి వైపున ఉన్నది, దాని డిజిటల్ ప్రతిరూపం)

అంతరిక్ష నౌకల వివరాలు మార్చు

950 కిలోల బరువున్న కోస్మోస్ -2251 రష్యన్ అంతరిక్ష సాయుధ దళాలకు చెందిన స్త్రెలా సైనిక సమాచార ఉపగ్రహం. [8] దీన్ని 1993 జూన్ 16 న రష్యాకు చెందిన కాస్మోస్ -3 ఎమ్ వాహనంపై ప్రయోగించారు. [2] ఘర్షణకు పూర్వమే దీని జీవిత కాలం పూర్తవడంతో నిష్క్రియం చేసారు. అంతరిక్ష శిధిలంగా కక్ష్యలో తిరుగుతూ ఉంది. 560 కిలోల ఇరిడియం 33, అమెరికాలో నిర్మించిన వాణిజ్య ఉపగ్రహం. ఇరిడియం కమ్యూనికేషన్స్ సంస్థకు చెందిన 66 కమ్యూనికేషన్ ఉపగ్రహాల ఇరిడియం కూటమిలో ఇది ఒక భాగం. 1997 సెప్టెంబరు 14 న రష్యాకు చెందిన ప్రోటాన్ రాకెట్ పై దీన్ని ప్రయోగించారు.

గుద్దుకోవడం మార్చు

 
డీకొన్న రేఖాచిత్రం

ఈ గుద్దుకోవడం 16:56 UTC వద్ద జరిగింది. ఈ తాకిడిలో ఇరిడియం 33, కోస్మోస్ -2251 రెండూ నాశనమయ్యాయి. ఢీకొన్న సమయంలో ఇరిడియం ఉపగ్రహం క్రియాశీల స్థితిలో ఉంది. కోస్మోస్ -2251 1995 లో జీవిత కాలం పూర్తి చేసుకుంది. [9] దానికి ప్రొపల్షన్ వ్యవస్థ లేదు. [10] దానిపై నియంత్రణ లేదు. [11] [12]

పర్యవసానాలు మార్చు

 
ఇరిడియం 33 శిధిలాల ప్రధాన భాగాలు పడిపోతూండగా ఏర్పడిన వెలుగులు
 
ఈ డీ ఫలితంగా భూ నిమ్న కక్ష్యలో గణనీయమైన సంఖ్యలో శిధిలాలు ఏర్పడ్డాయి.

ఈ అంతరిక్ష సంఘటనలో 10 సెం.మీ. కంటే పెద్ద శకలాలు 1,000 దాకా ఏర్పడినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఘటన జరిగిన 10 రోజుల తరువాత అంచనా వేసింది. అనేకమైన చిన్నచిన్న శకలాలు కూడా ఏర్పడ్డాయి. [13] 2011 జూలై నాటికి, యుఎస్ స్పేస్ సర్వైలెన్స్ నెట్‌వర్కు 2000 పెద్ద శకలాల జాబితా తయారు చేసింది. [14] 430 కిలోమీటర్ల ఎత్తున పరిభ్రమించే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఈ శకలాల వల్ల పెద్దగా ప్రమాదం లేదని నాసా నిర్ణయించింది. [8] [15] 2009 ఫిబ్రవరి చివరలో లాంచి చేసేందుకు నిర్ణయించిన స్పేస్ షటిల్ కు కూడా ముప్పేమీ లేదని నిర్ణయించింది. అయితే, శిధిలాలు సూర్య-సమకాలిక కక్ష్యలలోని చైనా ఉపగ్రహాలకు ముప్పు కలిగిస్తాయని చైనా శాస్త్రవేత్తలు చెప్పారు. [16] 2011 మార్చిలో ఈ సంఘటనలో ఏర్పడిన శిధిలాల నుండీ కాపాడుకునేందుకు ISS కొన్ని విన్యాసాలు చేయవలసి వచ్చింది.

2011 డిసెంబరు నాటికి, అనేక శిధిలాలు కక్ష్యా క్షీణత దశలో ఉన్నాయి. ఒకటి, రెండు సంవత్సరాలలో అవి భూవాతావరణం లోకి ప్రవేశించి కాలిపోతాయని భావించారు. 2014 జనవరి నాటికి, తెలిసిన శిధిలాలలో 24% వరకూ క్షీణించాయి. ఈ ఘర్షణను చరిత్రలో రెండవ అతిపెద్ద శకలాలు ఏర్పడిన సంఘటనగా స్పేస్ న్యూస్, 2016 లో పేర్కొంది. కోస్మోస్ -2251 1668 ముక్కలు గాను, ఇరిడియం 33 628 ముక్కలు గానూ అయ్యాయి. వీటిలో 1141, 364 ముక్కలు 2016 జనవరి నాటికి ఇంకా కక్ష్యలోనే ఉన్నాయి . [17]

కాస్మోస్ 2251 కు చెందిన చిన్న ముక్క, 2012 మార్చి 24 శనివారం నాడు ఉదయం 2:38 EDT సమయంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి సుమారు 120 మీటర్ల దూరంలో దూసుకు పోయింది. కేంద్రం సురక్షితంగానే ఉంది. ముందు జాగ్రత్తగా, శిధిలాలు దాటిపోయే వరకు కేంద్రంలో ఉన్న ఆరుగురు సిబ్బంది కేంద్రం వద్ద లంగరు వేసి ఉన్న రెండు సోయుజ్ అంతరిక్ష నౌకల్లో తలదాచుకున్నారు.

అమెరికా రాష్ట్రాలైన టెక్సాస్, కెంటకీ, న్యూ మెక్సికోలలో ఈ సంఘటన జరిగిన వెంటనే జరిగిన అనేక దృగ్విషయాలకు సంఘటన తర్వాత ఏర్పడిన శకలాలే కారణమని ప్రజలు భావించారు. [18] అయితే, ఉపగ్రహాలనూ, కక్ష్యా శిధిలాలనూ ట్రాక్ చేస్తూండే నాసా, అమెరికా వ్యూహాత్మక కమాండ్ లు ఆ సమయంలో శిధిలాలు భూవాతావరణం లోకి పునఃప్రవేశించే విషయమై ఎటువంటి ప్రకటనలూ చెయ్యలేదు. [19] ఈ దృగ్విషయాలకూ డీలో ఏర్పడిన శిథిలాలకూ సంబంధం లేదని అవి నివేదించాయి. [20] 2009 ఫిబ్రవరి 13 న, కెంటకీలోని ప్రత్యక్ష సాక్షులు సోనిక్ బూమ్‌లను విన్నారు. [21] పడిపోతున్న ఉపగ్రహ శిధిలాల కారణంగా ఏర్పడే సోనిక్ బూమ్‌ల గురించి ప్రజలను హెచ్చరిస్తూ నేషనల్ వెదర్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేసింది. [22] ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ కూడా తిరిగి ప్రవేశిస్తున్న శిధిలాల గురించి పైలట్లకు ఒక హెచ్చరికను విడుదల చేసింది. [23] కొన్ని నివేదికల్లో ఉల్కాపాతం వల్ల ఈ దృగ్విషయాలు ఏర్పడవచ్చని కూడా పేర్కొన్నారు. 2009 ఫిబ్రవరి 15 న టెక్సాస్‌లో చాలా ప్రకాశవంతమైన ఉల్కాపాతాన్ని చూసి పునఃప్రవేశం చేస్తున్న శిధిలాలని పొరబడ్డారు. [24]

కారణం మార్చు

ఉపగ్రహాలు ఒకదానికొకటి కొన్ని కిలోమీటర్ల దూరంలో ప్రయాణిస్తూండే సంఘటనలు రోజూ అనేక సార్లు జరుగుతూనే ఉంటాయి. గుద్దుకునే అవకాశం ఉన్న ఘటనల్లోంచి, అధికమైన ముప్పు ఉన్న వాటిని గుర్తించడం ఒక సవాలే. ఉపగ్రహ స్థానాలకు సంబంధించి ఖచ్చితమైన, తాజా సమాచారం పొందడం కష్టం. సెలెస్‌ట్రాక్ సాఫ్టువేరు, ఈ రెండు ఉపగ్రహాల విషయంలో చేసిన లెక్క ప్రకారం ఇవి రెండూ ఒకదాన్నుండి మరొకటి 584 మీటర్ల దూరంలో ప్రయాణిస్తాయని తేలింది. [25] కానీ చివరికి గుద్దుకున్నాయి.

ముప్పునూ విన్యాసాలకు అవసరమైన ఇంధన వినియోగం, అందువలన ఉపగ్రహపు సాధారణ పనితీరుపై పడే ప్రభావం వంటి వాటిని పరిగణన లోకి తీసుకుని, ముప్పు నుండి తప్పించుకునే విన్యాసాలను(దానికి ఎదురుగా ఉండే ఆర్బిట్ మోటార్ ను కొద్దిగా మండించడం) తరుణోపాయం చేసి తప్పించడం ఒక సవాలే. ఇరిడియంకు చెందిన జాన్ కాంప్‌బెల్ 2007 జూన్ లో మాట్లాడుతూ తమ ఇరిడియం ఉపగ్రహాలకు సంబంధించి వారానికి 400 వరకూ ముప్పు హెచ్చరికలు వస్తూంటాయని చెప్పాడు. వాటిని నిర్వహించడంలో ఉన్న ఇబ్బందుల గురించి చర్చించాడు. నిజంగా గుద్దుకునే అవకాశం 5 కోట్లలో ఒకటని అతడు అంచనా వేశాడు. [26]

ఈ తాకిడి ఘటనతో పాటు అనేక ఇతర హెచ్చరికల నేపథ్యంలో, పనైపోయిన ఉపగ్రహాలను తప్పనిసరిగా విసర్జించాలనే విషయమై (వాటిని కక్ష్య నుండి తొలగించడం గానీ కనీసం శ్మశాన కక్ష్యకు పంపించడం ద్వారా గానీ) పిలుపులు ముమ్మరమయ్యాయి. కానీ 2020 నాటికి అటువంటి అంతర్జాతీయ చట్టమేదీ ఏర్పడలేదు. అయితే, 2010 డిసెంబరులో ఫ్రాన్సు చేసుకున్నట్లుగా కొన్ని దేశాలు దేశీయంగా ఇటువంటి చట్టాన్ని చేసుకున్నాయి. [27] అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సిసి) నిబంధన ప్రకారం, 2002 మార్చి 18 తర్వాత ప్రయోగించిన భూస్థిర ఉపగ్రహాలన్నీ, వాటి జీవితం చివరి దశలో శ్మశాన కక్ష్యకు పంపాల్సి ఉంటుంది. [28]

మూలాలు మార్చు

  1. McDowell, Jonathan (February 15, 2009). "Jonathan's Space Report No. 606". Archived from the original on April 5, 2017. Retrieved February 17, 2009. Strela-2M satellites had lifetimes of around 3 years, and Gen. Yakushin of the Military Space Forces was quoted in Moscow Times as saying Kosmos-2251 went out of service in 1995.
  2. 2.0 2.1 Iannotta, Becky (February 22, 2009). "U.S. Satellite Destroyed in Space Collision". Space.com. Archived from the original on February 13, 2009. Retrieved February 12, 2009.
  3. Achenbach, Joel (February 11, 2009). "Debris From Satellites' Collision Said to Pose Small Risk to Space Station". The Washington Post. Retrieved February 12, 2009.
  4. Marks, Paul (February 13, 2009). "Satellite collision 'more powerful than China's ASAT test". New Scientist. Archived from the original on February 15, 2009. Retrieved February 17, 2009. (putting the collision speed at 42,120 kilometres per hour (11.7 km/s))
  5. Matthews, Mark K. (February 13, 2009). "Crash imperils satellites that monitor Earth". Orlando Sentinel. Archived from the original on February 16, 2009. Retrieved February 17, 2009. (reporting it as "what amounted to a 26,000 mph [(7.7 miles/sec)] collision")
  6. "Collision between Iridium 33 and Cosmos 2251". N2YO. Archived from the original on February 16, 2009. Retrieved February 17, 2009.
  7. "Satellite Collision Leaves Significant Debris Clouds" (PDF). Orbital Debris Quarterly News. NASA Orbital Debris Program Office. 13 (2): 1–2. April 2009. Archived from the original (PDF) on May 27, 2010. Retrieved May 20, 2010.
  8. 8.0 8.1 "Russian and US satellites collide". BBC. February 12, 2009. Archived from the original on February 12, 2009. Retrieved February 12, 2009.
  9. "First Satellite Collision Called Threat in Space". Moscow Times. February 13, 2009. Archived from the original on January 13, 2013. Retrieved February 19, 2009.
  10. Игорь Королев. Авария на $50 млн // Ведомости, № 26 (2296), 13 февраля 2009
  11. "Russian and US satellites collide". BBC News. February 12, 2009. Archived from the original on February 12, 2009. Retrieved February 12, 2009. Russia has not commented on claims the satellite was out of control
  12. Wolf, Jim (February 11, 2009). "U.S., Russian satellites collide in space". Reuters. Archived from the original on February 15, 2009. Retrieved February 12, 2009.
  13. Oleksyn, Veronika (February 19, 2009). "What a mess! Experts ponder space junk problem". Associated Press. Retrieved May 20, 2010.
  14. "Orbital Debris Quarterly News, July 2011" (PDF). NASA Orbital Debris Program Office. Archived from the original (PDF) on October 20, 2011. Retrieved January 1, 2012.
  15. Dunn, Marcia (February 12, 2009). "Big satellites collide 500 miles over Siberia". The Associated Press. Archived from the original on July 11, 2011. Retrieved May 20, 2010.
  16. "China alert on U.S.-Russian satellite collision". Xinhua. February 12, 2009. Archived from the original on February 13, 2009. Retrieved February 12, 2009.
  17. "10 breakups account for 1/3 of catalogued debris". Space News. April 25, 2016. Archived from the original on 2020-11-22. Retrieved June 27, 2017.
  18. Byrne, Joe (February 15, 2009). "Satellite wreckage falls on Kentucky, Texas, New Mexico". The Raw Story. Archived from the original on February 17, 2009. Retrieved February 16, 2009.
  19. Phillips, Tony (February 14, 2009). "Fireball Mania". National Aeronautics and Space Association. Retrieved December 14, 2011.
  20. Berger, Eric; Carreau, Mark (February 16, 2009). "Metallic meteorite likely sent fireball across Texas sky". Houston Chronicle. Retrieved February 16, 2009.
  21. "Satellites Collide; Debris Seen Falling Over Kentucky". WYMT News. February 13, 2009. Archived from the original on February 17, 2009. Retrieved February 16, 2009.
  22. "...POSSIBLE SATELLITE DEBRIS FALLING ACROSS THE REGION..." NOAA. February 13, 2009. Archived from the original on February 17, 2009. Retrieved February 16, 2009.
  23. Harwood, William (February 15, 2009). "FAA warns of possible falling satellite debris". CBS News Space Place. Archived from the original on February 19, 2009. Retrieved February 16, 2009.
  24. Plait, Phil (February 15, 2009). "Texas Fireball: What's known so far". Bad Astronomy blog. Archived from the original on 2010-11-24. Retrieved February 17, 2009.
  25. "Iridium 33/Cosmos 2251 Collision". CelesTrak. Archived from the original on March 17, 2009. Retrieved March 18, 2009.
  26. Weeden, Brian (February 23, 2009). "Billiards in space". The Space Review. Archived from the original on 2009-02-26. Retrieved February 24, 2009.
  27. Reynolds, Glenn H (March 12, 2009). "Space Junk and the Law of Space Collisions". Popular Mechanics. Archived from the original on March 16, 2009. Retrieved March 18, 2009.
  28. Peter de Selding (June 28, 2004). "FCC Enters Orbital Debris Debate". Space News. Archived from the original on July 1, 2004.