2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్

2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ ఏడవ ఐసిసి పురుషుల టీ20 ప్రపంచ కప్ టోర్నమెంట్. టీ20 ప్రపంచ కప్ మ్యాచులు 2021 అక్టోబరు 17 నుంచి 2021 నవంబరు 14 వరకు జరగనున్నాయి. ఈ టోర్నమెంట్ ను భారతదేశంలో నిర్వహించాల్సి ఉండగా కరోనా కారణంగా యూఏఈకి మార్చారు. ఈ ప్రపంచ కప్‌లో 16 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి. అనంతరం మేజర్‌ జట్ల మధ్య సూప‌ర్ 12 స్టేజ్ మ్యాచ్‌లు అక్టోబరు 23 నుంచి ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌లన్నీ భారతకాలమానం ప్రకారం భారత్ లో రాత్రి 7:30 గంటలకు స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రసారం అవుతాయి.

2021 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్
తేదీలు17 అక్టోబరు 2021 – 14 నవంబరు 2021
నిర్వాహకులుఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంటీ20 ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లుగ్రూప్ స్టేజి & నాకౌట్
ఆతిథ్యం ఇచ్చేవారు India(భారతదేశం)
 UAE(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)
 Oman(ఒమన్)
పాల్గొన్నవారు16[1]
ఆడిన మ్యాచ్‌లు45[2]
అధికారిక వెబ్‌సైటుt20worldcup.com
2016
2022

జట్ల వివరాలు

మార్చు
  • గ్రూప్ ఏ క్వాలిఫయర్స్‌ జట్లు : శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా
  • గ్రూప్ బీ క్వాలిఫయర్స్‌ జట్లు : బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూ గినియా, ఒమన్
  • గ్రూప్ 1: ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, ఏ1, బీ2
  • గ్రూప్ 2: భారత్‌, పాకిస్తాన్, న్యూజిలాండ్, అఫ్గానిస్తాన్, బీ1, ఏ2 [3]

టీ20 ప్రపంచ కప్ - 2021లో పాల్గొన్న జట్లు & ఆటగాళ్లు

మార్చు
గ్రూప్‌-1

1.ఆస్ట్రేలియా- సూపర్‌ 12 ఆరోన్‌ ఫించ్‌ (కెప్టెన్‌), అష్టన్‌ అగర్‌, పాట్‌ కమిన్స్‌ (వైస్‌ కెప్టెన్‌), జోష్‌ హాజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, కేన్‌ రిచర్డ్‌సన్‌, స్టీవ్‌స్మిత్‌, మిచెల్‌ స్టార్క్‌, మార్కస్‌ స్టొయినిస్‌, మిచెల్‌ స్వెప్సన్‌, మాథ్యూ వేడ్‌, డేవిడ్‌వార్నర్‌, ఆడం జంపా. రిజర్వు ఆటగాళ్లు: డాన్‌ క్రిస్టియన్‌, నాథన్‌ ఇల్లిస్‌, డానియల్‌ సామ్స్‌

2. ఇంగ్లండ్‌- సూపర్‌ 12 ఇయాన్‌ మోర్గాన్‌, మొయిన్‌ అలీ, జొనాథన్‌ బెయిర్‌స్టో, సామ్‌ బిల్లింగ్స్‌, జోస్‌ బట్లర్‌, టామ్‌ కరన్‌, క్రిస్‌జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జేసన్‌రాయ్‌, డేవిడ్‌ విల్లే, క్రిస్‌ వోక్స్‌, మార్క్‌వుడ్‌. రిజర్వు ఆటగాళ్లు: లియామ్‌ డాసన్‌, జేమ్స్‌ విన్స్‌, రీస్‌ టోప్లే.

3.దక్షిణాఫ్రికా: సూపర్‌ 12 తెంబ బవుమా (కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), పార్చూన్, హెన్రిక్స్, హెన్రిచ్ క్లాసెన్, కేశవ్ మహరాజ్, మర్‌క్రమ్, డేవిడ్ మిల్లర్, వియాన్ మల్డర్, లుంగి ఎంగిడి, ఆన్రిచ్ నోర్తేజ్, ప్రొటోరియస్, కగిసో రబాడ, షంషీ, దుస్సేన్. రిజర్వు ఆటగాళ్లు: జార్జ్ లిండే, ఫెహ్లువాయో, విలియమ్స్

4.వెస్టిండీస్‌: సూపర్‌ 12 కీరన్‌ పొలార్డ్‌, నికోలస్‌ పూరన్‌, ఫాబిన్‌ అలెన్‌, డ్వేన్‌బ్రావో, రాస్టన్‌ చేజ్‌, ఆండ్రీ ఫ్లెచర్‌, క్రిస్‌ గేల్‌, షిమ్రన్‌ హెట్‌మెయిర్‌, ఇవిన్‌ లూయిస్‌, ఒబెడ్‌ మెకాయ్‌, లెండిల్‌ సిమన్స్‌, రవి రాంపాల్‌, ఆండ్రీ రసెల్‌, ఒషేన్‌ థామస్‌, హెడెన్‌ వాల్ష్‌ జూనియర్‌. రిజర్వు ఆటగాళ్లు: డారెన్‌ బ్రావో, షెల్డన్‌ కాట్రెల్‌, జేసన్‌ హోల్డర్‌, అకీల్‌ హుసేన్‌

గ్రూప్‌-2

1. భారత జట్టు - సూపర్‌ 12 విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్ యాదవ్, రిషభ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్ ఠాకూర్, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మొహమ్మద్‌ షమీ. రిజర్వు ఆటగాళ్లు: శ్రేయాస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్ పటేల్. మెంటార్‌: ఎంఎస్‌ ధోని [4]

2.న్యూజిలాండ్‌ - సూపర్‌ 12 కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), టాడ్‌ ఆస్ట్లే, ట్రెంట్‌ బౌల్ట్‌, మార్క్‌ చాప్‌మన్‌, డెవన్‌ కాన్వే, లాకీ ఫెర్గూసన్‌, మార్టిన్‌ గఫ్టిల్‌, కైలీ జెమీషన్‌, డారిల్‌ మిచెల్‌, జిమ్మీ నీషం, గ్లెన్‌ ఫిలిప్స్‌, మిచెల సాంట్నర్‌, టిమ సీఫెర్ట్‌, ఇష్‌ సోధి, టిమ్‌ సౌథీ. రిజర్వు ఆటగాళ్లు: ఆడం మిల్నే

3.పాకిస్తాన్‌- సూపర్‌12 టి20 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు బాబరు అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, షోయబ్‌ మాలిక్‌. రిజర్వు ఆటగాళ్లు: కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

4.అఫ్గనిస్తాన్‌- సూపర్‌12 మహ్మద్‌ నబీ (కెప్టెన్‌), రహ్మనుల్లా గుర్బాజ్‌, హజ్రతుల్లా జజాయి, ఉస్మాన్‌ ఘనీ, మహ్మద్‌ షాజాద్‌, హష్మతుల్లా షాహిది, అస్గర్‌ అఫ్గన్‌, గులాబుద్దీన్‌ నాయిబ్‌, నజీబుల్లా జద్రాన్‌, కరీం జనత్‌, రషీద్‌ ఖాన్‌, మజీబ్‌ ఉర్‌ రహమాన్‌, హమీద్‌ హసన్‌, ఫరీద్‌ అహ్మద్‌ మాలిక్‌, నవీన్‌ ఉల్‌ హక్‌. రిజర్వు ఆటగాళ్లు: షరాఫుద్దీన్‌ అష్రఫ్‌, సమఘుల్లా షిన్వారి, దౌలగ్‌ జద్రాన్‌, ఫజల్‌ హక్‌ ఫరూకీ.

గ్రూపు-ఏ

1.ఐర్లాండ్‌- రౌండ్‌ 1 ఆండ్రూ బల్బిర్నీ, మార్క్‌ అదేర్‌, కర్టిస్‌ చాంపర్‌, గరేత డిలనీ, జార్జ్‌ డాక్రెల్‌, జోష్‌ లిటిల్‌, ఆండ్రూ మెక్‌బ్రిన్‌, కెవిన్‌ ఒబ్రెయిన్‌, నీల్‌ రాక్‌, సిమీ సింగ్‌, పాల్‌ స్టిర్లింగ్‌, హారీ టెక్టార్‌, లోర్కాన్‌ టకర్‌, బెన్‌ వైట్‌, క్రెగ్‌ యంగ్‌. రిజర్వు ప్లేయర్లు: షేన్‌ గెట్‌కటే, గ్రాహం కెన్నడీ, బారీ మెకార్తి

2.నమీబియా- రౌండ్‌ 1 గెర్హాడ్‌ ఎరాస్‌మస్‌ (కెప్టెన్‌), స్టీఫెన్‌ బార్డ్‌, కార్ల్‌ బిర్కెన్‌స్టాక్‌, మిచావు డు ప్రీజ్‌, జాన్‌ ఫ్రిలింక్‌, జానే గ్రీన్‌, జాన్‌ నికోల్‌ లోఫ్టీ ఈటన్‌, బెర్నార్డ్‌ షోల్ట్‌, బెన్‌ షికాంగో, జేజే స్మిత్‌, రూబెన్‌ ట్రంపెల్‌మాన్‌, మైకేల్‌వాన్‌ లింగన్‌, డేవిడ్‌ వీజ్‌, క్రెయిగ్‌ విలియమ్స్‌, పిక్కీ యా ఫ్రాన్స్‌. రిజర్వు ఆటగాళ్లు: మారిషస్‌ గుపిటా

3.ది నెదర్లాండ్స్‌- రౌండ్‌ 1 పీటర్‌ సీలార్‌ (కెప్టెన్‌), కొలిన్‌ ఆకెర్‌మాన్‌, ఫిలిప్‌ బోసీవేన్‌, బెన్‌ కూపర్‌, బాస్‌ డీ లీడే, స్కాట్‌ ఎడ్వర్డ్స్‌, బ్రెండన్‌ గ్లోవర్‌, ఫ్రెడ్‌ క్లసేన్‌, స్టీఫెన్‌ మైబర్గ్‌, మాక్స్‌ ఓ డౌడ్‌, రియాన్‌ టెన్‌ డొచేట్‌, లాగన్‌ వాన్‌ బీక్‌, టిమ్‌ వాన్‌ దెర్‌ గుటెన్‌, రోలోఫ్‌ వాన్‌ దెర్‌ మెర్వీ, పాల్‌ వాన్‌ మెకీరెన్‌. రిజర్వు ఆటగాళ్లు: షేన్‌ స్నాటర్‌, టొబియాస్‌ వీజ్‌.

గ్రూపు-బీ

1. బంగ్లాదేశ్‌- రౌండ్‌ 1 మహ్మదుల్లా (కెప్టెన్‌) మహ్మద్‌ నయీం షేక్‌, సౌమ్య సర్కార్‌, లిటన్‌ దాస్‌, షకీబ్‌ అల్‌ హసన్‌, ముష్పికర్‌ రహీం, అఫీఫ్‌ హుసేన్‌, నురుల్‌ హసన్‌ సోహన్‌, షేక్‌ మహేదీ హసన్‌, నసుం అహ్మద్‌, ముస్తాఫిజుర్‌ రహమాన్‌, షోరిఫుల్‌ ఇస్లాం, టస్కిన్‌ అహ్మద్‌, సైఫుద్దీన్‌, షమీమ్‌ హుసేన్‌. రిజర్వు ప్లేయర్లు: అనిముల్‌ ఇస్లాం బిప్లవ్‌, రుబెల్‌ హుసేన్‌.

2.ఒమన్‌- రౌండ్‌ 1 జీషన్‌ మక్సూద్‌, ఆయిబ్‌ ఇలియాస్‌, జతిందర్‌ సింగ్‌, ఖావర్‌ అలీ, మహ్మద్‌ నదీం, అయాన్‌ ఖాన్‌, సూరజ్‌ కుమార్‌, సందీప్‌ గౌడ్‌, నెస్టర్‌ ధంబా, కలీముల్లా, బిలాల్‌ ఖాన్‌, నసీం ఖుషి, సుఫియాన్‌ మహమూద్‌, ఫయాజ్‌ బట్‌, ఖుర్రం నవాజ్‌ ఖాన్‌.

3.పపువా న్యూ గినియా- రౌండ్‌ 1 అసద్‌ వాలా, చార్ల్స్‌ అమిని, లెగా సియాక, నార్మన్‌ వనువా, నోసైన పొకానా, కిప్లింగ్‌ డోరిగా, టోనీ ఉరా, హిరి హిరి, గౌడీ టోకా, సెసె బవు, డామిన్‌ రావు, కబువా వాగి మెరియా, సిమన్‌ అటాయ్‌, జేసన్‌ కిలా, చాద్‌ సోపర్‌, జాక్‌ గార్డనర్‌.

4. స్కాట్లాండ్‌: రౌండ్‌ 1 కైలీ కోషర్‌, రిచర్డ్‌ బెరింగ్‌టన్‌, డిలన్‌ బడ్జ్‌, మాథ్యూ క్రాస్‌, జోష్‌ డావే, అలా ఈవన్స్‌, క్రిస్‌ గ్రేవ్స్‌, మైకేల్‌ లీస్‌, కలమ్‌ మెక్లాయిడ్‌, జార్జ్‌ మున్సే, సఫ్‌యాన్‌ షరీఫ్‌, హంజా తాహిర్‌, క్రెగ్‌ వాలస్‌, మార్క్‌ వాట్‌, బ్రాడ్‌ వీల్‌. రిజర్వు ఆటగాళ్లు: మైకేల్‌ జోన్స్‌, క్రిస్‌ సోలే.

మ్యాచ్ వేదికలు

మార్చు
  యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్   ఒమన్
దుబాయ్ షార్జా అబు దాబి మస్కట్
దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం షార్జా క్రికెట్ స్టేడియం షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియం ఆల్ ఆమెరాత్ క్రికెట్ స్టేడియం
సామర్థ్యం: 25,000[5] సామర్థ్యం: 27,000[6] సామర్థ్యం: 20,000[7] సామర్థ్యం: 3,000[8]
     

టీ20 ప్రపంచకప్‌ ప్రైజ్ మనీ

మార్చు

ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నీకి సంబంధించి ప్రైజ్‌మనీ వివరాలను ఐసీసీ ప్రకటించింది. టీ20 వరల్డ్ కప్ 2021 కోసం ప్రైజ్ మనీ రూ.42.07 కోట్లు (5.6 మిలియన్ డాలర్లు) . టీ20 వరల్డ్‌కప్ టైటిల్ విజేతలకు రూ.12 కోట్లు (1.6 మిలియన్ డాలర్లు) రన్నరప్‌ జట్టుకి రూ.6 కోట్లు (8 లక్షల డాలర్లు), సెమీ ఫైనల్లో ఓటమి పాలైన రెండు జట్లకు చెరో రూ.3 కోట్లు (నాలుగు లక్షల డాలర్లు) ప్రైజ్‌మనీ అందించనుంది. సూపర్ 12 దశలో గెలిచిన ప్రతి జట్టుకు మ్యాచుకు రూ.30 లక్షల (40 వేల డాలర్లు), సూపర్ 12 నుంచి ఇంటిదారి పట్టే జట్లకు 70వేల డాలర్లను, రౌండ్‌ వన్‌లో గెలిచిన ఒక్కో జట్టుకి రూ.30 లక్షలు (40 వేల డాలర్లు), సూపర్ 12 దశలో అర్హత సాధించిన జట్లకు 70వేల డాలర్లు (రూ.52.59 లక్షలు) అందించనుంది.[9][10][11]

స్టేజ్ ప్రైజ్ మనీ (US$) టీమ్స్ / మ్యాచ్ మొత్తం
విజేత 16 లక్షల డాలర్లు (రూ. 12 కోట్లు) 1 $1.6 million
రన్నరప్‌ 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్లు) 1 $800,000
సెమీఫైనల్లో ఓటమిపాలైన జట్లు 4 లక్షల డాలర్లు (రూ. 3కోట్లు) 2 $800,000

మూలాలు

మార్చు
  1. "Ganguly, Sawhney and Shah get countdown to ICC Men's T20 World Cup 2021 underway". International Cricket Council. Retrieved 12 November 2020.
  2. "Australia is next with two T20 World Cups coming in 2020". International Cricket Council. Archived from the original on 25 November 2018. Retrieved 25 November 2018.
  3. Sakshi (16 October 2021). "రేపటి నుంచే మరో మహా క్రికెట్‌ సంగ్రామం." Archived from the original on 16 October 2021. Retrieved 17 October 2021.
  4. Sakshi (16 October 2021). "టీమిండియా సహా మొత్తం జట్లు, పూర్తి జాబితా". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  5. "T20 world cup venue guide Dubai International Stadium". t20worldcup.com. Archived from the original on 13 సెప్టెంబరు 2021. Retrieved 13 September 2021.
  6. "Sharjah Cricket Stadium". t20worldcup.com. Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  7. "T20 world cup venue guide Sheikh Zayed Cricket Stadium". t20worldcup.com. Archived from the original on 13 సెప్టెంబరు 2021. Retrieved 13 September 2021.
  8. "Oman Cricket Academy Ground". t20worldcup.com. Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  9. "ICC Men's T20 World Cup 2021 Prize Money details announced". International Cricket Council. Retrieved 10 October 2021.
  10. Eenadu (10 October 2021). "ప్రపంచకప్‌ విజేతకు ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎంతో తెలుసా? - t20 world cup icc announces prize money winners to take home 16 lakh american dollars". Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.
  11. 10TV (11 October 2021). "భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన ఐసీసీ.. ఎవరెవరికి ఎంతంటే? | ICC T20 World Cup 2021: Prize money announced" (in telugu). Archived from the original on 17 October 2021. Retrieved 17 October 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)