99టీవీ

తెలుగు వార్తా చానల్

99టీవీ ఒక తెలుగు వార్త ఛానల్. ఇందులో 24 గంటలు తెలుగు వార్తలు ప్రసారం అవుతాయి.న్యూ వేవ్స్ మీడియా అనే సంస్థ ద్వారా ఈ ఛానల్ నిర్వహించబడుతుంది.[1] ఈ ఛానెల్ జూలై  11, 2018 నుండి తన ప్రసారాలను ప్రారంభించింది. ఆ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది. 99 టివి 2014 లో స్థాపించబడింది, ప్రస్తుతం తోటా చంద్రశేఖర్ నేతృత్వంలోని న్యూ వేవ్స్ మీడియా యాజమాన్యంలో ఉంది.

99TV
దేశంIndia
ప్రసారపరిధిIndia
Asia
నెట్వర్క్India Cable News
కేంద్రకార్యాలయంKondapur
Hyderabad, Telangana, India
ప్రసారాంశాలు
భాష(లు)తెలుగు
చిత్రం ఆకృతి576i
యాజమాన్యం
యజమానిNew Waves Media
ప్రధాన వ్యక్తులుతోట చంద్రశేఖర్, &న్యూ వేవ్స్ మీడియా
చరిత్ర
ప్రారంభం20 జులై 2014
లింకులు
వెబ్సైట్www.99tv.co.in
లభ్యత
ఉపగ్రహం
Dish TVChannel 735
Videocon D2HChannel 735
Tata SkyChannel 1478
HathwayChannel 55

ఉపగ్రహం INSAT-4A (C-BAND) డౌన్‌లింక్ పౌనపున్యం- 3921 MHZ, symbol rate- 13000, System DVB-S2/QPSK/MPEG-4.

చరిత్ర

మార్చు

99 టీవీని దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజా 20 జూలై 2014 న హైదరాబాద్‌లో స్థాపించారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు, డి.రామానాయుడు, అప్పటి ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు, రామకృష్ణ, వివిధ మీడియా సభలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు.తరువాత 99TV పూర్తిగా భారత కమ్యూనిస్టు పార్టీ (CPI) చే స్వాధీనం చేయబడింది.

ఈ ఛానల్ ను న్యూ వేవ్స్ డిజిటల్ మీడియా ద్వారా 11 జూలై 2018న చేపట్టారు, ఈ ఛానల్ యొక్క ప్రధాన కార్యాలయం గా ఉన్న హైదరాబాద్ కొండాపూర్ లో న్యూ వేవ్స్ మీడియా ప్రధాన కార్యాలయం నుండి ప్రసారం ప్రారంభమైంది.[2]

ప్రోగ్రామింగ్

మార్చు

సీరియస్ రిపోర్టింగ్ తో ఈ ఛానల్ రాజకీయ, కరెంట్ అఫైర్స్ ను ప్రసారం చేస్తుంది, ఛానల్ లో వ్యాపారం, టాక్ షో, సినిమా, క్రీడలు వంటి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో నెట్ వర్క్ ఉంది.[3]

మూలాలు

మార్చు
  1. "99tv managment". Times of India. 24 ఆగస్టు 2011. Retrieved 16 సెప్టెంబరు 2018.
  2. kavirayani, suresh (14 జూలై 2018). "Pawan Kalyan's master stroke!". Deccan Chronicle (in ఇంగ్లీష్). Retrieved 31 ఆగస్టు 2020.
  3. "Pawan Kalyan to host talk show?". The Indian Express (in ఇంగ్లీష్). 27 ఆగస్టు 2018. Retrieved 31 ఆగస్టు 2020.
"https://te.wikipedia.org/w/index.php?title=99టీవీ&oldid=4001431" నుండి వెలికితీశారు