D/O వర్మ (డాటరాఫ్ వర్మ) సినిమా ఖాజా పాషా దర్శకత్వంలో 2013లో విడుదలైన చిత్రం. వెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత ఆరస్, ఉత్తేజ్, జీవా నటించిన ఈ సినిమాలో రోజా ఒక ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ సినిమాని నరేందర్ రెడ్డి బొక్క నిర్మించారు. ఆదేశ్ రవి ఈ సినిమాకి సంగీతాన్ని అందించగా పి.జి. వింద సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

D/O వర్మ
దర్శకత్వంఖాజా పాషా
నిర్మాతబొక్కా నరేంద్ర రెడ్డి
తారాగణంవెన్నెల కిషోర్, నవీన జాక్సన్, కవిత ఆరస్, రోజా, తిరువీర్, జీవా, మేల్కోటి, తాగుబోతు రమేష్, ధన్ రాజ్, ఫిష్ వెంకట్
ఛాయాగ్రహణంపి.జి. వింద
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఆదేశ్ రవి
నిర్మాణ
సంస్థ
ఫరెవర్ ఫెంటాస్టిక్ ఫిల్మ్స్
విడుదల తేదీ
28 సెప్టెంబర్ 2013
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ మార్చు

రామ్ గోపాల్ వర్మ (వెన్నెల కిషోర్) రేడియో జాకీగా పనిచేస్తూ వుంటాడు. అతనికి లేడి ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడంతోపాటు, కాస్త అమ్మాయిల పిచ్చి కూడా ఉంటుంది. రేడియో జాకీగా పనిచేస్తున్న అతనికి ఒక బెంగాలీ అమ్మాయి దీక్ష (నవీన జాక్సన్) ఫోన్ చేసి తన తల్లిని మోసం చేసి వెళ్ళిపోయిన తండ్రి కోసం వెతుకుతున్నానని, తను హైదరాబాద్ లో ఉంటున్నాడని కానీ తను ఎవరో ఎలా ఉంటాడో మాత్రం తెలియదని చెబుతుంది.

కొన్నిరోజుల తరువాత దీక్ష వర్మ దగ్గరికి వచ్చి, తన తండ్రి మీరేనని చెప్పడంతో వర్మ షాక్ అవుతాడు. దాంతో బ్రహ్మచారి అయిన వర్మ ఒక్కసారిగా 20 సంవత్సరాల కూతురికి తండ్రి అవుతాడు. ఆమె కొడుకుకు తాత అవుతాడు. ఇదంతా నమ్మని వర్మ వారిని వదిలించుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇలాంటి సందర్భంలో వర్మ ఓ టీచర్ మధు (కవిత ఆరస్)ని ప్రేమిస్తుంటాడు. అదే సమయంలో తన కూతురు అని వచ్చిన దీక్ష వల్ల వర్మ చాలా సమస్యలు ఎదుర్కొంటుంటాడు. అసలు వర్మ ఎదుర్కొన్న సమస్యలేమిటి? దీక్ష అసలు వర్మ కూతురేనా లేక ఇంకెవరన్నానా? అసలు దీక్ష వర్మని తన తండ్రి అని ఎందుకు చెప్పింది? ఇన్ని సమస్యల మధ్యలో వర్మ తను ప్రేమించిన అమ్మాయి ప్రేమని పొందాడా? లేదా? అనే అంశాలపై ఈ చిత్రం ఉంటుంది.[1]

పేరు మార్పు మార్చు

ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పేరు పెట్టడం వివాదాలకి దారి తీసే అవకాశం వుండడంతో, ఆ టైటిల్ ను మార్చమని సెన్సార్ సభ్యులు సూచించారు. దాంతో ఈ సినిమా పేరును 'D/O వర్మ'గా మార్చారు.[2] [3]

మూలాలు మార్చు

  1. 123తెలుగు.కాం. "సమీక్ష : D/O వర్మ". www.123telugu.com. Retrieved 26 October 2016.
  2. ఏపి7ఎఎమ్.కాం. "'D/O రామ్ గోపాల్ వర్మ'పై అభ్యంతరం". www.ap7am.com. Archived from the original on 2 ఏప్రిల్ 2013. Retrieved 26 October 2016.
  3. తెలుగుఫిల్మీబీట్.కాం. "చిక్కుల్లో 'D/O రామ్ గోపాల్ వర్మ'". /telugu.filmibeat.com. Retrieved 26 October 2016.
"https://te.wikipedia.org/w/index.php?title=D/O_వర్మ&oldid=3390449" నుండి వెలికితీశారు