HCard
hCard అనేది వ్యక్తులు, కంపెనీలు, సంస్థలు, స్థలాల సంప్రదింపు వివరాలను (ఒకోసారి పేరు కాకుండా వేరే విషయాలేమీ ఉండకపోవచ్చు) HTML, Atom, RSS, లేదా ఏకపక్ష XML లో ప్రచురించడానికి వాడే మైక్రోఫార్మాట్. [1] hCard మైక్రోఫార్మాట్ HTML క్లాస్‌లు, rel అట్రిబ్యూట్‌లను ఉపయోగించి, vCard ( RFC 2426 ) లక్షణాలు, విలువలను ఉపయోగించి దీన్ని చేస్తుంది.
దీనివలన పార్సింగ్ పరికరాలు (ఉదాహరణకు ఇతర వెబ్‌సైట్‌లు లేదా Firefox యొక్క ఆపరేటర్ పొడిగింపు వంటివి) వివరాలను సేకరించేందుకూ, వాటిని ప్రదర్శించడానికీ, కొన్ని ఇతర వెబ్‌సైట్‌లు లేదా మ్యాపింగ్ సాధనాలను ఉపయోగించి, ఇండెక్సు చేయడానికి లేదా వాటిని శోధించడానికి లేదా చిరునామా పుస్తకాల్లోకి లోడ్ చేయడానికి వీలు కలుగుతుంది.
2009 మేలో, Google వారు hCard, hReview, hProduct మైక్రోఫార్మాట్‌లను వాడనున్నట్లు, శోధన-ఫలితాల పేజీలను నింపడానికి వాటిని ఉపయోగిస్తామనీ ప్రకటించింది. [2] 2010 సెప్టెంబరులో Google తమ స్థానిక శోధన ఫలితాలలో hCard, hReview సమాచారాన్ని అందించాలనే ఉద్దేశ్యాన్ని ప్రకటించింది. [3] 2011 ఫిబ్రవరిలో Facebook, ఈవెంట్ వేదికలను గుర్తించడానికి hCardని ఉపయోగించడం ప్రారంభించింది. [4]
ఉదాహరణ
మార్చుకింది HTMLని పరిగణించండి:

Joseph Doe

Joe

The Example Company

604-555-1234

http://example.com/

మైక్రోఫార్మాట్ మార్కప్‌తో, అది ఇలా అవుతుంది:

Joseph Doe

Joe

The Example Company

604-555-1234

http://example.com/

పేజీ హెడర్‌లో ప్రొఫైల్ ఐచ్ఛికంగా చేర్చబడవచ్చు:
<link rel="profile" href="http://microformats.org/profile/hcard">
ఇక్కడ, ఫార్మాట్ చేయబడిన పేరు (fn
), సంస్థ (org
), టెలిఫోన్ నంబర్ (tel
), వెబ్ చిరునామా (url
) లను వాటికి సంబంధించిన క్లాస్ పేర్లను ఉపయోగించి గుర్తించారు. మొత్తం విషయాన్ని class="vcard"
లో చేర్చారు. అంటే, ఇతర క్లాస్‌లు ఒక hCardను ఏర్పరుస్తాయనీ, ("HTML vCard "కి సంక్షిప్తంగా) అవి కేవలం యాదృచ్చికంగా పెట్టిన పేర్లు కాదనీ దీనికి అర్థం. ఇతర, hCard క్లాస్‌లు కూడా ఉన్నాయి. బ్రౌజర్ ప్లగ్-ఇన్‌ల వంటి సాఫ్ట్‌వేర్లు పై సమాచారాన్ని సంగ్రహించి, చిరునామా పుస్తకం వంటి ఇతర అప్లికేషన్‌లకు బదిలీ చేయగలవు.hCard అనేది సంస్థ లేదా వేదిక కోసం అయితే, fn, org క్లాస్‌లను Wikipedia
లేదా Wembley Stadium
లాగా ఉపయోగిస్తారు. ఇతర hCard క్లాస్‌లు కూడా ఉన్నాయి.
బ్రౌజర్ ప్లగ్-ఇన్‌ల వంటి సాఫ్ట్‌వేర్‌కు, సమాచారాన్ని సంగ్రహించడం, వాటిని చిరునామా పుస్తకం వంటి ఇతర అనువర్తనాలకు బదిలీ చేయడం ఇప్పుడు సాధ్యమవుతుంది.
Geo, adr
మార్చుజియో మైక్రోఫార్మాట్ అనేది hCard స్పెసిఫికేషన్‌లో ఒక భాగం. hCardలోని స్థానపు నిర్దేశాంకాలను చేర్చడానికి ఉపయోగపడుతుంది.
hCard లోని adr భాగాన్ని స్టాండ్-అలోన్ మైక్రోఫార్మాట్‌గా కూడా ఉపయోగించవచ్చు.
ప్రత్యక్ష ఉదాహరణ
మార్చువికీమీడియా ఫౌండేషను 2017 నాటి చిరునామా, దాని hCard లను కింద చూడవచ్చు:
Wikimedia FOundation Inc.149 New Montgomery Street, 3rd Floor
San Francisco, CA 94105USAPhone: +1-415-839-6885Email: info@wikimedia.orgFax: +1-415-882-0495
ఉపయోగించిన మార్క్-అప్:

Wikimedia Foundation Inc.

149 New Montgomery Street, 3rd Floor

San Francisco, CA 94105

USA

Phone: +1-415-839-6885

Email: info@wikimedia.org

Fax:
+1-415-882-0495

ఈ ఉదాహరణలో, fn, org లక్షణాలు ఒక అంశంలో కలిపేసి ఉన్నాయి. ఒక వ్యక్తిది కాకుండా సంస్థ hCard అని ఇది సూచిస్తుంది.
ఇతర లక్షణాలు
మార్చుఇతర సాధారణంగా ఉపయోగించే hCard గుణాలు ఉన్నాయి
bday
- ఒక వ్యక్తి పుట్టిన తేదీemail
honorific-prefix
honorific-suffix
label
- గ్రాన్యులర్ కాని చిరునామాల కోసంlogo
nickname
note
- స్వేచ్ఛా వచనంphoto
post-office-box
మూలాలు
మార్చు- ↑ Sikos, Leslie (2011). Web Standards: Mastering HTML5, CSS3, and XML. Apress. ISBN 978-1430240419. Retrieved 2013-05-10.[permanent dead link]
- ↑ Goel, Kavi; Guha, Ramanathan V.; Hansson, Othar (2009-05-12). "Introducing Rich Snippets". Google Webmaster Central Blog. Retrieved 2009-05-25.
- ↑ Blumenthal, Mike (2010-09-22). "Google Announces Full Support for Microformats in Local". Understanding Google Maps. Retrieved 2010-09-30.
- ↑ Protalinski, Emil (2011-02-18). "Facebook adds hCalendar and hCard microformats to Events". ZDNet. Retrieved 24 March 2011.