కే

(K నుండి దారిమార్పు చెందింది)

K అన్న ఒక్క ఇంగ్లీషు అక్షరం మాత్రమే ఉన్న కలం పేరుతో కార్టూన్లు వేసిన కార్టూనిస్టు అసలు పేరు సజ్జా కృష్ణ. తన పేరుకు ఆంగ్ల పదకూర్పులోని మొదటి అక్షరం K ను తన కలంపేరు చేసుకున్నాడు. ఇతను తాను చదువుకుంటున్న కాలంలో(1960ల చివరి నుండి 1970ల మధ్యవరకు) మాత్రమే వ్యంగ్య చిత్రాలు వేశాడు. తాను వైద్య విద్య అభ్యసించడం పూర్తవగానే, తన శక్తియుక్తులన్నీ కూడ తన వైద్య వృత్తి మీదనే కేంద్రీకరించి ప్రజాసేవలో మునిగిపోయి, కార్టూనింగ్‌ను పక్కన పెట్టాడు. కాని ఇప్పుడు కూడ అనేక విషయాల మీద, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలతో బాధ పడుతున్న రోగగ్రస్తులను చూసినప్పుడు చక్కటి వ్యంగ్య చిత్ర ఆలోచనలు వస్తాయని, కాని వైద్య వృత్తిలోని పని ఒత్తిడివల్ల, ప్రస్తుతం కార్టూన్లు గీయటం కుదరటంలేదని చక్కగా ఒప్పుకుంటాడు. ఇతని కార్టూన్లు రాశిలో పెద్దగా లేకపోయినా (ఇతర వ్యంగ్య చిత్రకారుల కార్టూన్లు వేల సంఖ్యలో ఉండగా, ఇతడి వ్యంగ్య చిత్రాలు, కొన్ని వందలు మాత్రమే ఉన్నాయి) వాసిలో ఆలోటు లేకుండా చేశాయని ఇతని కార్టూన్లకు ఉన్న పాఠకాదరణ నిరూపిస్తున్నది.

సజ్జా కృష్ణ
వైద్య వృత్తిలో ఉన్న కార్టూనిస్ట్ Kగా పేరొందిన సజ్జా కృష్ణ
జననంసజ్జా కృష్ణ
జనవరి 25, 1952
బాపట్ల గుంటూరు జిల్లా,
మరణం18 10 2020
Chennai
నివాస ప్రాంతంమద్రాసు (చెన్నై)
ఇతర పేర్లుK, కుమార్
వృత్తివైద్యుడు, వ్యంగ్య చిత్రకారుడు
ఉద్యోగంచెన్నై మునిసిపల్ కార్పొరేషన్
పదవి పేరుఎడిషనల్ హెల్త్ ఆఫీసర్‌
భార్య / భర్తపూర్ణిమ
పిల్లలుప్రవీణ, చందన, ప్రియప్రభ, మోహన మురళీకృష్ణ
తండ్రిసజ్జా ముత్యాలు
తల్లిసజ్జా నవనీతమ్మ

వ్యక్తిగతం మార్చు

సజ్జా కృష్ణ 1952 సంవత్సరం, జనవరి 25వ జన్మించాడు. తల్లి తండ్రులు సజ్జ నవనీతమ్మ, సజ్జా ముత్యాలు. తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ ఇతని స్వయానా సోదరుడు (అన్న). వైద్య విద్య (MBBS), మానసిక వైద్యం-సలహాలు (Psycho Therapy & Counselling) లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశాడు. ఇవి కాక, పబ్లిక్ హెల్త్, వెనిరాలజీ, పారిశ్రామిక పరిశుభ్రత విషయాలలో డిప్లొమాలు సంపాదించాడు. ఇతడి వివాహం పూర్ణిమతో జరిగింది. వీరికి నలుగురు పిల్లలు-ప్రవీణ, చందన, ప్రియ ప్రభ, మోహన మురళీకృష్ణ. ఇతడు మదరాసు (చెన్నై) మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎడిషనల్ హెల్త్ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు.

వ్యంగ్య చిత్ర ప్రవేశం మార్చు

అన్నజయదేవ్ ప్రేరేణతో చిన్నప్పటినుండి గీతలు గీయటం, ముఖాల్ని హాస్యంగా గీయటం మొదలు పెట్టాడు. చెన్నై లోని స్టాన్లీ వైద్య కళాశాల లో వైద్య విద్య అభ్యసిసున్నప్పుడు వ్యంగ్య చిత్రాలను గీయటం ఆరంభించాడు. ముందుగా పెన్సిలుతో స్కెచ్ ఆ తరువాత దానిమీద ఇంక్‌తో దిద్దటం వంటి కష్టాలు పడకుండా ఏకంగా నల్ల సిరాతో కాగితం మీద చిత్రాలను గీయగల నేర్పరి. ఈవిధంగా తాను కోరుకున్న వైద్య వృత్తిలో ప్రవేశించేవరకు కొన్ని వందల కార్టూన్లు గీశాడు. ఇతని మొట్టమొదటి వ్యంగ్య చిత్రం 1969వ సంవత్సరంలో ఆంధ్రపత్రిక లో ప్రచురించబడింది. ఆ తరువాత వందల కార్టూన్లు అన్ని ప్రముఖ తెలుగు వార/మాస పత్రికలలో వచ్చినాయి. తెలుగులోనే కాక పూర్తి ఆంగ్ల కార్టూన్ పత్రిక అయిన శంకర్స్ వీక్లీ (Shankar's Weekly), తమిళ పత్రిక 'దినతంతి', కన్నడ పత్రిక 'మయూర', మరొక ఆంగ్ల పత్రిక కారవాన్ (Caravan)లో కూడ తన కార్టూన్లను ప్రచురించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇతడి కార్టూన్లు "K" కలంపేరుతో ఎంతగానో ప్రాచుర్యం పొందాయి. అప్పుడప్పుడు కుమార్ అన్నపేరుతో కూడ కార్టూన్లు వేశాడు. అసలు ఈ K ఎవరు అని ప్రపంచానికి తెలియచేయటానికి, ఆంధ్రపత్రిక అప్పటి ఉప సంపాదకులలో ఒకరైన సి.కనకాంబరరాజు (సికరాజుగా పేరొందిన ఆంధ్రభూమి వార పత్రిక ఒకప్పటి ముఖ్య సంపాదకుడు) ఇతడిని వెతుక్కుంటూ వచ్చి తమ "క్విక్కింటర్‌వ్యూ" శీర్షికన వీరితో ఇంటర్‌వ్యూ జరిపి ప్రచురించాడు.

వ్యంగ్య చిత్ర ప్రత్యేకతలు మార్చు

  • సోదరుడు జయదేవ్ ప్రముఖ వ్యంగ్య చిత్రకారుడయినప్పటికి, అతని ప్రేరణ మాత్రమే తీసుకున్నాడు కాని, అతని ప్రభావం ఇతని బొమ్మలమీద కనపడదు.
  • వేసిన కార్టూన్లలో ఎక్కువ భాగం నిశ్శబ్ద-కాప్షన్ లేని కార్టూన్లే.
  • నిశ్శబ్ద కార్టూన్లు అవటం మూలాన, ఒక సంఘటన చూపి అందులోని హాస్యం బయటకు తేవటానికి, ఒక వరుసలో 2 లేదా 3 కార్టూన్లు వెయ్యటం ఇతని ప్రత్యేకత.
  • బొమ్మలు చక్కగా కుదురుగా ఉండి, నవ్వు తెప్పిస్తాయి. బొమ్మలో విపరీతాలు ఇతని కార్టూన్లలో ఉండవు.
  • అతి తక్కువ గీతలలో బొమ్మ గీయటానికి ప్రాధాన్యత ఇస్తాడు.
  • కార్టూన్లో సామాన్యంగా ఇతర వివరాలు ఉండవు, ఒకవేళ ఉన్నా అతి తక్కువగా చూపిస్తాడు.

వ్యంగ్య చిత్రమాలిక మార్చు


"https://te.wikipedia.org/w/index.php?title=కే&oldid=3070585" నుండి వెలికితీశారు