తెనాలి వాసవ్యులయిన ఎన్.వి.ఎస్. ప్రసాదరావు ఆకాశవాణిలో 64 ప్రాంతాల్లో హైదరాబాదు కేంద్రంలో గ్రామీణ కార్యక్రమాల ప్రొడ్యూసరుగా చేరారు. రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు గల ప్రసాదరావు గ్రామీణ కార్యక్రమాల రూపకల్పనలో సిద్ధహస్తులు. 1980 లో రిటైర్ అయిన తర్వాత కొంతకాలం రాష్ట్ర వ్యవసాయ శాఖ నడిపే మాస ప్రత్రిక ఎడిటర్ గా పనిచేశారు. ఆ తర్వాత రవీంద్ర భారతి డైరక్టర్ గా వ్యవహరించారు. హైదరాబాదు లోని వివిధ సాంస్కృతిక సంస్థలతో ఆయనకు సన్నిహిత సంబంధం. వీరి కుమార్తె సుశీల హైదరాబాదు కేంద్రంలో అనౌన్సర్ గా పనిచేస్తున్నారు.