z8_GND_5296 అనునది అక్టోబరు 2013 లో కనుగొన్న మరుగుజ్జు గెలాక్సీ. ఇది సూదూరంలో గలది, ప్రారంభ గాలక్సీ. ఇది భూమి నుండి సుమారు 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్లు వర్ణపట శాస్త్రం ఆధారంగా నిర్ణయింపబడినది[2] ఈ గాలక్సీ బిగ్ బ్యాంగ్ తర్వాత 700 మిలియన్ల సంవత్సరాల తర్వాత కాలం నాటిదిగా కనిపిస్తుంది. ఆ కాలంలో మన విశ్వం ప్రస్తుతం వయస్సు అయిన 13.8 బిలియన్ సంవత్సరాలలో 5 శాతం మాత్రమే విస్తరించియున్నది. ఈ గాలక్సీ 7.51 రెడ్ షిప్ట్ వద్ద ఉంది., ఇది 7.2 రెడ్ షిప్ట్ గల రెండవ దగ్గరి గాలక్సీకి ప్రక్కన గలదు. ఈ గాలక్సీ ప్రతి సంవత్సరం 300 సూర్యుల ద్రవ్యరాశి కలిగిన నక్షత్రాలను కాలంలో ఉత్పత్తి చేయుటను పరిశీలించారు[1] ఈ గాలక్సీ నుండి భూమికి కాంతి చేరుటకు 13 బిలియన్ల సంవత్సరాలు పడుతుంది. విశ్వ వ్యాకోచ సిద్దాంతం ప్రకారం ఇది మరీ దూరంలో అనగా మన భూమి నుండి 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నది[3]

z8_GND_5296
పరిశీలనా సమాచారం
సరైన స్థితి 12h 36m 37.90s
దిక్పాతం62° 18′ 08.5″
రెడ్ షిఫ్ట్7.51
దూరం (ఖగోళశాస్త్రం)13.1 billion light-years
(light travel distance)
~30 billion light-years
(present comoving distance)
ద్రవ్యరాశి1.0+0.2
−0.1
×109 M
దృశ్యమాన పరిమాణం (V)25.6 (160W)
మూలాలు: [1]
ఇవి కూడా చూడండి: గాలక్సీ, గాలక్సీల జాబితా

ఆవిష్కరణ మార్చు

 
W.M. Keck Observatory atop Mauna Kea in Hawaii
2013 అక్టోబరు 24 న హబుల్ స్పేస్ టెలిస్కోప్ నుండి పరారుణ చిత్రాలు, దృశ్య చిత్రాల ఆధారంగా ఈ గాలక్సీని కనుగొన్నారు. ఈ గాలక్సీ విషయాలను నేచుర్ అనే జర్నల్ లో ప్రచురించారు. స్టీవెన్ ఫింకెస్‌స్టీన్ అధ్వర్యంలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుండి ఒక ఖగోశ శాస్త్రవేత్తల బృందం నేచర్ అనే పత్రికలో వారి పరిశీలనలను ప్రచురించడం జరిగింది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Finkelstein SL, Papovich C, Dickinson M, Song M, Tilvi V, Koekemoer AM, Finkelstein KD, Mobasher B, Ferguson HC, Giavalisco M, Reddy N, Ashby ML, Dekel A, Fazio GG, Fontana A, Grogin NA, Huang JS, Kocevski D, Rafelski N, Weiner BJ, Willner SP (2013). "A galaxy rapidly forming stars 700 million years after the Big Bang at redshift 7.51". Nature. 502 (7472): 524. arXiv:1310.6031. doi:10.1038/nature12657.
  2. Johnson, Rebecca (23 October 2013). "Texas Astronomer Discovers Most Distant Known Galaxy". University of Texas at Austin.
  3. Morelle, Rebecca (24 October 2013). "New galaxy 'most distant' yet discovered". BBC. Retrieved 24 October 2013.
"https://te.wikipedia.org/w/index.php?title=Z8_GND_5296&oldid=3929455" నుండి వెలికితీశారు