అంతర్జాతీయ తెలుగు సంస్థ

తెలుగు సాహిత్యాన్ని తెలుగువారి సంస్కృతిని గురించిన పరిశోధనలను విస్తృతం చేసి విదేశాలలో, స్వదేశంలో ఉన్న తెలుగు భాషా ప్రియులతో సాంస్కృతిక సంబంధాలు నెలకొల్పే నిమిత్తం ఏర్పడినదే అంతర్జాతీయ తెలుగు సంస్థ (ఆంగ్లం:International Telugu Institute). ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే 1975, సెప్టెంబర్ 8 వ తేదీన ఏర్పాటు చేయబడింది. ఇది హైదరాబాదులో జరిగిన మొదటి ప్రపంచ తెలుగు మహాసభలో పాల్గొనిన సభ్యుల అంగీకారంతో ప్రవేశపెట్టిన తీర్మానం ఆధారంగా ప్రారంభింపబడింది. ఆ తరువాత ఇది 1985లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయములో ఒక విభాగంగా విలీనం అయినది., దీనికి "అంతర్జాతీయ తెలుగు కేంద్రం"గా పేరు మార్పు చేశారు. ఈ సంస్థలో మూడు విభాగములు ఉన్నాయి. అవి. (1) సమాజం, సంస్కృతి విభాగం (2) భాషలు, సాహిత్యం, అనువాదం విభాగం., (3) ప్రచురన విభాగం

ముఖ్య లక్ష్యములు మార్చు

  • ప్రపంచ వ్యాప్తంగా, ఇతర రాష్ట్రములలో గల తెలుగు మాట్లాడే ప్రవాస భారతీయుల తెలుగు భాషాభిమానులు విద్య, సంస్కృతిని అభివృద్ధి చేయుటకు, తెలుగు బోధనాభ్యసన విధానాన్ని ప్రాచుర్యంలోనికి తేవటం
  • తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, కళలు, సంస్కృతి, సంబంధిత రంగాలలో పరిశోధనలను నిర్వహించుట.
  • తెలుగు ప్రజల జీవితం, సంస్కృతి పై ఏక విషయంపై రచనలు, పుస్తకములు, కావ్యములు, పరిశోధనా పత్రములకు సంబంధించిన పుస్తక ప్రదర్శనలు యేర్పాటు చేయుటకుబాధ్యత వహించుట.
  • ఆంధ్ర ప్రదేశ్ లో గల విద్యావంతులకు పరిశోధనా తరగతులు, శిక్షణా కార్యక్రమములు నిర్వహించుట.

ప్రచురణలు మార్చు

ఈ సంస్థ జాతీయ భారతీయ భాషల సంస్థ, మైసూర్తో కలిసి భాషా పరిసరాల శిబిరములు నిర్వహించుచున్నారు. ఈ సంస్థ తెలుగు వాణి అనే మాస పత్రిక ఆంగ్లంలో, తెలుగులో ప్రచురించుచున్నారు. ఇది నాలుగు భాషలలో ప్రచురితమవుతున్నది. అవి (1) బర్మాలో తెలుగు వాణి (2) మార్షియస్ లో తెలుగు వాణి (3) పండుగలు పబ్బాలు (4) వెర్నచ్యులరైసేషన్ ఆఫ్ లిటెరసీ - తెలుగు ప్రయోగం

ప్రసంగాలు మార్చు

ఈ సంస్థ ప్రసిద్ధి చెందిన తెలుగు వ్యక్తుల జ్ఞాపకార్థం ఆవృత ప్రసంగాలను నిర్వహిస్తుంది.

మూలాలు మార్చు

  • The International Telugu Institute by M.Ramappa published in 2nd World Telugu Conference 1982 Souvenir.

బయటి లింకులు మార్చు