అజంతా సుందరి (రూపకం)

అజంతా సుందరి రూపకాన్ని ప్రముఖ సాహితీకారుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత సి.నారాయణ రెడ్డి రచించారు. ప్రసిద్ధ అజంతా గుహ చిత్ర, శిల్ప కళ రూపకల్పనను, ఆనాటి చారిత్రికాంశాలను ఆధారంగా చేసుకుని రచించిన రూపకం ఇది.

రచన నేపథ్యం మార్చు

1955లో సినారె ఈ సంగీత రూపకాన్ని రచించారు. 1953లో తన తొలిరచనగా నవ్వని పువ్వు అన్న సంగీత ప్రధానమైన రూపకాన్ని వెలువరించాకా వెనువెంటనే రచించిన రూపకాల్లో ఇదీ ఒకటి.

రచయిత మార్చు

ప్రధాన వ్యాసం సింగిరెడ్డి నారాయణరెడ్డి రూపకం రాసిన కవి సినారె పూర్తిపేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. తెలుగు సాహిత్య రంగంలో జ్ఞానపీఠ్ పురస్కారాన్ని పొందిన ముగ్గురు కవుల్లో ఆయన రెండవ వారు. (మొదటివారు విశ్వనాథ సత్యనారాయణ, మూడవ వారు రావూరి భరద్వాజ. ఆయన ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, బుర్ర కథలు, గజళ్ళు, వ్యాసాలు, విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన పరిశోధన గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. 1962 లో గులేబకావళి కథ చిత్రం లోని నన్ను దోచుకుందువటే వన్నెల దొరసానీ అనే పాటతో ప్రారంభించి నేటి వరకు 3500 గీతాలు రచించాడు. సినారె గ్రంథాలు ఇంగ్లీషు, ఫ్రెంచ్, సంస్కృతం, హిందీ, మలయాళం, ఉర్దూ, కన్నడం మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. 1990 లో యుగోస్లేవియాలోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.

ఇతివృత్తం మార్చు

ప్రఖ్యాత అజంతా శిల్పాలను చెక్కే కాలంలో శిల్పుల జీవితాన్ని ఆధారం చేసుకుని రచించిన సంగీత రూపకం.

మూలాలు మార్చు

బయటి లింకులు మార్చు