అజ్మీర శ్యాం నాయక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్టీవో గా తన ప్రత్యక్ష జీవితాన్ని మొదలుపెట్టారు .

ఒకవైపు ఆర్టీవో గా తన ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తూనే ఉమ్మడి ఆసిఫాబాద్ జిల్లా టీఎన్జీవో అధ్యక్షులుగా కూడా పనిచేశారు.

ఇదే కాకుండా అఖిల భారతీయ బంజారా సేవా సమితి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు అజ్మీర శ్యాం నాయక్.

శ్యామ్ నాయక్ సతీమణి రేఖ నాయక్ ఖానాపూర్ ఎమ్మెల్యే ఉండడం తో తాను కూడా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకున్నరు .

తన ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు అజ్మీర శ్యాం నాయక్ .

దీంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అసిఫాబాద్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని ఆయనకు కల్పించింది

2023 తెలంగాణ రాష్ట్రంలో జరిగనున్న శాసనసభ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆసిఫాబాద్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అజ్మీర శ్యాం నాయక్ .

మొదటి నుంచి నియోజకవర్గంలో తనదైన క్యాడర్ను పెంచుకోవడం.. భార్య రేఖా నాయక్ ఎమ్మెల్యేగా ఉండడం లాంటివి శ్యామ్ నాయక్ గెలుపుకి ముఖ్యమైన అంశాలుగా చెప్పవచ్చు.

నియోజకవర్గంలో ప్రత్యక్ష రాజకీయాల్లో లేనందున గెలుపులో ఈ అంశం అంత ముఖ్యపాత్ర పోషించకపోవచ్చు .[1]

  1. "సి ఇ ఓ తెలంగాణ అఫిడవిట్". Archived from the original on 2023-11-20.