అద్వైత (అర్థం: "ఒకే ఒక్కటి") (1750 - 22-03-2006) (వయసు 255) కోలకతా లోని అలీపూర్ జూలాజికల్ గార్డెన్స్ లో జీవించిన ఒక పెద్ద తాబేలు. 2006లో మరణించిన ఈ అద్వైత ప్రపంచంలోని జంతువులలో అత్యధిక కాలం జీవించినదని విశ్వసిస్తున్నారు.

చరిత్ర మార్చు

ఒక నివేదిక ప్రకారం అద్వైతను సీషెల్స్ లోని ఒక అల్డబ్రా పగడపుదీవి నుండి పట్టుకొన్న బ్రిటిష్ నావికులైన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రాబర్ట్ క్లైవ్ (1725-1774) ఇచ్చారు.[1] అయితే ఈ వృత్తంతపు నివేదిక నిర్ధారించబడలేదు. ఈ జంతువు కోలకతా ఉత్తర శివార్లలో బారక్పూర్‌లో క్లైవ్ ఎస్టేట్ వద్ద నివసించిన నాలుగు తాబేలలో ఒకటి.[2] అద్వైత, జూ స్థాపకుడు కార్ల్ లూయిస్ స్కెవెడ్లర్ చే 1875 లేదా 1876లో అలీపూర్ జూ కు బదిలీ చేయబడింది.[3] ఆ తరువాత అద్వైత తను మరణించేంత వరకు (22-03-2006 వరకు) ఈ జూ ఆవరణంలోనే జీవించింది.

వివరణ మార్చు

250 కిలోల బరువున్న అద్వైత ఒక ఒంటరి జంతువు, దాంతో తన సంతానం యొక్క రికార్డులు లేవు. అద్వైత జీవించడానికి గోధుమ ఊక, క్యారట్లు, ఆకుకోసు, నానబెట్టిన పప్పులు, రొట్టె, గడ్డి, ఉప్పు ఆహారంగా తీసుకొనేది.

వయసు మార్చు

ఈ తాబేలు యొక్క డొప్ప 2005 చివరలో పగుళ్ళిచ్చింది, పగుళ్ళ కింద ఉన్న కండ నందు గాయం పెద్దదయింది. ఈ గాయం పెద్దదవడంతో కాలేయం చెడిపోయి 22-03-2006 న మరణానికి గురైంది. అద్వైత మరణించినప్పుడు దాని వయసు కనీసం 150 సంవత్సరాలు ఉంటుందని అంచనా వేశారు.[2] కొన్ని అంచనాలు ఇది మరణించినప్పుడు దాని వయసు కనీసం 250 సంవత్సరాలని సూచించాయి. అయితే ఈ రెండో అంచనా నిర్ధారించబడింది.

మూలాలు మార్చు

  1. Encyclopedia of Life (2014). "Aldabra Tortoise (Geochelone gigantean)". Encyclopedia of Life. Retrieved 2014-01-28.
  2. 2.0 2.1 BBC News – South Asia (2006-03-23). "'Clive of India's' tortoise dies". BBC News. BBC Online. Retrieved 2014-01-23.
  3. "Zoological Garden". Proceedings of the Asiatic Society of Bengal: 23–24. February 1876.

ఇతర లింకులు మార్చు