అనగనగా ఓ నాన్న మల్లాది వెంకట కృష్ణమూర్తి రచించిన ఒక నవల. ఇది అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్న ఒక మతిమరపు నాన్న కథ.

అనగనగా ఓ నాన్న
అనగనగా ఓ నాన్న నవల ముఖచిత్రం
కృతికర్త: మల్లాది వెంకట కృష్ణమూర్తి
దేశం: భారతదేశం
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): నవల
ప్రచురణ:
విడుదల:

కథా సారాంశం మార్చు

ఇది ఒక మంచి సెంటిమెంట్ ఉన్న కథ. త్రివిక్రమ్ ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్. అతని తల్లి జనని. తండ్రి రామ్ ప్రసాద్. రామ్ ప్రసాద్ అల్జీమర్స్ అన్న వ్యాధితో బాధపడుతూ ఉంటాడు. ఆ వ్యాధి లక్షణం వల్ల ఈ నిమిషంలో జరిగింది మరు నిమిషంలో గుర్తు ఉండదు. అంతే కాకుండా మనుషులని కూడా గుర్తు పట్టడు. జనని, త్రివిక్రం లు రామ్ ప్రసాద్ ని చిన్న పిల్లాడిని చూసుకున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అకస్మాత్తుగా జననికి ప్రమాదం జరిగి అక్కడికి అక్కడే మరణిస్తుంది. జనని మరణించాక త్రివిక్రమ్ కి తన తల్లి జనని కాదు అని, తండ్రి కూడా రామ్ ప్రసాద్ కాదు అని తెలుస్తుంది. కాని అతనికి తను ఎవరికి జన్మించాడో తెలిసే అవకాశం ఉండదు, రాంప్రసాద్ వ్యాధి వల్ల. త్రివిక్రమ్ ఎలా కనుక్కున్నాడు, అసలు ఏం జరిగింది అన్నది మిగతా కథ.