ఆండ్రూ హాల్

దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్

ఆండ్రూ జేమ్స్ హాల్ (జననం 1975, జూలై 31) దక్షిణాఫ్రికా మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. 1999 నుండి 2011 వరకు ఆడాడు. ఫాస్ట్-మీడియం పేస్ బౌలింగ్ చేసే ఆల్-రౌండర్‌గా, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా, లోయర్ ఆర్డర్‌లో రాణించాడు.

ఆండ్రూ హాల్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆండ్రూ జేమ్స్ హాల్
పుట్టిన తేదీ (1975-07-31) 1975 జూలై 31 (వయసు 48)
జోహన్నెస్‌బర్గ్, ట్రాన్స్‌వాల్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
పాత్రఆల్ రౌండర్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 284)2002 8 March - Australia తో
చివరి టెస్టు2007 26 January - Pakistan తో
తొలి వన్‌డే (క్యాప్ 54)1999 27 January - West Indies తో
చివరి వన్‌డే2007 1 July - India తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.99
తొలి T20I (క్యాప్ 15)2006 9 January - Australia తో
చివరి T20I2006 24 February - Australia తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1995/96–2000/01Transvaal/Gauteng
1999Durham Cricket Board
2001/02–2003/04Easterns
2002Suffolk
2003–2004Worcestershire
2003/04Titans
2004/05–2005/06Lions
2005–2007Kent
2006/07–2009/10Dolphins
2008–2014Northamptonshire (స్క్వాడ్ నం. 1)
2009/10North West
2010/11–2011/12Mashonaland Eagles (స్క్వాడ్ నం. 7)
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 21 88 242 318
చేసిన పరుగులు 760 905 11,072 5,990
బ్యాటింగు సగటు 26.20 21.04 35.26 29.80
100లు/50లు 1/3 0/3 15/66 6/33
అత్యుత్తమ స్కోరు 163 81 163 129*
వేసిన బంతులు 3,001 3,341 36,355 12,616
వికెట్లు 45 95 639 365
బౌలింగు సగటు 35.93 26.47 27.88 27.59
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 1 17 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 1 0
అత్యుత్తమ బౌలింగు 3/1 5/18 6/77 5/18
క్యాచ్‌లు/స్టంపింగులు 16/– 29/– 228/– 92/1
మూలం: Cricinfo, 2017 18 August

దక్షిణాఫ్రికా ఫస్ట్-క్లాస్ క్రికెట్ సన్నివేశంలో ప్రవేశించడానికి ముందు దక్షిణాఫ్రికా తరపున ఇండోర్ క్రికెట్ ఆడాడు. 1995/96లో ట్రాన్స్‌వాల్, గౌటెంగ్, ఈస్టర్న్‌ల కోసం ఆడాడు.

అంతర్జాతీయంగా, హాల్ మొదట పరిమిత ఓవర్ల క్రికెట్ స్పెషలిస్ట్‌గా మాత్రమే భావించబడ్డాడు. 1999లో డర్బన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అరంగేట్రం చేసాడు.[1] 2007 వరకు వన్డే జట్టులో రెగ్యులర్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికా 2003 క్రికెట్ ప్రపంచ కప్ జట్టులో, 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో పాల్గొన్నాడు. 2002లో కేప్ టౌన్‌లో ఆస్ట్రేలియాపై అరంగేట్రం చేశాడు.[2] 8వ స్థానంలో బ్యాటింగ్ చేసిన అతను 70 పరుగులు చేశాడు కానీ మ్యాచ్‌లో వికెట్లేమీ తీయలేదు.[3]

2007 సెప్టెంబరులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. కానీ 2014 వరకు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ రెండింటిలోనూ దేశీయ క్రికెట్ ఆడటం కొనసాగించాడు.

జననం, విద్య మార్చు

ఆండ్రూ జేమ్స్ హాల్ 1975, జూలై 31న దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జన్మించాడు. గౌటెంగ్‌లోని అల్బెర్టన్‌లోని హోయర్‌స్కూల్ ఆల్బర్టన్‌లో చదువుకున్నాడు.

అంతర్జాతీయ కెరీర్ మార్చు

2003 ఇంగ్లాండ్ పర్యటనలో దక్షిణాఫ్రికా జట్టుకు ఆలస్యంగా ఎంపికయ్యాడు. టెస్ట్ సిరీస్‌లో 16 వికెట్లతో ఆకట్టుకున్నాడు. హెడ్డింగ్లీలో 99 నాటౌట్‌గా మ్యాచ్ విన్నింగ్ చేసాడు. టెస్ట్ క్రికెట్‌లో వందకు ఒక్క పరుగు దూరంలో నిలిచిన 5వ బ్యాట్స్‌మన్ అయ్యాడు.[4][5][6]

2004లో, పదవీ విరమణ చేసిన గ్యారీ కిర్‌స్టన్, నాన్-టూరింగ్ హెర్షెల్ గిబ్స్ లేకపోవడం వల్ల, భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో బ్యాటింగ్‌లో ఓపెనర్‌గా పదోన్నతి పొందాడు. కాన్పూర్‌లో 163 పరుగులు చేసి, తొలి టెస్ట్ సెంచరీ సాధించాడు.[7] దాదాపు పదిగంటలపాటు బ్యాటింగ్ చేసిన అనిల్ కుంబ్లే, హర్భజన్ సింగ్ వంటి వారిపై సెంచరీ చేశారు.[8][9][10]

2006 నవంబరులో భారత్‌పై జస్టిన్ కెంప్‌తో కలిసి వన్డే క్రికెట్‌లో 138 పరుగుల ప్రపంచ రికార్డు 8వ వికెట్ స్టాండ్‌ను కలిగి ఉన్నాడు. 47 బంతుల్లో అజేయంగా 56 పరుగులు, అతను రెండవ ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు పడగొట్టాడు.[11][12]

వెస్టిండీస్‌లో జరిగిన 2007 క్రికెట్ ప్రపంచ కప్‌లో ఏప్రిల్ 17న బార్బడోస్‌లోని బ్రిడ్జ్‌టౌన్, కెన్సింగ్‌టన్ ఓవల్‌లో ఇంగ్లాండ్‌పై తన తొలి 5 వికెట్ల (5/18) తీశాడు.[13][14]

అంతర్జాతీయ పదవీ విరమణ మార్చు

హాల్ 2007 సెప్టెంబరులో అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. గ్రాహం ఫోర్డ్ - కెంట్‌లోని హాల్ కోచ్ - 2007 ట్వంటీ20 ప్రపంచ ఛాంపియన్‌షిప్ స్క్వాడ్ నుండి తప్పించడం ఒక కారణం కావచ్చు.[15]

మూలాలు మార్చు

  1. "3rd ODI: South Africa v West Indies at Durban, Jan 27, 1999 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  2. "2nd Test: South Africa v Australia at Cape Town, Mar 8-12, 2002 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  3. "Hall makes his mark, but Australia hold the upper hand". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  4. "4th Test: England v South Africa at Leeds, Aug 21-25, 2003 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  5. "South Africa close in on victory after Hall's heroics". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  6. Hall makes his mark, BBC Sport, 2003-08-24. Retrieved 2017-10-22.
  7. "Hall makes his mark". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  8. "1st Test: India v South Africa at Kanpur, Nov 20-24, 2004 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  9. "India v South Africa". Cricinfo. 2006-02-20. Retrieved 2017-05-03.
  10. "The makeshift opener who batted and batted". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  11. "3rd ODI: South Africa v India at Cape Town, Nov 26, 2006 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  12. "Records | One-Day Internationals | Partnership records | Highest partnerships by wicket | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  13. "44th Match, Super Eights: England v South Africa at Bridgetown, Apr 17, 2007 | Cricket Scorecard | ESPN Cricinfo". Cricinfo. Retrieved 2017-05-03.
  14. "Clinical South Africa crush hopeless England". Cricinfo (in ఇంగ్లీష్). Retrieved 2017-05-03.
  15. "Andrew Hall quits international cricket". Cricinfo. 1 September 2007. Retrieved 1 September 2007.

బాహ్య లింకులు మార్చు