ఆంథోనీ వాన్ రైనెవెల్డ్

దక్షిణాఫ్రికా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు

ఆంథోనీ జాన్ వాన్ రైనెవెల్డ్ (1925, నవంబరు 7 - 2018, ఆగస్టు 29) దక్షిణాఫ్రికా ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆటగాడు.

ఆంథోనీ వాన్ రైనెవెల్డ్
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఆంథోనీ జాన్ వాన్ రైనెవెల్డ్
పుట్టిన తేదీ1925, నవంబరు 17
ప్లమ్‌స్టెడ్, కేప్ ప్రావిన్స్, దక్షిణాఫ్రికా
మరణించిన తేదీ2018 ఆగస్టు 29(2018-08-29) (వయసు 92)
టోకై, వెస్ట్రన్ కేప్, దక్షిణాఫ్రికా
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్-మీడియం
బంధువులుక్లైవ్ వాన్ రైనెవెల్డ్ (సోదరుడు)
జిమ్మీ బ్లాంకెన్‌బర్గ్ (మామ)
స్టీవర్ట్ వెస్ట్ (మామ)
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1947Oxford University
కెరీర్ గణాంకాలు
పోటీ First-class
మ్యాచ్‌లు 1
చేసిన పరుగులు 69
బ్యాటింగు సగటు 34.50
100లు/50లు –/1
అత్యుత్తమ స్కోరు 50
వేసిన బంతులు 18
వికెట్లు 0
బౌలింగు సగటు
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు
అత్యుత్తమ బౌలింగు
క్యాచ్‌లు/స్టంపింగులు –/–
మూలం: Cricinfo, 2020 7 June

జననం, కుటుంబం మార్చు

ఆంథోనీ వాన్ రైనెవెల్డ్ 1925, నవంబరు 7న రెజినాల్డ్ క్లైవ్ బెర్రంగే వాన్ రైనెవెల్డ్ - మరియా ఆల్ఫ్రెడా బ్లాంకెన్‌బర్గ్‌ దంపతులకు కేప్ టౌన్‌లోని ప్లమ్‌స్టెడ్‌లో జన్మించాడు. రోడ్స్ స్కాలర్‌గా ఆక్స్‌ఫర్డ్‌లోని ట్రినిటీ కళాశాలకు వెళ్ళేముందు డియోసెసన్ కళాశాలలో చదువుకున్నాడు.[1]

ఇతని సోదరుడు క్లైవ్, మామ జిమ్మీ బ్లాంకెన్‌బర్గ్ ఇద్దరూ దక్షిణాఫ్రికా తరపున టెస్ట్ క్రికెట్ ఆడారు. మరొక మేనమామ, స్టీవర్ట్ వెస్ట్ కూడా ఫస్ట్-క్లాస్ క్రికెటర్.

క్రికెట్ రంగం మార్చు

ఆక్స్‌ఫర్డ్‌లో చదువుతున్నప్పుడు, 1947లో ఆక్స్‌ఫర్డ్‌లోని ఫ్రీ ఫారెస్టర్స్‌తో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో ఆడాడు.[2] ఈ మ్యాచ్‌లో రెండుసార్లు బ్యాటింగ్ చేస్తూ, ఆక్స్‌ఫర్డ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఇయాన్ పీబుల్స్ చేతిలో 50 పరుగుల వద్ద ఔటయ్యాడు, రెండవ ఇన్నింగ్స్‌లో జాన్ బ్రోకెల్‌బ్యాంక్ చేతిలో 19 పరుగుల వద్ద ఔటయ్యాడు.[3]

దక్షిణాఫ్రికాలో రగ్బీ యూనియన్ ఆటగాడిగా బాగా పేరు పొందాడు.[1] వాన్ రైన్వెల్డ్ వ్యాపారంలో ఉన్నాడు. ఓల్డ్ డియోసెసన్ యూనియన్ కమిటీలో పనిచేశాడు.

మరణం మార్చు

2018, ఆగస్టు 29న క్యాన్సర్‌ కారణంగా కేప్ టౌన్‌లోని టోకైలో మరణించాడు.[4]

మూలాలు మార్చు

  1. 1.0 1.1 Booth, Lawrence (2019). The Shorter Wisden 2019 (in ఇంగ్లీష్). Bloomsbury Publishing. p. 290. ISBN 978-1472963871.
  2. "First-Class Matches played by Tony van Ryneveld". CricketArchive. Retrieved 2020-06-07.
  3. "Oxford University v Free Foresters, 1947". CricketArchive. Retrieved 2020-06-07.
  4. "Passing of Tony van Ryneveld (1942G)". www.odunion.com. 2018-08-31. Retrieved 2020-06-07.

బాహ్య లింకులు మార్చు