ఆత్మకూరు మండలం (సూర్యాపేట జిల్లా)

తెలంగాణ, సూర్యాపేట జిల్లా లోని మండలం

ఆత్మకూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాకు చెందిన ఒక మండలం.[1] ఆత్మకూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 16 కి. మీ. దూరంలోనూ ఉంది.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నల్గొండ జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం సూర్యాపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.

ఆత్మకూరు మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సూర్యాపేట జిల్లా, ఆత్మకూరు మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°14′02″N 79°41′48″E / 17.233943°N 79.696671°E / 17.233943; 79.696671
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సూర్యాపేట జిల్లా
మండల కేంద్రం ఆత్మకూరు (సూర్యాపేట జిల్లా)
గ్రామాలు 19
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 206 km² (79.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 50,970
 - పురుషులు 25,693
 - స్త్రీలు 25,277
పిన్‌కోడ్ 508212

నల్గొండ జిల్లా నుండి సూర్యాపేట మార్పు మార్చు

లోగడ ఆత్నకూరు మండలం,నల్గొండ జిల్లా,సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+19) ఇరవై గ్రామాలతో ఆత్మకూరు కేంద్రంగా, కొత్తగా ఏర్పడిన సూర్యాపేట జిల్లా, సూర్యాపేట రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.

మండల జనాభా మార్చు

 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నల్గొండ జిల్లా పటంలో మండల స్థానం

2011భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 50,970 - పురుషులు 25,693 - స్త్రీలు 25,277. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 206 చ.కి.మీ. కాగా, జనాభా 50,970. జనాభాలో పురుషులు 25,693 కాగా, స్త్రీల సంఖ్య 25,277. మండలంలో 13,067 గృహాలున్నాయి.[4]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు మార్చు

  1. కందగట్ల
  2. గట్టికల్
  3. పత్తర్లపహడ్
  4. ఇస్తల్లపుర్
  5. ముక్కుడు దేవులపల్లి
  6. ఐపూర్
  7. బొప్పారం
  8. మిడ్తాంపల్లి
  9. మక్తకొత్తగూడెం
  10. సెట్టిగూడ
  11. నారాయణప్పగూడ
  12. నసీంపేట్
  13. ఆత్మకూరు (S)
  14. నమ్మికల్
  15. ఎనుబంల
  16. గొల్లగూడ
  17. దాచారం
  18. తుమ్మలపెన్‌పహాడ్
  19. కొత్తపహాడ్

గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు మార్చు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2020-01-20.
  3. "సూర్యాపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-27 suggested (help)
  4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.