ఆబా పాల్ (ఆంగ్లం: Aabha Paul; 1987 ఆగస్టు 7) భారతీయ నటి, మోడల్. హిందీ చిత్రాలలో నటించే ఆమె రూపేష్ పాల్ దర్శకత్వం వహించిన కామసూత్ర 3D (2013)లో తన పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఇది 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. ఆమె ఏక్తా కపూర్ 2019లో రూపొందించిన ALT బాలాజీ సిరీస్ గంధీ బాత్‌లో కనిపించింది. ఆబా పాల్ 2020లో విడుదలైన శృంగార నాటకం మస్త్రంలో సరితా నాయర్‌గా కూడా నటించింది. ఆమె XXX, లోలిత పి.జి హౌస్, నమ్‌కీన్, హై తౌబ్బా వంటి ఇతర సిరీస్‌లలో కూడా నటించింది.[1] ఆమె "దునల్లి" పాట మ్యూజిక్ వీడియోలో నటించింది.

ఆబా పాల్
జననం
ఆబా పాల్

(1987-08-07) 1987 ఆగస్టు 7 (వయసు 36)
జాతీయతఇండియన్
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006 - ప్రస్తుతం
వెబ్‌సైటుఫేస్‌బుక్ లో ఆబా పాల్

బాల్యం, విద్య మార్చు

ఆబా పాల్ ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో 1987 ఆగస్టు 7న జన్మించింది. ఆమె బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్‌లో గ్రాడ్యుయేట్.[2][3]

కెరీర్ మార్చు

ఆబా పాల్ తన మోడలింగ్ వృత్తిని 2005లో ప్రారంభించింది. 2006లో అందాల పోటీలో మిస్ ఢిల్లీ అవార్డును గెలుచుకుంది. 2017లో సల్మాన్ ఖాన్ నటించిన వీర్‌లో ఆమె చిన్న పాత్రను పోషించింది, కానీ ఆమె భాగం ఎడిట్ లో పోయింది.[4]

అదే సంవత్సరం ఆమె టేస్ట్ అనే తమిళ చిత్రంతో దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టింది.[5] ఆమె తన మొబైల్ యాప్‌ను 2020లో ప్రారంభించగా లక్ష మంది వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకున్నారు.[6][7] ఆమె 2021లో వచ్చిన లోలిత పి.జి హౌస్‌లో ప్రధాన పాత్ర పోషించింది.[8] 2021లో ఆమె అభయ్ శుక్లా నమ్‌కీన్‌ చిత్రంలో నటించింది.[9] ఆ తరువాత, ఆమె ALT బాలాజీ సిరీస్ హై తౌబ్బాలో నటించింది.[10][11] ఈ సిరీస్‌లో ఆబా నటనకు ప్రశంసలు లభించాయి.[12]

ఫిల్మోగ్రఫీ మార్చు

సినిమాలు మార్చు

Year Title Role Language
2010 వీర్ తొలగించబడినది
2013 కామసూత్ర 3D హిందీ
2017 టేస్ట్ తమిళం

వెబ్ సిరీస్ మార్చు

Year Title Role Language
2018 XXX హిందీ, ఇంగ్లీష్
2019 గంధీ బాత్‌ మామీ హిందీ
2020 మస్త్రం సరితా నాయర్ హిందీ
2021 లోలిత పి.జి హౌస్‌ లోలిత హిందీ
నమ్‌కీన్‌ హిందీ
హై తౌబ్బా ఆధ్యా హిందీ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "Exclusive! "If not an acting I would have been an engineer" Aabha Paul on her acting journey". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  2. Ganesh (2019-09-19). "Aabha Paul : Biography, wiki, age, height, gandi baat actress, info, hot". CineTalkers (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2022-09-30.
  3. "Exclusive! "If not an acting I would have been an engineer" Aabha Paul on her acting journey". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  4. "Exclusive: Boldness is an attitude and I have no problem in filming bold scenes if shot aesthetically – Actress Aabha Paul" (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-08-30. Retrieved 2022-10-03.
  5. "Captivating pictures of Aabha Paul are sweeping the internet | Photogallery – ETimes". photogallery.indiatimes.com. Retrieved 2022-10-03.
  6. "Mobile app for hot internet sensation and GandiBaat 3 actor Aabha Paul". mid-day.com. Retrieved 2022-10-03.
  7. "Aabha Paul on Roll, Becomes Hot Favourite among Erotic Web Series Makers | 🎥 LatestLY". LatestLY (in ఇంగ్లీష్). 2020-02-25. Retrieved 2022-10-03.
  8. Singh, Anushka; Singh, Anushka (2022-08-25). "Lolita PG House on Kooku: A web series that crosses all boldness and hotness boundaries, watch video". DNP INDIA (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  9. "Gandi Baat actor Aabha Paul bags CID fame Abhay Shukla's web series". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  10. "EXCLUSIVE: "I always wanted to play such a character" – Aabha Paul on her role in the show Hai Taubba Chapter 3". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  11. "Aabha Paul The Social Media Sensation Roped in ALTBalaji's Series Hai Taubba 3 – EXCLUSIVE | SpotboyE". spotboye.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
  12. "EXCLUSIVE! Ok with bold scenes but should not look cheap and vulgar: Aabha Paul on types of roles she wants to do". Tellychakkar.com (in ఇంగ్లీష్). Retrieved 2022-10-03.
"https://te.wikipedia.org/w/index.php?title=ఆబా_పాల్&oldid=3848418" నుండి వెలికితీశారు