ఆలూ టిక్కీ ఒక భారతీయ శాకాహార వంటకము. దీనిని ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఆరగిస్తుంటారు.

ఆలూ టిక్కీ
మింట్, చింతపండు చట్నీ, పెరుగు తో వడ్డింపబడిన ఆలూ టిక్కీ
మూలము
మూలస్థానంభారతదేశము, పాకిస్తాన్
ప్రదేశం లేదా రాష్ట్రంఉత్తర భారతదేశము, పంజాబ్
వంటకం వివరాలు
వడ్డించే ఉష్ణోగ్రతవేడి
ప్రధానపదార్థాలు బంగాళాదుంపలు , మసాలాలు
వైవిధ్యాలురగడ పట్టీస్

కావలసిన పదార్థాలు మార్చు

  • బంగాళదుంపలు - 3
  • క్యారెట్‌, బీన్స్‌
  • క్యాలీఫ్లవర్‌ - 100 గ్రాములు
  • జీలకర్ర - 1 టీ స్పూన్‌,
  • మిరియాల పొడి - పావు టీ స్పూన్‌
  • పసుపు - అర టీ స్పూన్‌,
  • అల్లం - 50 గ్రాములు
  • చాట్‌ మసాలా - పావు టీ స్పూన్‌
  • కొత్తిమీర - 1 కట్ట,
  • పుదీనా - 1 కట్ట
  • ఉప్పు - సరిపడా,
  • కారం - తగినంత,
  • నూనె - తగినంత

తయారీ మార్చు

  1. బంగాళదుంపలను ఉడికించి మెత్తగా మెదపాలి.
  2. క్యారెట్‌, బీన్స్‌, క్యాలీఫ్లవర్‌లను ఉడికించి వడగట్టి బంగాళ దుంప ముద్దలో కలపాలి.
  3. అందులో జీలకర్ర, ఉప్పు, కారం, మిరియాల పొడి, అల్లం, కొత్తిమీర, పుదీనా కలపాలి.
  4. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి కొద్దిగా అదమాలి.
  5. వీటిని పెనంమీద నూనెతో కాల్చుకుని పైన చాట్‌ మసాలా చల్లాలి.