ఇండిగో ఎయిర్ లైన్స్

భారతీయ విమానయాన సంస్థ

ఇండిగో ఎయిర్ లైన్స్ భారత దేశానికి చెందిన చౌక విమానయాన సంస్థ.

ఇండిగో (IndiGo)
IATA
6E
ICAO
IGO
Callsign
IFLY
స్థాపితము2006
కార్యకలాపాల ప్రారంభం15 August 2006
Hubs
Secondary hubs
దృష్టి సారించిన నగరాలు
Fleet size308
గమ్యస్థానములు101
మాతృసంస్థInterGlobe Enterprises
ప్రధాన కార్యాలయముGurgaon, Haryana, India
కీలక వ్యక్తులుRahul Bhatia (entrepreneur)
ఆదాయముIncrease 111.17 బిలియను (US$1.4 billion) (2014)[1]
స్థూల ఆదాయమ్Increase 3.17 బిలియను (US$40 million) (2014)[1]
వెబ్‌సైటుwww.goindigo.in

ఇండిగో భారతదేశంలోని బడ్జెట్ ఎయిర్ లైన్ సంస్థ. గుర్గావ్ లో దీని ప్రధాన కేంద్రం ఉంది. భారతదేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందతున్న ఇండిగో 2014 డిసెంబరు నాటికి 36.1% వాటా కలిగిన అతి పెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఎదిగింది.[2] దీని ప్రాథమిక స్థావరం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన 91 విమానాలను ప్రస్తుతం ఈ సంస్థలో ఉన్నాయి.

చరిత్ర మార్చు

ఇంటర్ గ్లోబ్ ఎంటర్ ప్రైజెస్ కు చెందిన రాహుల్ భాటియా, అమెరికాకు చెందిన ప్రవాస భారతీయుడైన (ఎన్.ఆర్.ఐ) రాకేష్ ఎస్. గాంగ్వాల్ కలిసి 2006 తొలి నాళ్లలో ఇండిగో సంస్థను స్థాపించారు. ఇంటర్ గ్లోబ్ సంస్థకు ఇండిగోలో 51.12% వాటా, గాంగ్వాల్ కు చెందిన వర్జీనియా-కేంద్రంగా ఉన్న సేలం ఇన్వెస్టిమెంట్ కంపెనీకి 48% వాటా ఉన్నాయి.[3]

ఇండిగోతన కార్యకలాపాలను 2006 ఆగస్టు 4లో ఢిల్లీ నుంచి గౌహతీ మీదుగా ఇంఫాల్ వరకు ప్రారంభించింది. డిసెంబరు 2010 నాటికి ఇండిగో సంస్థ ఎయిర్ ఇండియాను అధిగమించి భారత్ లో మూడో అతిపెద్ద ఎయిర్ లైన్ సంస్థగా ఆవిర్భవించింది. అత్యధిక లాభాలు గడించే ఏకైక విమాన సంస్థగా ఫిబ్రవరి 2012 నాటికి ఇండిగో గుర్తింపు పొందింది. 2012 ఆగస్టు 17 నాటికి 27 శాతం మార్కెట్ వాటాతో భారత్ లో అతి పెద్ద ఎయిర్ లైన్ గా గుర్తింపు సాధించింది. ఇది మొత్తం భారత వైమానిక మార్కెట్ వాటాలో నాలుగో వంతు కావడం అదీ కూడా కేవలం 6 సంవత్సరాల్లోనే ఇండిగో ఘనత సాధించడం విశేషం.[4]

గమ్యాలు మార్చు

భారతదేశంతో పాటు ఇతర దేశాల్లోని 37 కేంద్రాల నుంచి ప్రతిరోజు 550 విమానాలతో ఇండిగో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.[5] సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి ఐదేళ్లు పూర్తైన సందర్భంగా 2011 జనవరిలో అంతర్జాతీయ విమానాలు నడిపేందుకు ఇండిగో సంస్థకు లైసెన్స్ లభించింది. ఇండిగో మొదటి అంతర్జాతీయ విమానాన్ని న్యూ ఢిల్లీ-దుబాయ్ ల మధ్య 2011 సెప్టెంబరు 1లో ప్రారంభించింది.[6] ఆ తర్వాత కొద్ది వారాలకే తన సేవలను ఢిల్లీ, ముంబయి కేంద్రాల నుంచి బ్యాంకాక్, సింగపూర్, మస్కట్, ఖాట్మండులకు విస్తరించింది.[7] ప్రస్తుతం ఇండిగో అంతర్జాతీయ విమానాలను చెన్నై, బెంగళూరు, కొచ్చిన్, కొల్ కతా నగరాల నుంచి కూడా నడిపిస్తోంది.

విమానాలు మార్చు

ఇండిగో కేవలం ఎయిర్ బస్ A320 కుటుంబానికి చెందిన విమానాలను మాత్రమే నడిపిస్తోంది. ఈ సంస్థ పాత విమానాలను ఎప్పటికప్పుడు మారుస్తుంటుంది. 2015, ఫిబ్రవరి 6 నాటికి ఇండిగో నడిపిస్తోన్న వాటిలో 91 విమానాల సగటు విమాన వయస్సు కేలం 2.9 సంవత్సరాలు మాత్రమే.[8]

 
ఇండిగో ఎయిర్ లైన్స్, విమానం

ప్రత్యేకత మార్చు

ఇండిగోను ప్రత్యేకంగా గుర్తించేందుకు వీలుగా ఎక్కువగా ఊదారంగు (ఇండిగో), తెలుపు రంగుతో విమానాలను డిజైన్ చేస్తారు. విమానరెక్కల అడుగుబాగంలో ఆకాశ నీలిరంగుతో కూడిన చారలు పెయింటింగ్ చేస్తారు. విమాన పై భాగంలో తెలుపు రంగు బ్యాక్ గ్రౌండ్ లో విమానసంస్థ పేరు “ఇండిగో” అనే ఊదారంగు అక్షరాలతో రాసి ఉంటుంది. విమానాల ముక్కు భాగంలో చుక్కలతో కూడిన గీతల నిర్మాణం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇండిగో అధికారిక వెబ్ సైట్ అడ్రస్ అయిన goindiGo.in అనే అక్షరాలను విమాన ఇంజన్లపై ఉదారంగు బ్యాక్ గ్రౌండ్ లో రాస్తారు. విమాన గరిమనాభి ప్రాంతంలో ఎయిర్ లైన్ లోగోను ముద్రిస్తారు.

సేవలు మార్చు

అతి చవకైన విమానసంస్థగా పేరున్న ఇండిగో విమానాల్లో కేవలం సాధారణ తరగతి సీట్లు మాత్రమే ఉంటాయి. అదేవిధంగా రేట్లు తక్కువగా ఉన్నందున ఎలాంటి కాంప్లిమెంటరీ భోజనాన్ని కూడా ఇండిగో విమానాల్లో అందించరు. అయితే కార్పోరేట్ ప్రయాణీకుల కోసం ఇండిగో కార్పోరేట్ ప్రోగ్రామ్ ను అందుబాటులో ఉంచారు. ఇందులో భాగంగా ప్రీ-అస్సైన్డ్ సీట్లు, భోజనం లాంటి సదుపాయాలు కల్పిస్తారు.

అవార్డులు-విజయాలు మార్చు

ఇండిగో ఈ క్రింది అవార్డులు గెలుచుకుంది: చవకైన ప్రయాణాన్ని అందించే ఉత్తమ ఎయిర్ లైన్ సంస్థగా... 2007లో ఎయిర్ లైన్ ప్యాసింజర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అవార్డుతో పాటు 2008లో గెలీలియో ఎక్స్ ప్రెస్ ట్రావెల్ అవార్డ్, 2009, 2013 సంవత్సరాల్లో ఆవాజ్ యొక్క ట్రావెల్ అవార్డ్., 2010, 2011, 2012, 2013, 2014 సంవత్సరాల్లో స్కైట్రాక్స్ అవార్డులు అందుకుంది.[9] ది ఎయిర్ లైన్ ఆఫ్ ది ఇయర్ (భారత్) అవార్డును GMR గ్రూపు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అందుకుంది.

మూలాలు మార్చు

  1. 1.0 1.1 "IndiGo's FY14 profit more than halves to Rs 317 crore against Rs 787 crore". The Economic Times. 8 October 2014. Retrieved 8 October 2014.
  2. "ఇండిగో గత జెట్ పెద్ద ఎయిర్లైన్స్ అవుతుంది ఫ్లైస్". బిజినెస్ స్టాండర్డ్. 18 ఆగస్టు 2012. Archived from the original on 2015-03-05.
  3. "ఆశ్చర్యం! ఇండిగో విదేశీ ఆధీనంలో దాదాపు సగం". హిందూస్తాన్ టైమ్స్. 11 మార్చి 2012. Archived from the original on 2015-03-05.
  4. "ఇండిగో ఫ్లైస్ పస్త జెట్ తో బెచొమె లార్జెస్ట్ ఎయిర్లైన్". 18 ఆగస్టు 2012.
  5. "ఇండిగో లున్చేస్ 8 న్యూ ఫ్లిఘ్త్స్; ఇంచ్రెఅసెస్ ఫ్లిఘ్త్స్ బెత్వీన్ మెత్రోస్". ఫిర్స్త్పోస్ట్ బిజినెస్. 2 మార్చి 2013.
  6. "ఫిర్దౌస్ హషీమ్ (2011 సెప్టెంబరు 2). "ఇండిగో దాని మొదటి అంతర్జాతీయ విమానంలో బాబు"". స్వయంకృతాపరాధం.
  7. ""ఇండిగో 1 సెప్టెంబర్ అంతర్జాతీయ సేవలను ప్రారంభించటానికి"". ఫ్లిఘ్త్గ్లోబాల్.కం. 22 August 2011. Archived from the original on 21 సెప్టెంబరు 2013.
  8. "ఇండిగో ఎయిర్లైన్స్". చ్లెఅర్త్రిప్.కం.
  9. ""ఇండిగో శ్క్య్త్రక్ష్ అవార్డులు గెలుచుకున్నారు"". బిజినెస్ స్టాండర్డ్.

బయటి లంకెలు మార్చు