ఇందు గోస్వామి భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2020లో హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2]

ఇందు గోస్వామి

రాజ్యసభ సభ్యురాలు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
10 ఏప్రిల్ 2020 - 9 ఏప్రిల్ 2026
ముందు విప్లవ్ ఠాకూర్
నియోజకవర్గం హిమాచల్ ప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-04-12) 1967 ఏప్రిల్ 12 (వయసు 57)
గంఖేటర్ గ్రామం, బైజ్‌నాథ్‌, హిమాచల్ ప్రదేశ్
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
సంతానం 1
పూర్వ విద్యార్థి హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ[1]

రాజకీయ జీవితం మార్చు

ఇందు గోస్వామి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987-90 వరకు అఖిల భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, 1992లో బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శిగా పని చేసింది. ఆమె 1994 నుండి 1996 వరకు భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, బీజేపీ యువమోర్చా ఉపాధ్యక్షురాలిగా, 2000 నుండి 2003 వరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు చైర్‌పర్సన్‌గా, 2013లో రాష్ట్ర కార్యదర్శిగా వివిధ హోదాల్లో పని చేసింది. ఇందు గోస్వామి 2017లో జరిగిన శాసనసభ ఎన్నికలలో పాలంపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి ఆశిష్ బుటైల్ చేతిలో ఓడిపోయింది. ఆమె 2013 నుండి 2016 వరకు రాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా పని చేసింది.[3]

ఇందు గోస్వామి 2020లో హిమాచల్ ప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైంది.[4]

మూలాలు మార్చు

  1. "Indu Bala Goswami| National Portal of India".
  2. Hindustan Times (12 March 2020). "Indu Goswami is BJP's Rajya Sabha nominee from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  3. The Indian Express (12 March 2020). "Rajya Sabha polls: BJP picks Indu Bala Goswami from Himachal, set to wrest seat from Cong" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.
  4. India Today (18 March 2020). "BJP's Indu Goswami elected to Rajya Sabha from Himachal Pradesh" (in ఇంగ్లీష్). Archived from the original on 6 May 2024. Retrieved 6 May 2024.