ఇప్పపువ్వు లడ్డు

ఇప్ప పువ్వు లడ్డు, తెలంగాణ రాష్ట్రం , ఆదిలాబాద్ జిల్లా , ఉట్నూరు ప్రాంతంలో ఆదివాసీ మహిళలు తయారు చేసే తినుబండారం. [1]ఆదివాసీ ప్రాంతంలో గోండి భాషలో ఈరుక్ లడ్డు,  కొలామీ భాషలో పొక్కే లడ్డు అని అంటారు.[2] [3]

ఇప్పపువ్వు లడ్డు
మూలము
ఇతర పేర్లుఈరుక్ లడ్డు ,పొక్కే లడ్డు,ఇప్పపువ్వు లడ్డు
మూలస్థానంభారతదేశం
ప్రదేశం లేదా రాష్ట్రంతెలంగాణ రాష్ట్రం, ఉట్నూరు ప్రాంతం
వంటకం వివరాలు
ప్రధానపదార్థాలు 1.ఇప్పపూలు,

2. వేరుశనగ, 3.యాలకులు, 4. బెల్లం, 5. నూనె

6.బాదం,

ఇప్పపువ్వు సేకరణ మార్చు

ఇప్ప పువ్వులు వేసవికాలంలో లభిస్తుంటాయి. మహిళలు వేకువజామున వెదురు బుట్టలతో అడవికి వెళ్లి ఇప్పపువ్వులను సేకరించి ఇంటికి తీసుకొచ్చి తడుక పై ఎండలో రెండు రోజులు ఆరబెట్టి సంచిలో జమ చేసి ఉంచుతారు.తరువాత ఇప్ప పువ్వులతో రకరకాల వంటకాలు తయారు చేస్తుకుంటారు.[4]

ఇప్పపువ్వు లడ్డు తయారీ విధానం మార్చు

ఇప్ప పువ్వులను ఆరబెట్టి ముందుగా నూనెలో వేయించి తీసి గ్రాండర్ లో మెత్తగా పొడి చేస్తారు. అనంతరం ఈ ఇప్పపువ్వు చూర్ణాన్ని, కొంత వేరుశనగలు పల్లిలు, యాలకులు, బాదం, కాజులను కలిపి చూర్ణం చేసి బెల్లం పానకంలో కలిపి లడ్డులను తయారు చేస్తున్నారు. ఇప్ప పువ్వు లడ్డులను ఆర్డర్లు ఉన్న చోట బాక్సులలో భద్రపర్చి విక్రయిస్తున్నారు. రూ.400 కీలో లడ్డుల ధర ఉంటుంది. ఈ లడ్డు తినడానికి ఎంతో కమ్మగా రుచికరంగా ఉంటుంది.[5]

కావాల్సిన పదార్థాలు మార్చు

  1. ఇప్ప పువ్వులు
  2. వేరుశనగలు
  3. యాలకులు
  4. బాదం
  5. బెల్లం

కుటీర పరిశ్రమ మార్చు

సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ  (ఐటీడీఏ) ఉట్నూరు, సహకారంతో 2015  సంవత్సరంలో 12 మంది మహిళలు, భీంబాయి ఆదివాసీ మహిళ సంఘం ఏర్పాటు చేసి  ఇప్పపువ్వు లడ్డు తయారీకి కావాల్సిన పరికరాలకు  రూ.10 లక్షల యూనిట్ తో సామగ్రిని కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్డులో ఆదివాసీ ఆహారం పేరుతో కుటీర పరిశ్రమను  ప్రారంభించారు.[6] [7]

మూలాలు మార్చు

  1. telugu, NT News (2022-02-19). "Ippa puvvu laddu | ఇప్ప‌పూలతో చేసే ఈ ల‌డ్డూలు మ‌హిళ‌లు తింటే మంచిదేనా?". www.ntnews.com. Retrieved 2024-05-05.
  2. "ఈ లడ్డూలు తింటే మోకాళ్ల నొప్పులు ఖతం.. ఒంట్లో రక్తం ఉరకలేస్తుంది!". News18 తెలుగు. 2024-03-20. Retrieved 2024-05-05.
  3. "ఇప్పపువ్వు లడ్డూ కావాలా." EENADU. Retrieved 2024-05-05.
  4. Dishanational2 (2022-04-22). "Ippa Puvvu Laddu: ఆదివాసీల స్పెషల్.. ఇప్ప పువ్వుతో లడ్డు". www.dishadaily.com. Retrieved 2024-05-05.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  5. "ఇప్ప పువ్వు లడ్డు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే". News18 తెలుగు. 2024-02-26. Retrieved 2024-05-05.
  6. సాక్షి (2024-04-05), ఉపాధి లడ్డు!, retrieved 2024-05-05
  7. Chilukuri, Arun (2022-05-02). "Ippa Puvvu Laddu: గర్భిణీ స్త్రీల ఆహార డైట్ లో ఇప్పపూవ్వు లడ్డూ". www.hmtvlive.com. Retrieved 2024-05-05.