ఇవటూరి విజయేశ్వరరావు

సంగీత విద్వాంసులు

ఇవటూరి విజయేశ్వరరావు ప్రముఖ వాయులీన విద్వాంసులు.[1]

ఇవటూరి విజయేశ్వరరావు
ఇవటూరి విజయేశ్వరరావు
వ్యక్తిగత సమాచారం
జననం(1938-05-25)1938 మే 25
విశాఖపట్నం
మరణం2014 అక్టోబరు 19(2014-10-19) (వయసు 76)
సంగీత శైలికర్ణాటక సంగీతం, భారతీయ సంగీతం
వృత్తిVocalist, Violinist
వాయిద్యాలువయోలిన్, వయోల
ముఖ్యమైన సాధనాలు
వయోలిన్

జీవిత విశేషాలు మార్చు

విజయేశ్వరరావు అచ్చిరాజు, రాజేశ్వరి దంపతులకు 1938 మే 25విశాఖపట్నం లో జన్మించారు. బాల్యం నుంచి సంగీతంపై మక్కువ పెంచుకున్న విజయేశ్వరరావుకు ఆయన తల్లిదండ్రులు కర్ణాటక సంగీతంలో శిక్షణ ఇప్పించారు. వయోలిన్‌, గాత్రం రెండింటా పాండిత్యం సంపాదించిన విజయేశ్వరరావు వాయులీన విద్వాంసుడిగా కర్ణాటక సంగీత ప్రపంచానికి సుపరిచితులు. ఈయన జీవితం మూడు సంగీత కార్యక్రమాలతో ముడిపడి ఉంది. అవి అధ్యయనం, ప్రదర్శన, అధ్యాపనం. ఆయన మహారాజ కళాశాల,విజయనగరం లో 1947 లో తన తొమ్మిదవ యేట వయోలిన్ శిక్షణ కోసం చేరారు. తరువాత ఆయన 12 సంవత్సరాలపాటు శిక్షణను ద్వారం వెంకటస్వామి నాయుడు శిష్యరికంలో కొనసాగించారు. ఆయన 1965 లో ఆంధ్ర విశ్వవిద్యాలయం సంగీతం (వయోలిన్) నందు డిప్లొమా పొందారు. ద్వారం వెంకటస్వామి నాయుడి ప్రైజ్ ను అచట పొందారు. తన పన్నెండవ యేట 1950 లో సంగీత ప్రదర్శనలిచ్చుట ప్రారంభించి అనేక బిరుదులు, అవార్డులు పొందారు. 1970-74 మధ్య కాలికట్‌ ఆకాశవాణి కేంద్రంలో నిలయ విద్వాంసుడిగా పనిచేశారు. 1986లో ‘ఎ’ గ్రేడ్‌ విద్వాంసుడి హోదా సంపాదించారు. 1992 వరకూ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయ విద్వాంసుడిగా సేవలందించి స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఇవటూరిని గౌరవ ప్రొఫెసర్‌గా నియమిస్తూ ఏయూ నిర్ణయం తీసుకుంది.ఆయన 1995-96 వరకు ప్రొఫెసర్ గా పనిచేసారు.[2] ఆయన ఆల్ ఇండియా రేడియో లో అనేక "సంగీత శిక్షణ" కార్యక్రమాలను కూడా నిర్వహించారు. ఆయన సంగీత శిక్షకునిగా తన 14 వ యేట నుండి శిష్యులకు బోధించుట ప్రారంభించారు. ఆయన విజయనగరం లో ద్వారం వెంకటస్వామి నాయుడు మెమోరియల్ స్కూలు ను 1961 లో ప్రారంభించారు. ఆ పాఠశాల నుండి అనేకమంది ప్రసిద్ధ సంగీతకారులను తయారుచేసారు. ఆయన 1974 లో కాలికట్ నుండి వచ్చిన తరువాత సంగీత ఉద్యమంలో అనేక ప్రక్రియలను ప్రారంభించారు. వాటిలో బోధన, ప్రసిద్ధ సంగీతకారుల సంగీత రికార్డులతో కూడిన సంగీత గ్రంథాలయం, నెలవారీ సంగీత సభలు నిర్వహణ, ఆయన గృహం సంగీత విజ్ఞాన సర్వస్వంగా తీర్చిదిద్దుట. ఆయన శిష్యులు దేశ విదేశాలలో విశేష కీర్తినార్జించారు.

ఈయన 75 వ జన్మదినాన్ని ఆయన అభిమానులు విశాఖపట్నం లోని కళాభారతి లో నిర్వహించారు.[3]

ఆయన అక్టోబరు 19 2014 న మరణించారు.[4]

అవార్డులు, గౌరవ సత్కారాలు మార్చు

  • 1986: "వాయులీన విద్యా ప్రవీణ" (సంగీత కళా సమితి ద్వారా)
  • 1997 : వరల్డ్ టీచర్ ట్రస్టు ద్వారా మాస్టర్ ఎం.ఎన్.అవార్డు.
  • 2000 : శ్రీ శంకర్ మఠ్, విశాఖపట్నం వారిచే :సింహతలాటం" అవార్డు.
  • 2000 : శంకర్ మఠ, విశాఖపట్నం వారిచే "వాయులీన సుధాకర" అవార్డు.
  • శ్రీ విజయత్యాగరాజ సంగీత సభ, విశాఖపట్నం వారిచే బంగారు పతకం.
  • 1996 : పారుపల్లి రామకృష్ణ పంతులు సంగీత సమాఖ్య, విజయవాడ వారిచే "నాద భగీరథ" బిరుదు.
  • 1997 : విజయత్యాగరాజ సభ, విశాఖపట్నం వారిచే "నాద సుధానిధి" బిరుదు.
  • శ్రీ శ్రీ శ్రీ మహాకామేశ్వరి సహిత శ్రీ లలితా పరభట్టారిక పీఠం, విశాఖపట్నం వారిచే "మహాకామేశ్వరి పురస్కారం"
  • 2005 : విశాఖ సంగీత అకాడమీ, విశాఖపట్నం వారిచే "సంగీత కళా సాగర" అవార్డు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున 2009లో అప్పటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య చేతులమీదుగా రాజీవ్‌ప్రభ పురస్కార్‌ అందుకున్నారు.[5] ఇవటూరి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 2011లో ప్రతిభా రాజీవ్ పురస్కారంతో సన్మానించింది.[6] తెలుగు కవిత్వం, లలిత కళలు, అవధానం తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన 11 మంది ప్రముఖులతో పాటు ఈయనకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రతిభాపురస్కారాలను ప్రకటించింది.[7]

వీరి శిష్యులలో ప్రసిద్ధులు మార్చు

మూలాలు మార్చు

  1. Ivaturi Vijayeswara Rao (1938-0000)[permanent dead link]
  2. "Department of Music Profile". Archived from the original on 2015-06-19. Retrieved 2015-05-26.
  3. Saluting a guru non-pareil
  4. Ivaturi passes away[permanent dead link]
  5. వాయులీన విద్వాంసుడు ‘ఇవటూరి’ కన్నుమూత (19-Oct-2014) [permanent dead link]
  6. వయొలిన్ విద్వాంసులు ఇవటూరి కన్నుమూత[permanent dead link]
  7. సినారెకు తెలుగు వర్శిటీ విశిష్ట పురస్కారం[permanent dead link]

ఇతర లింకులు మార్చు