ఇషితా వ్యాస్ ఒక భారతీయ టెలివిజన్, చలనచిత్ర నటి. ఆమె రియాలిటీ టెలివిజన్ షో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ హంట్ 2013లో మొదటి ఏడు స్థానాల్లో నిలిచింది. ఆమెను వృత్తిపరంగా మంజు వ్యాస్ పేరుతో పిలుస్తారు.

ఇషితా వ్యాస్
జననం
మంజు వ్యాస్
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2010–ప్రస్తుతం

కెరీర్ మార్చు

ఇషితా వ్యాస్ మోడల్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆపై ఆమె నటన వైపు మొగ్గు చూపింది. ఆమె మొదటి ప్రాజెక్ట్ యష్ రాజ్ ఫిల్మ్స్ టాక్ షో లిఫ్ట్ కర దే. కార్యక్రమం ప్రసారం అయిన వెంటనే, ఝాన్సీ కి రాణి సీరియల్ లో 1857 నాటి భారతీయ తిరుగుబాటులో ముఖ్యమైన పాత్ర పోషించిన భారతీయ మహిళా కోలీ సైనికురాలు ఝల్కారీబాయి పాత్రలో నటించే అవకాశం ఆమెకు లభించింది.[1][2] ఆమె ఝల్కారీబాయి పాత్ర బాలీవుడ్, టెలివిజన్ పరిశ్రమలో విస్తృతమైన ప్రశంసలకు దారితీసింది. ఆమె జాన్ మాథ్యూ మత్తన్‌తో కలిసి కామధేను స్టీల్ కోసం ఒక చిత్రంలో కూడా నటించింది.

ఫిల్మోగ్రఫీ మార్చు

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర నోట్స్
2010 పీప్లీ లైవ్ అక్షిత రిపోర్టర్
2010 మరియమ్ ఇషా ప్రధాన పాత్ర
2011 బీట్ సునీత ప్రధాన పాత్ర
2012 OMG: ఓ మై గాడ్! జెన్నీ సర్దేశాయ్ (మహేష్ మంజ్రేకర్) అసిస్టెంట్
2013 కమాండో నటాషా ఛానల్ రిపోర్టర్/ఇంటెలిజెన్స్ హెడ్
2015 గబ్బర్ ఈజ్ బ్యాక్ వీణ
2015 మిస్ లీలావతి లీలావతి తెలుగు సినిమా
2015 మజిలీ సుందర రాణి తెలుగు సినిమా (అతిథి పాత్ర)
2015 తేజాబ్ 2 ప్రధాన పాత్ర
2016 ముకుంద మురారి గోపికా మాతే కన్నడ సినిమా
2017 చక్రవర్తి ఐటం డాన్సర్ కన్నడ చిత్రం (అతిథి పాత్ర)
2020 11:40 ప్రధాన లీడ్ హిందీ చిత్రం (ప్రధాన పాత్ర)

మూలాలు మార్చు

  1. Sharma, Ashok Kumar (2017). Our President: Ram Nath Kovind. Diamond Pocket Books Pvt Ltd. p. 14. ISBN 9789352783953.
  2. "वीरांगना झलकारी बाई". m-hindi.webdunia.com. Retrieved 7 November 2018.