ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో (పాట)

(ఈ దుర్యోధన దుశ్శాసన నుండి దారిమార్పు చెందింది)

ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాట 1985లో విడుదలైన ప్రతిఘటన చిత్రంలోని పాట. ఈ పాట రాసినందుకు వేటూరి సుందరరామ్మూర్తి కి రాష్ట్రస్థాయిలో ఉత్తమ గీత రచయితగా నంది బహుమతి వచ్చింది. కె. చక్రవర్తి సంగీతం అందించిన ఈ పాటను ఎస్. జానకి పాడింది.[1]

"ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో"
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో పాటలోని దృశ్యం
రచయితవేటూరి సుందరరామ్మూర్తి
సంగీతంకె. చక్రవర్తి
సాహిత్యంవేటూరి సుందరరామ్మూర్తి
ప్రచురణప్రతిఘటన (1985)
రచింపబడిన ప్రాంతంఆంధ్రప్రదేశ్
భాషతెలుగు
గాయకుడు/గాయనిఎస్. జానకి
చిత్రంలో ప్రదర్శించినవారువిజయశాంతి

పాట నేపథ్యం మార్చు

ఇందులో కథానాయిక విజయశాంతి కాలేజీ లెక్చరర్. కొందరు విద్యార్థులు క్లాసురూంలో బ్లాక్ బోర్డుపై స్త్ర్హీ బొమ్మల్ని నగ్నంగా చిత్రిస్తారు. క్లాసులోకి వచ్చిన విజయశాంతి ఆ బొమ్మలు చూసి కోపంతో స్త్ర్హీ ఔన్నత్యాన్ని విద్యార్థులకు వివరించే సందర్భంలో రాసిన పాట.

పాటలోని సాహిత్యం మార్చు

పల్లవి:
ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం

చరణం 1:
పుడుతూనే పాలకేడ్చి పుట్టీ జంపాలకేడ్చి
పెరిగి పెద్దకాగానే ముద్దూమురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై
కుటిలకామ మేచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహాభారతం… ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం

పురస్కారాలు మార్చు

  1. వేటూరి సుందరరామ్మూర్తి - ఉత్తమ గీత రచయితగా నంది పురస్కారాలు - 1985.

మూలాలు మార్చు

  1. సితార, పాటల పల్లకి. "వాగ్దేవి వర పారిజాతాలు...వేటూరి గీతాలు". www.sitara.net. Archived from the original on 22 December 2020. Retrieved 22 December 2020.

ఇతర లంకెలు మార్చు

  1. వేటూరి వెబ్ సైట్ లో పాట గురించిన వ్యాసం
  2. యూట్యూబ్ లో పాట వీడియో