ఉంగరాల రాంబాబు 2017 సెప్టెంబరు 15న విడుదలైన తెలుగు సినిమా. సునీల్, మియా జార్జ్, పోసాని కృష్ణమురళి, ప్రకాష్ రాజ్, ఆలీ, ఇతర నటులు ఈ చిత్రంలో నటించారు.[1]

ఉంగరాల రాంబాబు
(2017 తెలుగు సినిమా)

ఉంగరాల రాంబాబు చిత్ర గోడ ప్రచార చిత్రము
దర్శకత్వం క్రాంతి మాధవ్
నిర్మాణం పరుచూరి కిరీటి
తారాగణం సునీల్,
మియా జార్జ్ ,
పోసాని కృష్ణమురళి,
ప్రకాష్ రాజ్,
ఆలీ
సంగీతం జిబ్రాన్
ఛాయాగ్రహణం శ్యామ్ కె. నాయుడు
భాష తెలుగు

కథ మార్చు

కోటీశ్వరుడైన రాంబాబు (సునీల్) తన తాత మరణంతో ఆస్తులన్ని కోల్పోయి రోడ్డున పాడతాడు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్న రాంబాబుకు జనాల్ని మోసం చేస్తూ బతికే దొంగ బాబా బాదం బాబా (పోసాని కృష్ణమురళి) ఆశ్రమం కనిపిస్తుంది. రాంబాబును చూసిన బాదం బాబా నేను చెప్పినట్టు చేస్తే నీ డబ్బు నీకు తిరిగొస్తుందని చెబుతాడు. అలా బాదం బాబా చెప్పిన పనికి వెళ్లిన రాంబాబుకు భారీగా బంగారం దొరుకుతుంది. దీంతో బాబా మీద నమ్మకం మరింత పెరుగుతుంది. జాతకాల మీద విపరీతమైన నమ్మకంతో రాంబాబు ఉంగరాల రాంబాబుగా మారిపోతాడు.

అయితే తిరిగి కోటీశ్వరుడైన రాంబాబుకు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడేసే జాతకం ఉన్న అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలని బాబా చెప్తాడు. దీంతో బాబా చెప్పిన జాతకం కలిగిన సావిత్రి (మియా జార్జ్)ను ప్రేమిస్తాడు. అలా డబ్బు కోసం ప్రేమలో పడ్డ రాంబాబు అనుకున్నది సాధించాడా.? సావిత్రిది నిజంగా బాబా చెప్పిన జాతకమేనా? వారి ప్రేమ గెలిచిందా? అన్న విషయాలు ప్రధానంగా కథ సాగుతుంది.

తారాగణం మార్చు

పాటల జాబితా మార్చు

అల్లరి పిల్ల గాధా , రచన: రెహమాన్ , గానం.ధనుంజయ్, చిన్మయి

హైటెన్షన్ తీగ , రచన: రామజోగయ్య శాస్త్రి,గానం. అనుదీప్ దేవ్

నువ్వే నా అదృష్టం , రచన: రెహమాన్, గానం .ఎల్.వి.రేవంత్ , చిన్మయి

హూ లా లా హూ లా లా , రచన: రెహమాన్ , గానం.యాజిన్ నిజార్ , ధనుంజయ్

ముగలై బిరియాని , రచన: రామజోగయ్య శాస్త్రి , గానం.హేమచంద్ర , గీతా మాధురి .

సాంకేతికవర్గం మార్చు

మూలాలు మార్చు

బాహ్య లంకెలు మార్చు