ఉజిగామి (Ujigami ) "కుల దైవం /దైవత్వం /ఆత్మ " ) జపాన్‌లోని షింటో మతానికి చెందిన, ఒక నిర్దిష్ట ప్రదేశాన్ని సంరక్షించే దేవుడు లేదా ఆత్మ. ఉజిగామిని , అనారోగ్యం నుండి రక్షణ కోసం, ప్రయత్నాలలో విజయానికి, మంచి పంటల కోసం, ఇలా అనేక సహాయలు కోరుతూ ప్రార్థిస్తారు. [1]

చరిత్ర మార్చు

 
ఉజీ లోని ఉజిగామి పుణ్యక్షేత్రం

ఉజిగామిని ఎనిమిదవ శతాబ్దం నుండి మాత్రమే విశ్వసించడం ప్రారంభమైంది. [2]

ఉజిగామి అనే పదాన్ని దాని ప్రస్తుత రూపంలో, అనేక ఇతర రకాల షింటో దేవతలను వివరించడానికి ఉపయోగిస్తున్నారు. వాస్తవానికి, ఉజిగామి అనే పదం కుటుంబ దేవుడి సూచనగా వాడుకలో ఉంది. [3] మొదట, తాత్కాలిక బలిపీఠాల వద్ద ఈ దేవతల పూజలు ప్రారంభం అయినట్టు నమ్ముతారు. [3] హీయన్ కాలం తరువాత, జపనీస్ మేనరికల్ వ్యవస్థ ప్రారంభమైంది. ప్రభువులు, యోధులు, దేవాలయాలకు వారి స్వంత భూములు చేకూరాయి. కుటుంబ ఆధారిత సమాజం వాడుక నుంచి తప్పుకోవడంతో ఉజిగామిపై నమ్మకం సన్నగిల్లింది. దీనికి మారుగా, మానర్ల ప్రభువులు తమ భూముల రక్షణకి దేవతలను ప్రార్థించడం ప్రారంభించారు. ఈ సంరక్షక దేవతలను చింజు (chinju) లని పిలిచే వారు. మురోమాచి కాలంలో మేనోరియల్ వ్యవస్థ క్షీణించడం ప్రారంభించడంతోఉజిగామితో పాటు సంరక్షక దేవతలను దేవాలయాలలో ప్రతిష్టించారు. తాము పుట్టిన భూమికి దేవుడు ఉబుసునగామి (ubusunagami). కాలక్రమేణా, ఉబుసునగామి, చింజు వారి సంఘానికి హృదయ దేవతలుగా మారారు, క్రమంగా వారే ఉజిగామిగా పూజలందుకున్నారు. [4]

ఉజిగామిని పూజించే వ్యక్తిని ఉజికో అని వ్యవహరిస్తారు. [3]

ఇది కూడ చూడు మార్చు

ప్రస్తావనలు మార్చు

1.హెర్న్, లఫ్కాడియో (1913). జపాన్, వివరణ కోసం ఒక ప్రయత్నం. మాక్‌మిలన్.

2. కంస్ట్రా, J. H. (1967). ఎన్‌కౌంటర్ లేదా సింక్రెటిజం. జపనీస్ బౌద్ధమతం యొక్క ప్రారంభ పెరుగుదల.

3. హాల్, జాన్ విట్నీ (1991). ది కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ జపాన్: ఎర్లీ మోడరన్ జపాన్. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్. ISBN 0-521-22355-5.

4. టీయువెన్, మార్క్; బ్రీన్, జాన్; ఇనౌ, నోబుటకా; ఇటా, సతోషి (2003). షింటో, ఒక చిన్న చరిత్ర. సైకాలజీ ప్రెస్. ISBN 0-415-31179-9.

మరింత చదవడానికి మార్చు

  • హాంబ్రిక్, చార్లెస్ హెచ్. "జపాన్ యొక్క న్యూ రిలిజియస్ మూవ్‌మెంట్స్‌లో సంప్రదాయం, ఆధునికత." జపనీస్ జర్నల్ ఆఫ్ రిలిజియస్ స్టడీస్ 1 (1974): 217-52. JSTOR. వెబ్. 21 సెప్టెంబర్ 2010.
  • టీయువెన్, మార్క్, జాన్ బ్రీన్, ఇటో సతోషి. "షింటో అండ్ ది పాపులేస్: ది స్ప్రెడ్ ఆఫ్ రిట్యువల్ అండ్ టీచింగ్స్." షింటో, ఎ షార్ట్ హిస్టరీ. న్యూయార్క్: న్యూయార్క్ టేలర్ & ఫ్రాన్సిస్, 2003. 126. నెట్ లైబ్రరీ. వెబ్. 21 సెప్టెంబర్ 2010.
  • హిరోషి, ఇవై. "జానపద మతంలో కామి: ఉజిగామి." ఎన్సైక్లోపీడియా ఆఫ్ షింటో - హోమ్. కొకుగాకుయిన్ విశ్వవిద్యాలయం, 13 మార్చి. 2005. వెబ్. 21 సెప్టెంబర్ 2010.
  • "మతం, ఆధ్యాత్మిక అభివృద్ధి: జపాన్." మార్షల్ ఆర్ట్స్ ఆఫ్ ది వరల్డ్. శాంటా బరాబరా: ABC-CLIO, 2001. క్రెడో రిఫరెన్స్. వెబ్. 7 అక్టోబర్ 2010
  • ఇయర్‌హార్ట్, బ్రయాన్ హెచ్. "ఎ బ్రాంచ్ మీటింగ్ ఇన్ సబర్బన్ టోక్యో: "ఐ" బ్రాంచ్ ." గెడాట్సు-కై అండ్ రిలీజియన్ ఇన్ కాంటెంపరరీ జపాన్ : రిటర్న్ంగ్ టు ద సెంటర్. బ్లూమింగ్టన్ ఇండియానా UP, 1989. 122-27. నెట్ లైబ్రరీ. వెబ్. 21 సెప్టెంబర్ 2010.

మూలాలు మార్చు

  1. Hearn, Lafcadio (1913). Japan, an attempt at interpretation. Macmillan.
  2. Kamstra, J. H. (1967). Encounter or syncretism. The initial growth of Japanese Buddhism.
  3. 3.0 3.1 3.2 Hall, John Whitney (1991). The Cambridge History of Japan: Early modern Japan. Cambridge University Press. ISBN 0-521-22355-5.
  4. Teeuwen, Mark; Breen, John; Inoue, Nobutaka; Itō, Satoshi (2003). Shinto, a short history. Psychology Press. ISBN 0-415-31179-9.

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉజిగామి&oldid=3879254" నుండి వెలికితీశారు