ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం

అమెరికా, టెక్సస్ లోని డల్లాస్‌లో ఉన్న హిందూ దేవాలయం.

ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం, అమెరికా, టెక్సస్ లోని డల్లాస్‌లో ఉన్న హిందూ దేవాలయం. డల్లాస్-ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లో ఉన్న అనేక హిందూ దేవాలయాలలో ఇది ఒకటి.[1] 2002లో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల కోసం సెక్టారియన్ హిందూ దేవాలయంగా ప్రారంభించబడింది.

ఉత్తర టెక్సస్ హిందూ దేవాలయం
ప్రదేశం
దేశం:యునైటెడ్ స్టేట్స్
రాష్ట్రం:టెక్సస్
ప్రదేశం:డల్లాస్‌
అక్షాంశ రేఖాంశాలు:32°51′38″N 96°42′20″W / 32.860669°N 96.705475°W / 32.860669; -96.705475

చరిత్ర మార్చు

1992లో డల్లాస్-ఫోర్ట్ వర్త్ ఏరియాలోని ఇండో-కరేబియన్ ప్రవాస భారతీయులు, కరేబియన్ హిందూ అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్‌ను స్థాపించారు. ఈ సంస్థ 2002లో, చాంట్ డల్లాస్‌లోని ఓల్డ్ లేక్ హైలాండ్స్ నైబర్‌హుడ్‌లో ఒక పాత ప్రార్థనా మందిరాన్ని కొనుగోలు చేసి, ఇంటీరియర్‌ని పెయింట్ చేయించి, అనేక దేవతామూర్తిలను స్థాపించారు. 2002లో ఇది ప్రారంభించబడింది.

ఇతర వివరాలు మార్చు

2015, ఏప్రిల్ 15న మారా సాల్వత్రుచాకు చెందిన పలువురు సభ్యులు దేవాలయ తలుపులపై '666' అని గీయడం ద్వారా దేవాలయాన్ని ధ్వంసం చేశారు. దేవాలయ గోడలపై డెవిల్ ఆరాధనకు సంబంధించిన వివిధ చిహ్నాలను స్ప్రే చేశారు.[2] దాంతో దేవాలయం ప్రాంగణం చుట్టూ అనేక కెమెరాలను, భవిష్యత్తులో మరిన్ని దాడులు జరగకుండా నిరోధించడానికి చుట్టూ కంచెను ఏర్పాటు చేసింది.[3]

రూపకల్పన మార్చు

ఈ దేవాలయం లోపలి భాగంలో మరికొన్ని హిందూ దేవతామూర్తులు ఉన్నాయి. వాటికి పీఠాలు లేవు కాబట్టి భక్తులు మూర్తిలను తాకి చూడవచ్చు.

ఛారిటీ మార్చు

దేవాలయానికి చెందిన యువత నార్త్ టెక్సాస్ ఫుడ్ బ్యాంక్ వంటి ప్రాంతంలో స్వచ్ఛంద సంస్థల కోసం వివిధ కార్యక్రమాలు చేస్తుంది.[4]

మూలాలు మార్చు

  1. "North Texas Hindu Mandir". dfwindia. Retrieved 2022-03-14.[permanent dead link]
  2. "Hindu Temple in Texas Vandalized with Graffiti". 20 April 2015. Archived from the original on 2020-02-06. Retrieved 2022-03-14.
  3. Lucia, Andrea (18 April 2015). "Hindu Temple Increasing Security After Temple Vandalized". dfw.cbslocal.com. Retrieved 2022-03-14.
  4. "North Texas Hindu Mandir". blog.smu.edu. Retrieved 2022-03-14.