ఎం.వి.సింహాచల శాస్త్రి

హరికథా కళాకారుడు

ముప్పవరపు వేంకట సింహాచల శాస్త్రి హరికథా కళాకారుడు.

ముప్పవరపు వేంకట సింహాచలశాస్త్రి
జననంమే 17, 1968
గుంటూరు
నివాస ప్రాంతంతిరుపతి
ప్రసిద్ధిహరికథా కళాకారుడు
తండ్రిముప్పవరపు కేశవరావు
తల్లిసుబ్బమ్మ

విశేషాలు మార్చు

ఇతడు 1968, మే 17వ తేదీన గుంటూరులో ఒక సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ముప్పవరపు కేశవరావు, సుబ్బమ్మ ఇతని తల్లిదండ్రులు. ఇతని తాత, నాన్నమ్మ ముప్పవరపు రామారావు, వెంకాబాయమ్మలు ఆయుర్వేద వైద్యులుగా పేదలకు ఉచితంగా వైద్యసేవలందించి పేరు గడించారు. ఇతడు కరూరు కృష్ణదాసు, వై.సుబ్రహ్మణ్యశాస్త్రి, బుర్రా శివరామకృష్ణ శర్మ, జి.ఎల్.వి.సుబ్బమ్మల వద్ద హరికథ చెప్పే విధానాన్ని నేర్చుకున్నాడు. ఇతడు ఆకాశవాణి మొదటి గ్రేడు కళాకారుడు. ఇతడు దేశంలో అనేక సంగీతోత్సవాలలో పాల్గొన్నాడు. ఇతడు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర సంగీత నాటక కళాశాలలో హరికథ అధ్యాపకునిగా పనిచేస్తున్నాడు. ఈ కళారంగంలో ఇతడి కృషికి గుర్తింపుగా ఆంధ్రపదేశ్ ప్రభుత్వం ఉగాది విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేసింది. 2006లో ఆదిభట్ల నారాయణ దాసు ఆరాధన సంఘం ఇతడిని హరికథా చూడామణి అనే బిరుదుతో సత్కరించింది.ఇంకా సంగీత సాహిత్య భూషణ, కళారత్న వాచస్పతి మొదలైన బిరుదులు ఇతడిని వరించాయి. 2008లో కంచి కామకోటి పీఠం ఇతడిని ఆస్థాన విద్వాంసునిగా నియమించింది. కేంద్ర సంగీత నాటక అకాడమీ ఇతనికి 2010లో అవార్డును ప్రకటించింది.[1]

మూలాలు మార్చు