ఎర్రబాలెం(క్రోసూరు)

ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం

"ఎర్రబాలెం(క్రోసూరు)" పల్నాడు జిల్లా, క్రోసూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

ఎర్రబాలెం
—  రెవెన్యూయేతర గ్రామం  —
ఎర్రబాలెం is located in Andhra Pradesh
ఎర్రబాలెం
ఎర్రబాలెం
అక్షాంశరేఖాంశాలు: 16°33′22″N 80°10′55″E / 16.556013°N 80.181927°E / 16.556013; 80.181927
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా పల్నాడు
మండలం క్రోసూరు
ప్రభుత్వం
 - సర్పంచి నర్రా వాసుదేవరావు
పిన్ కోడ్ 522410.
ఎస్.టి.డి కోడ్ 08640

గ్రామంలోని విశేషాలు మార్చు

ఈ గ్రామానికి చెందిన శ్రీ మందాల గోవిందరావు, నాగశేషమ్మ దంపతులు సామాన్య కుటుంబానికి చెందినవారు. అక్షరఙానం లేనివారు. ఆర్థిక ఇబ్బందులవలన, వీరు జీవనోపాధికోసం, గుంటూరు నగరానికి వలస వచ్చారు. వీరి కుమారుడు నరేశ్ కు చిన్నతనం నుండి చదువంటే అమితమైన ఇష్టం. ఇతనికి చదువుకోవాలని అభిలాష ఉన్నా, అనుకూలించని వాతావరణం. అయినా ఇతడు చిన్నతనం నుండియే కష్టపడే తత్వాన్ని అలవాటు చేసుకున్నాడు. పేపర్ బాయ్ గా పనిచేయుచూ, అమ్మా నాన్నల చిరువ్యాపారానికి చేయూతనందించుచూ, ఆర్థిక వనరులు సమకూర్చుకొని, ప్రభుత్వ పాఠశాలలలోనే చదువుచూ విద్యాభ్యాసం కొనసాగించుచూ, అంచెలంచెలుగా ఎదుగుతూ, ఎం.టెక్. 70% తోనూ, ఎం.సి.య్యే. 78% మార్కులతోనూ ఉత్తీర్ణుడై, ప్రస్తుతం విఙాన్ విశ్వవిద్యాలయంలో ఐ.టి విభాగంలో సహాయ ఆచార్యులు (Assistana Professor) గా పనిచేస్తున్నారు. వీరు వ్రాసిన పలు వ్యాసాలు, అంతర్జాతీయ జర్నల్సులో ప్రచురితమైనవి. వీరు 2014 సంవత్సరంలో విఙాన్ విశ్వవిద్యాలయంలో ఉత్తమ ఆచార్యులు (Best Professor) గా ఎన్నికైనాడు

మూలాలు మార్చు