ఏలూరివారిపాలెం

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ఏలూరివారిపాలెం, ప్రకాశం జిల్లా, చీమకుర్తి మండలానికి చెందిన గ్రామం.పటం

గ్రామం
పటం
Coordinates: 15°32′53″N 79°53′06″E / 15.547999°N 79.884983°E / 15.547999; 79.884983
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంచీమకుర్తి మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523226 Edit this on Wikidata


గ్రామ పంచాయతీ మార్చు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో గోగినేని చంద్రశేఖరరావు, సర్పంచిగా ఎన్నికైనారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ రామ ఆలయం:

శ్రీ అభయాంజనేయస్వామివారి ఆలయం:- ఈ దేవస్థాన పంచమ వార్షికోత్సవాలు, 2014, జూన్-1, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం ఆలయంలో ఆకుపూజలతోపాటు పలు ప్రత్యేకపూజలు నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదానం, ప్రసాదాల పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రెండు విద్యుత్తు ప్రభలు భక్తులను బాగా ఆకర్షించినవి. ప్రభలపైన సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేసారు. [3]

ప్రధాన పంటలు మార్చు

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు మార్చు

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు మార్చు

ఈ గ్రామానికి చెందిన మన్నం కృష్ణమూర్తి, ప్రస్తుతం హైదరాబాదు కేంద్రంగా పనిచేయుచున్న "వర్శిటీ ఎడ్యుకేషన్ మేనేజ్ మెంటు లిమిటెడ్" అను సంస్థలో ఛీఫ్ ఎక్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. వీరు జాతీయ రసాయనశాస్త్ర అధ్యాపకుల సమాఖ్య (ఏ.సి.టి) లో ఎక్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా ఎన్నికైనారు. ముంబై కేంద్రంగా పనిచేసే ఏ.సి.టి సంస్థలో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు మొదలైన ఏడు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించుచూ సౌత్ జోన్ నుండి వీరు, ఎక్జికూటివ్ కౌన్సిల్ సభ్యులగా ఎన్నికైనారు.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు